సోమవారం స్టాక్ మార్కెట్(stock market) ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే భారీ పతనం కారణంగా పెట్టుబడిదారులు (investors)భారీ నష్టాన్ని చవిచూశారు. లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్ గత ట్రేడింగ్  చివరి రోజున శుక్రవారం రూ.263.47 లక్షల కోట్ల నుంచి రూ.258.11 లక్షల కోట్లకు చేరింది. అంటే ఈ పతనం కారణంగా ఇన్వెస్టర్లు ఐదు లక్షల కోట్ల రూపాయలకు పైగా నష్టపోయారు.

స్టాక్ మార్కెట్‌కు సోమవారం బ్లాక్ డే. నేడు నష్టాలతో ట్రేడింగ్ ప్రారంభమైన తర్వాత సెన్సెక్స్, నిఫ్టీ రెండూ ఒక్కసారిగా కుప్పకూలాయి. సెన్సెక్స్‌ ఓపెనింగ్‌తో 1400 పాయింట్లకు పడిపోయి 56 వేల స్థాయికి జారుకుంది. దీనితో పాటు నిఫ్టీ సూచీ కూడా బలంగా క్షీణించి 410 పాయింట్ల పతనాన్ని చూడగా 16,900 కనిష్ట స్థాయికి చేరుకుంది. స్టాక్ మార్కెట్ ప్రారంభంలో ఈ భారీ పతనం ఇన్వెస్టర్లకు భారీ నష్టాలను తెచ్చిపెట్టింది. 

సోమవారం ట్రేడింగ్ ప్రారంభమైన తరువాత 
స్టాక్ మార్కెట్‌లో ఈ భారీ పతనం కారణంగా పెట్టుబడిదారులు పెద్ద నష్టాన్ని చవిచూశారు. లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్ చివరి ట్రేడింగ్ రోజైన శుక్రవారం రూ.263.47 లక్షల కోట్ల నుంచి రూ.258.11 లక్షల కోట్లకు చేరింది. అంటే ఈ పతనం కారణంగా ఇన్వెస్టర్లు ఐదు లక్షల కోట్ల రూపాయలకు పైగా నష్టపోయారు. సెన్సెక్స్‌లోని 30 స్టాక్స్‌లో టీసీఎస్ మినహా మిగిలిన 29 స్టాక్‌లు రెడ్ మార్క్‌లో ట్రేడవుతుండటం గమనార్హం. 

బ్యాంకింగ్ స్టాక్స్
నేటి పతనంలో చాలా స్టాక్స్ పతనంతో ట్రేడవుతున్నాయి. అయితే ఈ మధ్య కాలంలో బ్యాంకింగ్ షేర్లు భారీ పతనాన్ని చవిచూస్తున్నాయి. ఎస్‌బీఐ షేర్లు 4 శాతం వరకు క్షీణించగా, హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు 3 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 3.50 శాతం వరకు పడిపోయాయి. ఇతర షేర్లను పరిశీలిస్తే.. అల్ట్రాటెక్, డాక్టర్ రెడ్డీ, లార్సెన్ అండ్ టూబ్రో, టాటా స్టీల్ బజాజ్ ఫైనాన్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫిన్ సర్వ్ 3-3 శాతం మధ్య క్షీణించాయి. ఎయిర్‌టెల్, టైటాన్, ఏషియన్ పెయింట్స్, మారుతీ, టెక్ మహీంద్రా, కోటక్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, విప్రో నెస్లే షేర్లు కూడా 2-2 శాతం మధ్య నష్టపోయాయి.

అదానీ-అంబానీ షేర్లు
ఈ పతనం కారణంగా ముకేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్, గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ విల్మార్ షేర్లు కూడా క్షీణించాయి. అదానీ విల్మార్ షేరు 2.56 శాతం వరకు నష్టపోగా రిలయన్స్, హిందుస్థాన్ యూనిలీవర్, ఇన్ఫోసిస్, ఐటీసీ, ఎన్టీపీసీ 1 శాతం చొప్పున నష్టపోయాయి. 

సోమవారం స్టాక్ మార్కెట్ భారీగా పతనమవడానికి ప్రధాన కారణం 
అమెరికాలో ద్రవ్యోల్బణం పెరగడమే కాకుండా మార్చి నుంచి అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచే అవకాశం కూడా షేర్ మార్కెట్‌ను ప్రభావితం చేసింది. రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొనడం వల్ల గ్లోబల్ మార్కెట్లతో పాటు దేశీయ మార్కెట్ కూడా పతనమై ఇన్వెస్టర్ల సెంటిమెంట్లను ప్రభావితం చేస్తోంది.