Asianet News TeluguAsianet News Telugu

కొవిడ్‌-19 డెల్టా కేసులు.. నేడు నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్ 182 పాయింట్లు డౌన్..

దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు నష్టాలతో ముగిసాయి. ఉదయం స్వల్ప నష్టాలతో ప్రారంభమైన సూచీలు 11 గంటలు సమయంలో తిరిగి పుంజుకున్నాయి. కానీ ఆ తర్వాత నుంచి సూచీలు రోజులో ఏ దశలోనూ కోలుకోలేక పోయాయి. 
 

stock market today : sensex nifty share market close today latest news 9 july 2021 closing indian benchmark
Author
Hyderabad, First Published Jul 9, 2021, 6:19 PM IST

నేడు వారంలోని చివరి ట్రేడింగ్ రోజు శుక్రవారం స్టాక్ మార్కెట్ నష్టాలతో ముగిసింది. ఈ రోజు కాస్త అస్థిరత తరువాత బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ ప్రైమరీ ఇండెక్స్ సెన్సెక్స్ 182.75 పాయింట్లు (0.35 శాతం) తగ్గి 52,386.19 వద్ద ముగిసింది. మరోవైపు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 38.10 పాయింట్లు (0.24 శాతం) తగ్గి 15,689.80 వద్ద ముగిసింది. గత వారం బిఎస్‌ఇ 30 షేర్ల సెన్సెక్స్ 440.37 పాయింట్లు ఆంటే 0.83 శాతం తగ్గింది. 

ప్రముఖ పెట్టుబడిదారు రాకేశ్ ఝున్ ఝున్వాలా పెట్టుబడులు పెట్టడంతో ఎడెల్వీస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ షేర్లు శుక్రవారం బారిగా పెరిగాయి. బిగ్ బుల్ 1,51,25,000 షేర్లను కలిగి ఉందని ఎడెల్విస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ నివేదించింది.

జూన్ 30 నాటికి కంపెనీలో 1.61 శాతం వాటాను ఆయన కలిగి ఉన్నారు. ఈ కంపెనీలో ఆయన వాటా విలువ రూ .125 కోట్లకు పైగా ఉంటుంది. నేడు బిఎస్‌ఇలో ఎడెల్విస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ షేర్లు 7.85 పాయింట్ల (+ 9.98%) లాభంతో 86.50 వద్ద ముగిశాయి.

జెఎస్‌డబల్యూ  స్టీల్ ఉత్పత్తి పెరగడంతో 
ప్రైవేట్ స్టీల్ మేకర్ జెఎస్‌డబల్యూ  స్టీల్  ముడి ఉక్కు ఉత్పత్తి జూన్ 2021 తో ముగిసిన త్రైమాసికంలో 4.1 మిలియన్ టన్నులకు 39 శాతం పెరిగినట్లు తెలిపింది. గత ఏడాది ఇదే కాలంలో 29.6 లక్షల టన్నుల ఉత్పత్తి ఉందని జెఎస్‌డబ్ల్యు స్టీల్ ఒక ప్రకటనలో తెలిపింది. జూన్ 2021 లో ఉత్పత్తి 1.37 లక్షల టన్నులుగా ఉందని, జూన్ 2020 తో పోలిస్తే 18 శాతం ఎక్కువ అని కంపెనీ తెలిపింది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో వారు దేశంలోని వివిధ ఆసుపత్రులకు 65,000 టన్నులకు పైగా లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్‌ను సరఫరా చేసినట్లు కంపెనీ తెలిపింది. నేడు బిఎస్‌ఇలో జెఎస్‌డబ్ల్యు స్టీల్ షేర్లు 12.35 పాయింట్ల (+ 1.85%) లాభంతో 680.75 వద్ద ముగిశాయి. 

నేడు టాటా స్టీల్, బజాజ్ ఫిన్సర్వ్, అదాని పోర్ట్స్, భారతి ఎయిర్ టెల్, డివిస్ ల్యాబ్ షేర్లు లాభాలతో  ముగిశాయి. మరోవైపు, బజాజ్ ఆటో, టిసిఎస్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, రిలయన్స్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు నష్టాలతో  ముగిశాయి. 

 నేడు మెటల్, మీడియా, ఎఫ్‌ఎంసిజి, ఫార్మా, రియాల్టీ మినహా అన్ని రంగాలు నష్టాలతో మూగిశాయి. వీటిలో ఐటి, ఆటో, పిఎస్‌యు బ్యాంకులు, ఫైనాన్స్ సర్వీసెస్, బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకులు ఉన్నాయి.

స్టాక్ మార్కెట్ నష్టాలతో ఓపెన్ 
ఉదయం ప్రారంభంలో సెన్సెక్స్ 193.09 పాయింట్లు (0.37 శాతం) పడిపోయి 52375.85 స్థాయిలో ప్రారంభమైంది. నిఫ్టీ 15666.50 స్థాయిలో 61.40 పాయింట్లు (0.39 శాతం) పడిపోయింది. 

 స్టాక్ మార్కెట్ గురువారం నష్టాలతో ముగిసింది. కాస్త అస్థిరత తరువాత సెన్సెక్స్ 485.82 పాయింట్లు (0.92 శాతం) తగ్గి 52,568.94 వద్ద, మరోవైపు నిఫ్టీ 151.75 పాయింట్లు  0.96 శాతం క్షీణించి 15,727.90 వద్ద ముగిసింది.

 ఉదయం స్వల్ప నష్టాలతో ప్రారంభమైన సూచీలు 11 గంటలు సమయంలో తిరిగి పుంజుకున్నాయి.  ఆ తర్వాత నుంచి సూచీలు నేడు ఏ దశలోనూ కోలుకోలేకపోయాయి. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలకు తోడు పలు దేశాల్లో కొవిడ్‌-19 డెల్టా వేరియంట్‌ కేసులు పెరగడంతో స్టాక్ మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios