Asianet News TeluguAsianet News Telugu

ఆర్థిక సంవత్సరం చివరి ట్రేడింగ్ రోజున పడిపోయిన స్టాక్ మార్కెట్: సెన్సెక్స్-నిఫ్టీ డౌన్..

2020-21 ఆర్థిక సంవత్సరం చివరి ట్రేడింగ్ రోజున హెచ్చుతగ్గుదల మధ్య స్టాక్ మార్కెట్  నష్టాలతో ముగిసింది.  ఈ వారంలో హోలీ ఇంకా గుడ్ ఫ్రైడే సందర్భంగా స్టాక్ మార్కెట్ మూసివేయబడుతుంది.

stock market sensex and nifty today 31 march 2021 closing indian benchmark ended lower
Author
Hyderabad, First Published Mar 31, 2021, 4:52 PM IST

నేడు స్టాక్ మార్కెట్ 2020-21 ఆర్థిక సంవత్సరం చివరి ట్రేడింగ్ రోజున నష్టాలతో ముగిసింది. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్  ఇండెక్స్ సెన్సెక్స్ 627.43 పాయింట్లు లేదా 1.25 శాతం క్షీణించి 49509.15 వద్ద ముగిసింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 154.40 పాయింట్లు లేదా 1.04 శాతం తగ్గి 14690.70 స్థాయిలో ముగిసింది. 30 షేర్ల బిఎస్‌ఇ సెన్సెక్స్ గత వారంలో 849.74 పాయింట్లు లేదా 1.70 శాతం కోల్పోయింది. 29 మార్చి 2021న హోలీ సందర్భంగా దేశీయ స్టాక్ మార్కెట్ మూతపడింది. అలాగే శుక్రవారం గుడ్ ఫ్రైడే సందర్భంగా స్టాక్ మార్కెట్ మూసివేయబడుతుంది.

నేడు టాటా స్టీల్, యుపిఎల్, గ్రాసిమ్, బజాజ్ ఫిన్ సర్వ్, ఐటిసి షేర్లు లాభాలతో  ముగిశాయి. హెచ్‌డిఎఫ్‌సి, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, పవర్ గ్రిడ్, టెక్ మహీంద్రా నష్టాలతో ముగిశాయి. 

 ఈ రోజు మెటల్, ఎఫ్‌ఎంసిజి, పిఎస్‌యు బ్యాంకులు, ఫార్మా ఇంకా రియాల్టీ లాభాలతో ముగియగా మీడియా, ఐటి, ఆటో, ఫైనాన్స్ సర్వీసెస్, ప్రైవేట్ బ్యాంకులు  నష్టాలతో ముగిశాయి.

also read నీతా అంబానీ కోట్ల విలువైన ప్రైవేట్ జెట్‌.. ఇందులోని కళ్ళు చెదిరే సౌకర్యాలు చూస్తే షాక్ అవ్వాల్సిందే....

టాప్ 10 కంపెనీలలో ఏడు మార్కెట్ క్యాపిటలైజేషన్ 
గత వారం సెన్సెక్స్  టాప్ 10 కంపెనీలలో ఏడు మార్కెట్ క్యాపిటలైజేషన్ 1,07,566.64 కోట్ల రూపాయలకు క్షీణించింది. ఈ నష్టంలో సగం రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు మాత్రమే చెందింది. టాప్ 10 కంపెనీల జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ మొదటి స్థానాన్ని నిలుపుకోగా తరువాత టిసిఎస్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఇన్ఫోసిస్, హిందుస్తాన్ యూనిలీవర్, హెచ్‌డిఎఫ్‌సి, ఐసిఐఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఎస్‌బిఐ, బజాజ్ ఫైనాన్స్‌లు వరుసగా ఉన్నాయి.

నేడు స్టాక్ మార్కెట్ ప్రారంభంలో సెన్సెక్స్ 336.90 పాయింట్లు (0.67 శాతం) తగ్గి 49799.68 స్థాయిలో ప్రారంభమైంది. నిఫ్టీ 82.30 పాయింట్లు లేదా 0.55 శాతం తగ్గి 14762.80 వద్ద ప్రారంభమైంది. 

40 వేల నుండి 52 వేల వరకు స్టాక్ మార్కెట్ ప్రయాణం...
అక్టోబర్ 8న సెన్సెక్స్ 40 వేలు దాటి 40182 కి చేరుకుంది. 
దీని తరువాత సెన్సెక్స్ నవంబర్ 5న 41,340 వద్ద ముగిసింది. 
నవంబర్ 10న ఇంట్రాడేలో ఇండెక్స్ 43,227కు పెరిగింది. 
నవంబర్ 18న ఇది 44180 స్థాయికి చేరుకుంది. 
డిసెంబర్ 4న ఇది 45000 మార్కును దాటి 45079 వద్ద ముగిసింది. 
డిసెంబర్ 11న, సెన్సెక్స్ 46 వేలకు పైన ఎగిసి 46099 స్థాయిలో ముగిసింది.
డిసెంబర్ 28న సెన్సెక్స్ 47353 వద్ద  ముగిసింది.
జనవరి 4న సెన్సెక్స్ కొత్త రికార్డు సృష్టించి మొట్టమొదటిసారి 48000 పైకి ఎగిసి  48176.80 వద్ద ముగిసింది.
జనవరి 11న బిఎస్‌ఇ సెన్సెక్స్ ఆల్‌టైమ్ గరిష్ట స్థాయిలో 49269.32 వద్ద ముగిసింది.
దేశీయ స్టాక్ మార్కెట్ జనవరి 21న అత్యధిక స్థాయిలో ప్రారంభమైంది. సెన్సెక్స్ 223.17 పాయింట్ల లాభంతో 50 వేలకు పైన 50,015.29 వద్ద ప్రారంభమైంది. ఆ సమయంలో నిఫ్టీ కూడా రికార్డు స్థాయిలో 14,707.70 వద్ద ఉంది. 
ఫిబ్రవరి 5న జరిగిన ట్రేడింగ్ సెషన్లో సెన్సెక్స్ మొదటిసారి 51 వేలు దాటింది. అలాగే నిఫ్టీ కూడా మొదటిసారి 15 వేలకు చేరుకుంది. ఇది సెన్సెక్స్-నిఫ్టీ  ఇంట్రాడే స్థాయి. చివరకు సెనెస్క్ష్  50731.63, నిఫ్టీ  14,924.25 వద్ద ముగిసింది.
ఫిబ్రవరి 15న సెన్సెక్స్ 52 వేలకు మించిపోయి మొదటిసారిగా 52154.13 వద్ద ముగిసింది. నిఫ్టీ 151.40 పాయింట్ల లాభంతో 15314.70 స్థాయిలో ముగిసింది. 

Follow Us:
Download App:
  • android
  • ios