Asianet News TeluguAsianet News Telugu

నేడు స్టాక్ మార్కెట్ సందడి : సెన్సెక్స్ 52900 పైకి.. నిఫ్టీ 122.10 పాయింట్ల లాభం..

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం మొదటి రోజున లాభాలతో ముగిశాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు అంతర్జాతీయంగా మిశ్రమ సంకేతాలకు తోడు విదేశీ మదుపర్ల అమ్మకాల కొనసాగుతుండటంతో లాభాల వైపు పయనించాయి. సెన్సెక్స్ 363.79 పాయింట్లు (0.69 శాతం) పెరిగి 52,950.63 వద్ద, నిఫ్టీ 122.20 పాయింట్లు (0.78 శాతం) పెరిగి 15,885.20 వద్ద ముగిసాయి.

Stock Market today: share Market is buzzing on the first day of the week Sensex crosses 52900, Nifty also out
Author
Hyderabad, First Published Aug 2, 2021, 4:53 PM IST

 నేడు వారంలోని మొదటి ట్రేడింగ్ రోజున సోమవారం స్టాక్ మార్కెట్ లాభాలతో సందడి చేసింది. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ప్రైమరీ ఇండెక్స్ సెన్సెక్స్ 363.79 పాయింట్ల లాభంతో (0.69 శాతం) 52,950.63 వద్ద ముగియగా, మరోవైపు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 122.10 పాయింట్ల (0.77 శాతం) లాభంతో 15,885.15 వద్ద ముగిసింది. గత వారం బి‌ఎస్‌ఈ 30-షేర్ సెన్సెక్స్ 388.96 పాయింట్లు (0.73 శాతం) పడిపోయింది. 

విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ఈ వారం మాక్రో ఎకనామిక్ డేటా, కంపెనీల త్రైమాసిక ఫలితాలు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) వడ్డీ రేట్లపై నిర్ణయం స్టాక్ మార్కెట్ దిశను నిర్ణయిస్తాయి. అలాగే ప్రపంచవ్యాప్త ధోరణి, కరోనా వాక్సిన కూడా మార్కెట్‌పై ప్రభావం చూపుతుంది. ఈ వారం హెచ్‌డి‌ఎఫ్‌సి, పి‌ఎన్‌బి, అదానీ పోర్ట్స్, స్పెషల్ ఎకనామిక్ జోన్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, భారతీ ఎయిర్‌టెల్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), మహీంద్రా & మహీంద్రా త్రైమాసిక ఫలితాలు విడుదల కానున్న విషయం తెలిసిందే.

నేడు టైటాన్, శ్రీ సిమెంట్స్, బిపిసిఎల్, అదానీ స్టాక్ గ్రీన్ పోర్ట్‌లు, ఐచార్ మోటార్స్ లాభాలతో ముగిశాయి. మరోవైపు, యుపిఎల్, టాటా స్టీల్, బజ్ ఫిన్‌సర్వ్, టెక్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్ షేర్లు నష్టాలతో  ముగిశాయి.

 సెక్టోరల్ ఇండెక్స్‌ని పరిశీలిస్తే నేడు అన్ని సెక్టార్లు లాభాలతో  మూగిసాయి. వీటిలో ఫార్మా, ఆటో, ఎఫ్‌ఎంసిజి, ఐటి, మీడియా, ప్రైవేట్ బ్యాంకులు, పిఎస్‌యు బ్యాంకులు, ఫైనాన్స్ సేవలు, బ్యాంకులు, లోహాలు, బ్యాంకులు, రియల్టీ ఉన్నాయి. 

 స్టాక్ మార్కెట్ ఈ వారం ప్రారంభ ట్రేడ్‌లో లాభాలతో ప్రారంభించాయి. సెన్సెక్స్ 314.44 పాయింట్లు (0.60 శాతం) పెరిగి 52,901.28 వద్ద ప్రారంభమైంది. నిఫ్టీ 111.85 పాయింట్ల (0.17 శాతం) లాభంతో 15,874.90 వద్ద ప్రారంభమైంది. ఉదయం లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు అంతర్జాతీయంగా మిశ్రమ సంకేతాలకు తోడు విదేశీ మదుపర్ల అమ్మకాల కొనసాగుతుండటంతో లాభాల వైపు పయనించాయి. అయితే, మద్యాహ్నం 2 తర్వాత ఒక్కసారిగా కుప్పకూలిన తర్వాత ‎ఆటో, రియాల్టీ, ఆయిల్ & గ్యాస్ స్టాక్స్ సూచీలకు మద్దతుగా ఉండటంతో మార్కెట్ ముగిసే సమయంలో లాభాలవైపు పయనించాయి. నేడు డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.36 వద్ద ఉంది. 

  స్టాక్ మార్కెట్ శుక్రవారం నష్టాలతో ముగిసింది. సెన్సెక్స్ 66.23 పాయింట్లు (0.13 శాతం) తగ్గి 52,586.84 వద్ద ముగియగా, మరోవైపు నిఫ్టీ 15.40 పాయింట్లు (0.10 శాతం) తగ్గి 15,763.05 వద్ద ముగిసింది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios