Asianet News TeluguAsianet News Telugu

స్టాక్ మార్కెట్ రికార్డులకు బ్రేక్.. నేడు సెన్సెక్స్-నిఫ్టీ నష్టాలతో క్లోజ్..

గత కొన్ని రోజులుగా రికార్డులతో దూసుకెళ్తున్న దేశీయ స్టాక్ మార్కెట్ల జోరుకు నేడు బ్రేక్ పడింది. సెప్టెంబర్ 7న ఇంట్రాడేలో రికార్డు స్థాయిలకు చేరిన తర్వాత బెంచ్ మార్క్ సూచీలు అస్థిరత మధ్య స్వల్పంగా నష్ట పోయాయి.

Stock Market: Three-day bullish streak broken, Sensex-Nifty closed on the red mark
Author
Hyderabad, First Published Sep 7, 2021, 5:08 PM IST

 నేడు రెండవ ట్రేడింగ్ రోజున మంగళవారం స్టాక్ మార్కెట్ కాస్త హెచ్చు తగ్గుల తర్వాత  నష్టాలతో ముగిసింది. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ ప్రైమరీ ఇండెక్స్ సెన్సెక్స్ 17.43 పాయింట్లు (0.03 శాతం) తగ్గి 58,279.48 వద్ద ముగిసింది. మరోవైపు, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 15.70 పాయింట్ల (0.09 శాతం) స్వల్ప క్షీణతతో 17,362.10 వద్ద ముగిసింది. గత వారంలో సెన్సెక్స్ 2,005.23 పాయింట్లు అంటే 3.57 శాతం పెరిగింది.   

విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ఈ వారం కూడా మార్కెట్ సానుకూలంగా ఉంటుందని భావిస్తున్నారు. అయితే అధిక విలువలు ఉన్న కారణంగా మార్కెట్‌లో కొంత లాభం-బుకింగ్ ఉండవచ్చు. మార్కెట్ ధోరణి ప్రపంచ ధోరణి ద్వారా ఎక్కువగా నిర్ణయించబడుతుంది. గణేష్ చతుర్థి రోజున అంటే  శుక్రవారం స్టాక్ మార్కెట్లు మూసివేయబడుతుంది.

ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ, వాక్సినేషన్ కారణంగా షేర్ మార్కెట్  ఉత్సాహంగా ఉంటుందని భావిస్తున్నారు. విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం రూపాయిలో అస్థిరత, బ్రెంట్ ముడి చమురు ధరలు, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల పెట్టుబడి వైఖరి కూడా మార్కెట్‌పై ప్రభావం చూపుతాయి.

also read ఎల్ సాల్వడార్ అధికారిక కరెన్సీగా బిట్‌కాయిన్.. ముందుగానే భారీగా కొనుగోలు.. మరిన్ని కొనేందుకు రెడీ..?

  భారతీ ఎయిర్‌టెల్, హెచ్‌డిఎఫ్‌సి, గ్రాసిమ్, ఐటిసి, ఇండస్‌ఇండ్ బ్యాంక్  లాభాలలో మరోవైపు హిందాల్కో, బిపిసిఎల్, సన్ ఫార్మా, విప్రో, యాక్సిస్ బ్యాంక్ షేర్లు నష్టాలలో  ముగిశాయి.  

సెక్టోరల్ ఇండెక్స్‌ని పరిశీలిస్తే  నేడు ఎఫ్‌ఎంసిజి, ఫైనాన్స్ సర్వీస్, మీడియా గ్రీన్ మార్క్‌లో ముగిశాయి. బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకులు, పిఎస్‌యు బ్యాంకులు, ఫార్మా, ఆటో, రియల్టీ, మెటల్, ఐటి రెడ్ మార్క్‌లో ముగిశాయి. 

నేడు ఉదయం స్టాక్ మార్కెట్ లాభాలతో  ప్రారంభించింది. సెన్సెక్స్ 111.94 పాయింట్ల (0.19 శాతం) లాభంతో 58408.85 వద్ద ప్రారంభమైంది. నిఫ్టీ 28.90 పాయింట్ల లాభంతో (0.17 శాతం) 17406.70 వద్ద ప్రారంభమైంది. 

సెన్సెక్స్-నిఫ్టీ సోమవారం రికార్డు స్థాయిలో  ముగిసింది. సెన్సెక్స్ 166.96 పాయింట్ల (0.29 శాతం) లాభంతో 58,296.91 వద్ద ముగిసింది. మరోవైపు, నిఫ్టీ 54.20 పాయింట్ల (0.31 శాతం) లాభంతో 17,377.80 వద్ద ముగిసింది.
 

Follow Us:
Download App:
  • android
  • ios