Asianet News TeluguAsianet News Telugu

నేడు లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్.. 52వేలకు పైగా పటిష్టంగా సెన్సెక్స్‌

దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. సానుకూల ప్రపంచ సూచనల నేపథ్యంలో ఆరంభంలోనే 200  పాయింట్లకు పైగా ఎగిసిన సెన్సెక్స్‌ 345 పాయింట్ల లాభంతో 52820 వద్ద నిఫ్టీ 97 పాయింట్ల లాభంతో 15819వద్ద కొనసాగుతున్నాయి.

Stock Market today : Sensex-Nifty open on the green mark, this week these factors will decide the direction of the market
Author
Hyderabad, First Published Jul 5, 2021, 12:14 PM IST

నేడు దేశీయ స్టాక్ మార్కెట్  మొదటి ట్రేడింగ్ రోజున  సోమవారం లాభాల్లో కొనసాగుతుంది. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ ప్రైమరీ ఇండెక్స్ సెన్సెక్స్  200  పాయింట్లకు పైగా ఎగిసి 228.23 పాయింట్ల (0.43 శాతం) లాభంతో 52712.90 వద్ద ప్రారంభమైంది.

నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్  నిఫ్టీ 15791.50 స్థాయిలో 69.30 పాయింట్ల లాభంతో  (0.44 శాతం) ప్రారంభమైంది. గత వారం బిఎస్‌ఇ 30 షేర్ల సెన్సెక్స్ 440.37 పాయింట్లతో 0.83 శాతం తగ్గింది.

ఆర్థిక డేటా, కంపెనీల మొదటి త్రైమాసిక ఫలితాలు, ప్రపంచ ధోరణి ద్వారా ఈ వారం స్టాక్ మార్కెట్ల దిశను  నిర్ణయిస్థాయి  అని శ్లేషకులు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సేవల రంగానికి సంబంధించిన పిఎంఐ డేటా ఈ వారం రానుంది, ఒక విధంగా ఇది వ్యాపార మనోభావాలను ప్రభావితం చేస్తుంది.

అంతేకాకుండా డాలర్‌కు వ్యతిరేకంగా రూపాయి అస్థిరత, ముడి చమురు ధరలు, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల పెట్టుబడి ధోరణి కూడా షేర్ మార్కెట్‌ని దిశానిర్దేశం చేస్తాయి. వాల్ స్ట్రీట్ శుక్రవారం కొత్త గరిష్ట స్థాయికి తాకింది.  దీనికితోడు ఒపెక్  దాని మిత్రదేశాల మధ్య  మరో సమావేశం నేపథ్యంలో చమురు ధరల  76 డాలర్లకు చేరింది. 

సెన్సెక్స్  టాప్ 10 కంపెనీలలో 8 కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ గత వారం క్షీణించింది. సెన్సెక్స్  టాప్ 10 కంపెనీలలో ఎనిమిది మార్కెట్ క్యాపిటలైజేషన్ సమిష్టిగా రూ .65,176.78 కోట్లకు తగ్గింది. వీటిలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టిసిఎస్), హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ అతిపెద్ద నష్టాలను చవిచూశాయి.

also read ఆకాశానికి ఇంధన ధరలు.. నేడు పెట్రోల్ ధర లీటరుకు ఎంత పెరిగిందంటే ?

రిలయన్స్ ఇండస్ట్రీస్ , హిందుస్తాన్ యూనిలీవర్ లిమిటెడ్ (హెచ్యుఎల్) మాత్రమే  మార్కెట్ క్యాపిటలైజేషన్లో పెరుగుదల కనిపించింది. టాప్ 10 కంపెనీల జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ మొదటి స్థానాన్ని నిలుపుకుంది. తరువాత టిసిఎస్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఇన్ఫోసిస్, హిందుస్తాన్ యూనిలీవర్, హెచ్‌డిఎఫ్‌సి, ఐసిఐసిఐ బ్యాంక్, ఎస్‌బిఐ, బజాజ్ ఫైనాన్స్, కోటక్ మహీంద్రా బ్యాంక్ వరుసగా ఉన్నాయి.

హెవీ స్టాక్స్  
హెవీ స్టాక్స్ గురించి మాట్లాడితే  నేడు  ప్రారంభంలో  డాక్టర్ రెడ్డి మినహా మిగతా షేర్లు  లాభాలతో ప్రారంభమయ్యాయి. వీటిలో బజాజ్ ఆటో, బజాజ్ ఫిన్ సర్వ్, అల్ట్రాటెక్ సిమెంట్, టాటా స్టీల్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, టిసిఎస్, బజాజ్ ఫైనాన్స్, మారుతి, పవర్ గ్రిడ్, ఏషియన్ పెయింట్స్, ఎం అండ్ ఎం, ఎల్ అండ్ టి, రిలయన్స్, ఐసిఐసిఐ బ్యాంక్, సన్ ఫార్మా, నెస్లే ఇండియా, టైటాన్, ఐటిసి, హెచ్‌డిఎఫ్‌సి, భారతి ఎయిర్‌టెల్, ఎస్‌బిఐ, ఎన్‌టిపిసి ఉన్నాయి.

స్టాక్ మార్కెట్  ఉదయం 9.02 గంటలకు ప్రీ-ఓపెన్ సమయంలో సెన్సెక్స్ 52699.55 స్థాయిలో 214.88 పాయింట్లు (0.41 శాతం) పెరిగింది. నిఫ్టీ 92.50 పాయింట్లు (0.59 శాతం) పెరిగి 15814.70 వద్ద ఉంది.

గత ట్రేడింగ్ రోజున స్టాక్ మార్కెట్ 
గత ట్రేడింగ్ రోజున 41.92 పాయింట్ల (0.08 శాతం) లాభంతో సెన్సెక్స్ 52360.52 వద్ద ప్రారంభమైంది. మరోవైపు నిఫ్టీ 17.70 పాయింట్లు (0.11 శాతం) పెరిగి 15697.70 స్థాయిలో ప్రారంభమైంది. స్టాక్ మార్కెట్ శుక్రవారం లాభాలతో  ముగిసింది. కాస్త అస్థిరత తరువాత సెన్సెక్స్ 166.07 పాయింట్లు (0.32 శాతం) పెరిగి 52,484.67 వద్ద ముగిసింది. మరోవైపు, నిఫ్టీ 42.20 పాయింట్లతో 0.27 శాతం లాభంతో 15,722.20 వద్ద ముగిసింది.
 

Follow Us:
Download App:
  • android
  • ios