Asianet News TeluguAsianet News Telugu

స్టాక్ మార్కెట్ టుడే: నేడు రికార్డు స్థాయిలో ముగిసిన సెన్సెక్స్.. మొదటిసారిగా 55500పైగా జంప్..

నేడు   బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ ప్రైమరీ ఇండెక్స్ సెన్సెక్స్ 145.29 పాయింట్ల లాభంతో (0.26 శాతం) 55,582.58 వద్ద ముగిసింది. మరోవైపు, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 33.95 పాయింట్ల (0.21 శాతం) లాభంతో 16,563.05 వద్ద ముగిసింది. 

Stock Market today : market closed at a record level on the first day of the week, Sensex crossed 55500 for the first time
Author
Hyderabad, First Published Aug 16, 2021, 6:01 PM IST

నేడు ఈ వారం మొదటి ట్రేడింగ్ రోజున సోమవారం స్టాక్ మార్కెట్  కాస్త హెచ్చు తగ్గులు తర్వాత అత్యధిక స్థాయిలోముగిసింది. ఈ రోజు బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ ప్రైమరీ ఇండెక్స్ సెన్సెక్స్ 145.29 పాయింట్ల లాభంతో (0.26 శాతం) 55,582.58 వద్ద ముగిసింది.

మరోవైపు, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 33.95 పాయింట్ల (0.21 శాతం) లాభంతో 16,563.05 వద్ద ముగిసింది. శుక్రవారం కూడా సెన్సెక్స్-నిఫ్టీ రికార్డు స్థాయిలో ముగిసింది. ట్రేడింగ్ సమయంలో సెన్సెక్స్ 55680.75, నిఫ్టీ 16,589.40 ని తాకింది.  

గత వారం సెన్సెక్స్ 1,159.57 పాయింట్లు అంటే 2.13 శాతం లాభపడింది. శుక్రవారం బెంచ్ మార్క్ ఇండెక్స్ మొదటిసారిగా 55000 దాటింది. అలాగే ఆల్-టైమ్ గరిష్ట స్థాయి 55,487.79కి చేరుకుంది. గత నెల రోజుల నుండి చాలా కంపెనీల జూన్ త్రైమాసిక ఫలితాలు వెలువడ్డాయి.

ఇప్పుడు పెట్టుబడిదారుల దృష్టి ప్రపంచ ధోరణిపై ఉంటుంది. ప్రధాన కదలికలు లేనప్పుడు ప్రధానంగా ప్రపంచ ధోరణి దేశీయ మార్కెట్‌కు మార్గనిర్దేశం చేస్తుంది. ఈ వారంలో గురువారం ముహర్రం సందర్భంగా స్టాక్ మార్కెట్ మూసివేయబడుతుంది.

టాప్ 10 విలువైన కంపెనీల్లో ఎనిమిది కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ గత వారం రూ .1,60,408.24 కోట్లు పెరిగింది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), రిలయన్స్ ఇండస్ట్రీస్ అత్యధికంగా లాభపడ్డాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బజాజ్ ఫైనాన్స్ మాత్రమే నష్టపోయాయి.

also read ఎస్‌బిఐ కస్టమర్లకు ఫెస్టివల్ ఆఫర్.. ఇలా షాపింగ్ చేస్తే 70% వరకు డిస్కౌంట్ పొందవచ్చు..

ప్రస్తుతం మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ అగ్రస్థానంలో ఉంది. దాని తర్వాత వరుసగా టి‌సి‌ఎస్, హెచ్‌డి‌ఎఫ్‌సి బ్యాంక్, ఇన్ఫోసిస్, హిందుస్థాన్ యూనిలీవర్, ఐ‌సి‌ఐ‌సి‌ఐ బ్యాంక్,  స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బజాజ్ ఫైనాన్స్, కోటక్ మహీంద్రా బ్యాంక్ ఉన్నాయి.

 పెద్ద షేర్ల గురించి మాట్లాడుతూ  ట్రేడింగ్ తర్వాత ఐ‌ఓ‌సి, టాటా స్టీల్, బజాజ్ ఫైనాన్స్, ఎం&ఎం, బ్రిటానియా షేర్లు లాభాలతో ముగిశాయి. మరోవైపు ఐచర్ మోటార్స్, మారుతి, శ్రీ సిమెంట్, పవర్ గ్రిడ్, బజాజ్ ఆటో షేర్లు నష్టాలతో  ముగిశాయి.  

మీరు సెక్టోరల్ ఇండెక్స్‌ని పరిశీలిస్తే  నేడు ఫైనాన్స్ సర్వీసెస్, మెటల్, ఎఫ్‌ఎంసిజి మినహా అన్ని రంగాలు రెడ్ మార్క్‌లో మూగిసాయి. వీటిలో ఫార్మా, పిఎస్‌యు బ్యాంకులు, రియల్టీ, బ్యాంకులు, ఐటి, మీడియా, ప్రైవేట్ బ్యాంకులు, ఆటో ఉన్నాయి.

  స్టాక్ మార్కెట్ ప్రారంభ ట్రేడ్‌లో రెడ్ మార్క్‌తో  ఓపెన్ అయ్యింది. సెన్సెక్స్ 55356.88 స్థాయిలో 80.41 పాయింట్లు (0.15 శాతం) క్షీణించింది. నిఫ్టీ 25.90 పాయింట్ల (0.16 శాతం) క్షీణతతో 16503.20 వద్ద ప్రారంభమైంది.

సెన్సెక్స్-నిఫ్టీ శుక్రవారం అత్యధిక స్థాయిలో  ముగిసింది. సెన్సెక్స్ అత్యధిక స్థాయిలో 55,437.29 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 164.70 పాయింట్లు లాభపడి 16,529.10 పాయింట్ల వద్ద ముగిసింది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios