అమ్మకాల ఒత్తిడితో నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్...284 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్..
దేశీయ సూచీలు ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ 50, సెన్సెక్స్ గురువారం రెడ్‌లో ముగిశాయి, నిఫ్టీ 50 18,800 దిగువన 85 పాయింట్లు క్షీణించి 18,771 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్ 0.45 శాతం క్షీణించి 63,238 వద్ద ముగిసింది. సెక్టార్ల వారీగా మెటల్ మాత్రమే స్వల్పంగా ఎగువన ముగియగా, మిగిలిన సూచీలు నష్టాల్లో ముగిశాయి. బ్యాంక్ నిఫ్టీ 43,724 వద్ద ముగియగా, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్ 1.67 శాతం క్రాష్ అయ్యింది.
బలహీన ప్రపంచ మార్కెట్ సంకేతాల మధ్య మధ్య నేడు దేశీయ స్టాక్ మార్కెట్ లు బలహీనపడ్డాయి.నేటి ట్రేడింగ్ ప్రారంభంలో సెన్సెక్స్ 63602 వద్ద కొత్త గరిష్టాన్ని నమోదు చేసినప్పటికీ, తరువాత కొంత బలహీనత కనిపించింది. నిఫ్టీ కూడా 18862 స్థాయికి చేరుకోగా, తర్వాత క్షీణించింది. సెన్సెక్స్ దాదాపు 300 పాయింట్లు నష్టపోయింది. నిఫ్టీ 18800 దిగువన ముగిసింది.
నేటి ట్రేడింగ్ లో దాదాపు అన్ని రంగాలలో క్షీణత ఉంది. నిఫ్టీలో బ్యాంక్, ఫైనాన్షియల్, ఆటో, రియల్టీ, ఎఫ్‌ఎంసిజి, ఐటి, ఫార్మా ఇండెక్స్‌లలో బలహీనత కనిపంచింది. నేడు సెన్సెక్స్ 284 పాయింట్ల బలహీనతతో 63,239 వద్ద ముగిసింది. నిఫ్టీ 86 పాయింట్లు నష్టపోయి 18,771 వద్ద ముగిసింది. హెవీవెయిట్ స్టాక్స్‌లో అమ్మకాలు జరిగాయి. నేటి టాప్ గెయినర్స్‌లో LT, TATASTEEL, HDFC, BHARTIARTL, HDFCBANK, M&M ఉన్నాయి. BAJFINANCE, ASIANPAINT, TATAMOTORS, POWERGRID, NTPC, టాప్ లూజర్లలో ఉన్నాయి.
నేటి మార్కెట్లో విశేషాలు..
>> ఫిచ్ రేటింగ్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2023-24లో GDPలో వృద్ధి అంచనాను 6.3 శాతానికి పెంచింది. అంతకుముందు, ఫిచ్ భారతదేశ వృద్ధి రేటును 6 శాతంగా అంచనా వేసింది. జనవరి-మార్చి త్రైమాసికంలో మెరుగైన వృద్ధి రేటు దృష్ట్యా, రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారతదేశ జిడిపి వృద్ధి అంచనాను పెంచింది. అంతకు ముందు 2022-23 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 7.2 శాతంగా ఉంది.
>> లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్‌ఐసి) ఇనుప ఖనిజం ఉత్పత్తి చేసే ఎన్‌ఎండిసిలో తన 2 శాతం వాటాను సుమారు రూ.649 కోట్లకు విక్రయించింది. ప్రభుత్వ రంగ జీవిత బీమా సంస్థ ఎల్‌ఐసీ స్టాక్ ఎక్స్ఛేంజీలకు ఇచ్చిన సమాచారంలో ఎన్‌ఎండిసికి చెందిన 6.06 కోట్ల షేర్లను బహిరంగ మార్కెట్‌లో విక్రయించామని, ఇది 2.07 శాతం వాటాకు సమానమని పేర్కొంది. ఈ సేల్ మార్చి 14 నుంచి జూన్ 20 వరకు జరిగింది. ఒక్కో షేరు సగటు ధర రూ.107.59కి విక్రయించబడింది.
>> శ్రీరామ్ ఫైనాన్స్‌లో పిరమల్ ఎంటర్‌ప్రైజెస్ తన 8.34 శాతం వాటాను రూ.4,824 కోట్లకు బహిరంగ మార్కెట్‌లో విక్రయించింది. NSEలో అందుబాటులో ఉన్న డేటా ప్రకారం, ఈ కాలంలో 3,12,21,449 షేర్లు ఒక్కొక్కటి రూ.1,545 చొప్పున విక్రయించబడ్డాయి, మొత్తం అమ్మకాలు రూ.4,823.71 కోట్లకు చేరాయి. దీని కొనుగోలుదారులలో ఆదిత్య బిర్లా సన్ లైఫ్ మ్యూచువల్ ఫండ్ (MF), కోటల్ మహీంద్రా MF, ICICI ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ, మానిటరీ అథారిటీ ఆఫ్ సింగపూర్, బ్లాక్‌రాక్ మరియు BNP పరిబాస్ ఉన్నాయి.