బలమైన గ్లోబల్ సంకేతాల నడుమ నేడు భారతీయ స్టాక్ మార్కెట్ కూడా బూమ్‌తో ప్రారంభమైంది. సెన్సెక్స్ 510 పాయింట్ల లాభంతో 58,410 వద్ద ట్రేడవుతుండగా, నిఫ్టీ 149 పాయింట్లు లాభంతో 17,192.75 వద్ద ట్రేడవుతోంది.
బుధవారం స్టాక్ మార్కెట్ సూచీలు అయిన సెన్సెక్స్, నిఫ్టీలు లాభాలతో ప్రారంభం అయ్యాయి. NSE నిఫ్టీ సూచీ 151.20 పాయింట్లు పెరిగి 17,194.50 వద్ద ప్రారంభం అవగా, BSE సెన్సెక్స్ 495.06 పాయింట్లు లాభంతో 58,395.25 వద్ద ప్రారంభమైంది. నిఫ్టీ 50లో అదానీ ఎంటర్‌ప్రైజెస్, మారుతీ, అదానీ పోర్ట్స్, టైటాన్, ఏషియన్ పెయింట్స్ టాప్ గెయినర్లు గా ఉన్నాయి. భారతీ ఎయిర్‌టెల్, ఎస్‌బిఐ లైఫ్, సన్ ఫార్మా, ఒఎన్‌జిసి, నెస్లే ఇండియా టాప్ లూజర్‌లుగా ఉన్నాయి.
నేటి మార్కెట్ ఎలా ఉండనుంది
ఈరోజు అంటే మార్చి 15న ప్రపంచ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందుతున్నాయి. దీని కారణంగా భారత స్టాక్ మార్కెట్ కూడా బలమైన ప్రారంభాన్ని అందుకుంది. USలో ఫిబ్రవరి ద్రవ్యోల్బణం డేటాలో క్షీణత కనిపిస్తోంది, ఇది వార్షిక ప్రాతిపదికన 6.4% నుండి 6%కి తగ్గింది. దీని కారణంగా, అమెరికన్, యూరోపియన్ సహా ఆసియా మార్కెట్లో బలం కనిపిస్తోంది. జపాన్‌కు చెందిన నిక్కీ, కొరియాకు చెందిన కోస్పి 1 శాతం లాభాన్ని నమోదు చేస్తున్నాయి. నిక్కీ 225, కోస్పి, కోస్‌డాక్, టాపిక్స్, ఎస్ అండ్ పి 200 సూచీలు 2 శాతం వరకు పెరిగాయి. మరోవైపు SGX నిఫ్టీ కూడా అర శాతం పెరిగింది, డౌ జోన్స్ కూడా 350 పాయింట్లు పెరిగింది. కమోడిటీ మార్కెట్‌లో, బ్రెంట్ క్రూడ్ మరియు డబ్ల్యుటిఐ క్రూడ్ వరుసగా 1 శాతం పెరిగి బ్యారెల్‌కు 78 డాలర్ల , బ్యారెల్‌కు 72 డాలర్లకి చేరుకుంది.
బుధవారం ఈ స్టాక్స్ పై ఓ లుక్కేయండి..(Buzzing Stocks)
సిప్లా: CQCILలో 51.1% వాటాను విక్రయించడానికి ఆఫ్రికా క్యాపిటల్‌వర్క్స్‌తో కంపెనీ ఒప్పందం కుదుర్చుకుంది
హెచ్‌సిసి: మేఘా ఇంజనీరింగ్ & ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌తో బుల్లెట్ రైలు స్టేషన్ నిర్మాణ ప్రాజెక్ట్‌ను కంపెనీ పొందింది.
HPCL: కంపెనీ చేవ్రాన్ బ్రాండ్స్ ఇంటర్నేషనల్ LLCతో ఒప్పందం కుదుర్చుకుంది
యాక్సిస్ బ్యాంక్: CRISIL రేటింగ్స్ ' స్టేబుల్' రేటింగ్‌ను అందించాయి.
NBCC : పుదుచ్చేరిలో ప్రభుత్వ వైద్య కళాశాల, ఆసుపత్రిని నిర్మించడానికి కంపెనీ రూ. 500 కోట్ల ఆర్డర్‌ను పొందింది.
