Asianet News TeluguAsianet News Telugu

స్టాక్ మార్కెట్ బూమ్: మొదటిసారి 55 వేల మార్కును దాటిన సెన్సెక్స్, రికార్డు జంప్ చేసిన నిఫ్టీ..

 నేడు దేశీ సూచీలు సరికొత్త ఎత్తులకు చేరుకున్నాయి.  ఈ రోజు ఉదయం 54,91 పాయింట్లతో మొదలైన సెన్సెక్స్‌ ఓ దశలో 55,847 పాయింట్లను తాకింది. చివరికి సాయంత్రం స్టాక్ మార్కెట్‌ ముగిసే సమయానికి 593 పాయింట్లు లాభపడి 55,437 పాయింట్ల వద్ద ముగిసింది

stock market condition: Sensex crossed 55 thousand mark for the first time, record jump in Nifty too
Author
Hyderabad, First Published Aug 13, 2021, 6:08 PM IST

నేడు  స్టాక్ మార్కెట్‌కు శుక్రవారం కలిసొచ్చినట్టుంది. ఎందుకంటే ఈ రోజు సెన్సెక్స్ 593.31 పాయింట్లు లాభపడి ఆల్-టైమ్ గరిష్ట స్థాయి 55,437.29 వద్ద ముగిసింది.  నిఫ్టీ కూడా 164.70 పాయింట్లు లాభపడి 16,529.10 పాయింట్ల వద్ద ముగిసింది. అంతేకాకుండా రూపాయి ఫ్లాట్‌గా ఉంది. దీని ధర స్వల్పంగా పెరిగి డాలర్‌కు 74.24 (తాత్కాలిక) వద్ద ముగిసింది.

ఈ రోజు ఉదయం స్టాక్ మార్కెట్ పటిష్టంగా ప్రారంభమైంది. షేర్ మార్కెట్ ప్రారంభమైన వెంటనే సెన్సెక్స్ 55103.44 చేరింది. మరోవైపు నిఫ్టీ రికార్డు స్థాయిలో 16,387.50 వద్ద  ప్రారంభమైంది. ప్రపంచ స్థాయి పెరుగుదలతో పెట్టుబడిదారులు ఐటీ, బ్యాంకింగ్, ఆటో, విద్యుత్ స్టాక్‌లలో ర్యాలీ చూశారు. గురువారం కూడా సెన్సెక్స్ రికార్డు స్థాయిలో 54,874.10 వద్ద, నిఫ్టీ 16,375.50 వద్ద ముగిసింది. 

బి‌ఎస్‌ఈ 30-షేర్ సెన్సెక్స్ ఈరోజు 593.31 పాయింట్లు (1.08 శాతం) పెరిగి 55,437.29 పాయింట్లకు చేరింది. అలాగే మొదటిసారి 55 వేల మార్కును దాటింది. ఇది ఎప్పుడు లేని  అత్యధిక ముగింపు స్థాయి. సెన్సెక్స్  కూడా ఆల్‌టైమ్ గరిష్ట స్థాయి 55,487.79 పాయింట్లను తాకింది. సెన్సెక్స్ కంపెనీలలో టిసిఎస్ (టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్) వాటా అత్యధికంగా మూడు శాతానికి పైగా పెరిగింది.

నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్  నిఫ్టీ కూడా మొదటిసారిగా 16,500 స్థాయిని దాటింది. నిఫ్టీ 164.70 పాయింట్లు (1.01 శాతం) పెరిగి ఆల్‌టైమ్ గరిష్ట స్థాయి 16,529.10 వద్ద ముగిసింది. నేటి ట్రేడింగ్‌లో నిఫ్టీ కూడా ఆల్‌టైమ్ గరిష్ట స్థాయి 16,543.60 పాయింట్లను తాకింది.  

also read వాహనదారులకు గుడ్ న్యూస్.. పెట్రోల్ ధరను రూ .3 తగ్గిస్తు ప్రభుత్వం ప్రకటన..

 అలాగే శుక్రవారం స్టాక్ మార్కెట్ మంచి వృద్ధిని నమోదు చేసింది. స్టాక్ మార్కెట్ ప్రారంభమైన వెంటనే 55,000 మార్క్ దాటింది. ఉదయం 9:29 గంటలకు బిఎస్‌ఇ సూచీ 55,077.59 పాయింట్లకు చేరుకుంది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ కూడా జంప్ చేసి ఉదయం 9.35 గంటలకు నిఫ్టీ 72.30 పాయింట్లు పెరిగి 16,439.10 పాయింట్ల వద్ద ట్రేడైంది. మహీంద్రా అండ్ మహీంద్రా స్టాక్ అత్యధికంగా పెరిగాయి. ఎల్&టి, హెచ్‌డి‌ఎఫ్‌సి బ్యాంక్, ఐ‌టి‌సి, యాక్సిస్ బ్యాంక్ లాభపడ్డాయి. మరోవైపు టెక్ మహీంద్రా, డాక్టర్ రెడ్డీస్, సన్ ఫార్మా, పవర్ గ్రిడ్, టాటా స్టీల్ షేర్లు నష్టాల్లో ట్రేడయ్యాయి.

ప్రపంచ మార్కెట్ పెరుగుదలతో పెట్టుబడిదారులు ఐటి, బ్యాంకింగ్, ఆటో, పవర్ స్టాక్‌లలో ర్యాలీని చూశారు. స్టాక్ మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం, యుఎస్ డాలర్‌తో రూపాయి మారకం విలువ 19 శాతం మార్కెట్ సెంటిమెంట్‌ను బలపరిచింది. బ్యాంకింగ్, ఫైనాన్స్, ఆటో, ఐటి రంగ షేర్లు కూడా పెరిగాయి. 

గురువారం నాడు సెన్సెక్స్ 54,874.10 స్థాయిలో నిఫ్టీ 16,375.50 వద్ద రికార్డు స్థాయికి చేరుకున్నాయి. సెన్సెక్స్ 318 పాయింట్లు పెరిగి 54,843.98 వద్ద ముగిసింది. నిఫ్టీ 82 పాయింట్లు ఎగసి 16,364.40 వద్ద ముగిసింది. సెన్సెక్స్  21 షేర్లు పెరిగాయి, 9 స్టాక్‌లు నష్టాలతో ముగిశాయి, ఇందులో పవర్ గ్రిడ్ షేర్లు 6 శాతం లాభంతో, టెక్ మహీంద్రా షేర్లు 4.66 శాతం లాభంతో ముగిశాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios