Asianet News TeluguAsianet News Telugu

మందగించిన స్టాక్ మార్కెట్: 69 పాయింట్లు పడిపోయిన సెన్సెక్స్, బలహీనపడ్డ నిఫ్టీ..

నిఫ్టీ కూడా 20 పాయింట్ల పతనంతో 19,750 దిగువన ట్రేడవుతోంది. ఎన్‌బీఎఫ్‌సీ, బ్యాంకింగ్ షేర్లలో అమ్మకాల కారణంగా మార్కెట్‌పై ఒత్తిడి నెలకొంది.

Stock market sluggish on the last trading day of the week, Sensex fell by 69 points, Nifty also weak-sak
Author
First Published Nov 17, 2023, 10:23 AM IST

నేడు శుక్రవారం స్టాక్ మార్కెట్ బలహీనంగా ప్రారంభమైంది. రెండు రోజుల బ్రేక్  తర్వాత మార్కెట్‌లోని ప్రధాన సూచీలు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ట్రేడింగ్ ప్రారంభంలోనే సెన్సెక్స్ 140 పాయింట్లు పతనమై 65,850 దిగువకు పడిపోయింది.

మరోవైపు నిఫ్టీ కూడా 20 పాయింట్ల పతనంతో 19,750 దిగువన ట్రేడవుతోంది. ఎన్‌బీఎఫ్‌సీ, బ్యాంకింగ్ షేర్లలో అమ్మకాల కారణంగా మార్కెట్‌పై ఒత్తిడి నెలకొంది.

ఆర్‌బీఐ నిర్ణయం ప్రభావం బ్యాంకింగ్ స్టాక్స్‌లో కనిపించింది. వ్యక్తిగత రుణాలపై రిస్క్ వెయిటేజీని 25% పెంచాలని రిజర్వ్ బ్యాంక్ నిర్ణయించింది. గురువారం బీఎస్‌ఈ సెన్సెక్స్ 306 పాయింట్లు లాభపడి 65,982 వద్ద ముగిసింది.

 అలీబాబా షేర్లలో 8 శాతం పతనం మధ్య షాంఘై కాంపోజిట్ 0.4 శాతం క్షీణించింది. కాగా, హ్యాంగ్ సెంగ్ 1.65 శాతం క్షీణించగా.. ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా బెంచ్ మార్క్ సూచీలు వరుసగా 0.2 శాతం, 0.80 శాతం పడిపోయాయి. నిక్కీ మాత్రమే గ్రీన్‌లో 0.06 శాతం పెరిగింది. డౌ జోన్స్ 0.13 శాతం జారిపోగా, S&P 500 0.12 శాతం పెరిగింది, 

ఆగస్టు నుంచి సెప్టెంబర్ వరకు కేవలం రెండు నెలల్లోనే రూ.21,900 కోట్ల పెట్టుబడులు వచ్చాయి.ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి అక్టోబర్ చివరి వరకు నిఫ్టీ 10 శాతం పెరగ్గా, నిఫ్టీ మిడ్‌క్యాప్ 150 ఇండెక్స్ 28 శాతం పెరిగింది. మరియు నిఫ్టీ స్మాల్‌క్యాప్ 250 37 శాతం పెరిగింది.
 

Follow Us:
Download App:
  • android
  • ios