Asianet News TeluguAsianet News Telugu

నేడు ఫ్లాట్ గా ముగిసిన స్టాక్ మార్కెట్: 56 వేలకు చేరువలో సెన్సెక్స్..

దేశీయ స్టాక్‌ మార్కెట్లు అతి స్వల్ప లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 4.89 పాయింట్లు (0.01%) లాభంతో 55,949.10 వద్ద ముగియగా, నిఫ్టీ 2.20 పాయింట్లు (0.01%) లాభపడి 16,636.90 వద్ద ముగిసింది. 

Stock Market today: Market closed at flat level today, Sensex close to 56 thousand
Author
Hyderabad, First Published Aug 26, 2021, 4:43 PM IST

నేడు స్టాక్ మార్కెట్ కాస్త అస్థిరతల తర్వాత ఫ్లాట్ స్థాయిలో ముగిసింది. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ ప్రైమరీ ఇండెక్స్ సెన్సెక్స్ 4.89 పాయింట్ల (0.01 శాతం) లాభంతో 55,949.10 వద్ద ముగిసింది. మరోవైపు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 2.25 పాయింట్ల (0.01 శాతం) లాభంతో 16,636.90 వద్ద ముగిసింది. గత వారం, బి‌ఎస్‌ఈ 30-షేర్ సెన్సెక్స్ 107.97 పాయింట్లు అంటే 0.19 శాతం పడిపోయింది. 

ఉదయం సానుకూలంగా ప్రారంభమైన ఇండెక్స్ లు క్రమ క్రమంగా పడిపోతూ మధ్యాహ్నం 1:00 గంటలకు ఒక్కసారిగా పడిపోయాయి. అంతర్జాతీయ సూచీల అస్థిరత మధ్య దేశీయ మార్కెట్ సూచీల ప్రారంభ లాభాలు ఆవిరి అయ్యాయి. ఆ తర్వాత సూచీలు పుంజుకొని స్వల్ప లాభాలతో ఇంట్రాడే ముగిసింది. నేడు డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.23 వద్ద నిలిచింది. 


బ్రిటానియా ఇండస్ట్రీస్, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ ఇన్సూరెన్స్‌, బీపీసీఎల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు లాభాల్లో ముగియగా, భారతి ఎయిర్ టెల్, జెఎస్ డబ్ల్యు స్టీల్, మారుతి సుజుకి, హిందాల్కో ఇండస్ట్రీస్ పవర్ గ్రిడ్ షేర్లు అధిక నష్టాలను చూశాయి.

also read ఈ ప్రభుత్వ పథకం కింద మీరు ప్రతి నెలా 3వేల పెన్షన్ పొందవచ్చు.. ఎలా అంటే ?

 నేడు ఎఫ్ఎంసిజి, ఫైనాన్స్ సర్వీసులు, బ్యాంకులు, రియాల్టీ, ప్రైవేట్ బ్యాంకులు లాభాలతో ముగిసాయి. మరోవైపు, మెటల్, ఐటి, పిఎస్‌యు బ్యాంక్, ఫార్మా, ఆటో, మీడియా రెడ్ మార్క్‌తో ముగిశాయి.

 స్టాక్ మార్కెట్  ఉదయం సెన్సెక్స్ 55947.12 వద్ద 2.91 పాయింట్ల (0.01 శాతం) స్వల్ప లాభంతో ప్రారంభమైంది. నిఫ్టీ 2.80 పాయింట్ల (0.02 శాతం) లాభంతో 16637.50 వద్ద ప్రారంభమైంది.

సెన్సెక్స్-నిఫ్టీ బుధవారం ఫ్లాట్ స్థాయిలో  ముగిసింది.  సెన్సెక్స్ 14.77 పాయింట్ల (0.03 శాతం) స్వల్ప క్షీణతతో 55,944.21 వద్ద ముగిసింది. మరోవైపు, నిఫ్టీ 10.05 పాయింట్ల (0.06 శాతం) లాభంతో 16,634.65 వద్ద ముగిసింది.

10 కంపెనీలలో ఏడు కంపెనీలు మార్కెట్ క్యాపిటలైజేషన్
  సెన్సెక్స్ 10 కంపెనీలలో ఏడు కంపెనీలు మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ 1,31,173.41 కోట్ల మేర పెరిగింది. టాప్ 10 కంపెనీల జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ మొదటి స్థానాన్ని నిలుపుకుంది. దాని తర్వాత వరుసగా  టి‌సి‌ఎస్, హెచ్‌డి‌ఎఫ్‌సి బ్యాంక్, ఇన్ఫోసిస్, హిందుస్థాన్ యూనిలీవర్, హెచ్‌డి‌ఎఫ్‌సి, ఐ‌సి‌ఐ‌సి‌ఐ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, ఎస్‌బి‌ఐ, విప్రో ఉన్నాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios