SBI: స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియాలో అకౌంటుదారులకు అలర్ట్..వెంటనే బ్రాంచీకి వెళ్లండి..ఎందుకంటే..?

రిజర్వ్ బ్యాంక్ ఇండియా మారిన నిబంధనల ప్రకారం లాకర్ కలిగి ఉన్న అకౌంట్ దారులను వెంటనే బ్యాంకుకు వెళ్లి సంప్రదించాలని కోరింది.  మీరు కూడా ఎస్బిఐలో లాకర్ కలిగి ఉన్నట్లయితే వెంటనే బ్రాంచీని వెళ్లి సంప్రదించండి ఎందుకో పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. 

 

state bank of India has sent you an alert regarding your account in the bank MKA

దేశంలోనే అతిపెద్ద బ్యాంక్ ఎస్బిఐ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త నిబంధనలను ప్రవేశపెడుతోంది తద్వారా తన కస్టమర్లకు మరింత సదుపాయాలను మరింత సెక్యూరిటీని అందించేందుకు నిరంతరం ప్రయత్నిస్తోంది.  ఇందులో భాగంగా తాజాగా ఎస్బిఐ తన కస్టమర్లకు కొత్త అలెర్ట్ ను జారీ చేసింది.  తాజాగా ఈ అలర్ట్ ఎస్బిఐ లో లాకర్ ఉన్న కస్టమర్లకు వర్తిస్తుంది.  ఈ అలర్ట్ ప్రకారం ఎవరైతే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో లాకర్ కలిగి ఉన్నారో వెంటనే వారు  బ్రాంచ్ కి వెళ్లి లాకర్ అగ్రిమెంట్ పై సంతకం చేయాలని సూచన చేసింది.  డిసెంబర్ 31 2023 లోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ఇప్పటికే ఎస్బిఐ ట్విట్టర్ ద్వారా తెలిపింది. 

చాలామంది కస్టమర్లు తమ విలువైన వస్తువులను డాక్యుమెంట్లను లాకర్లలో పొందుపరుస్తూ ఉంటారు.  ఒక్కోసారి కొన్ని ప్రమాదాల వల్ల లాకర్లో ఉన్న వస్తువులు  నష్టపోయే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో జనవరి 1, 2023 నాటికి బ్యాంకులు తమ కస్టమర్ లాకర్ ఒప్పందాలను పునరుద్ధరించాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులను ఆదేశించింది.

బ్యాంకులు తమ ఖాతాదారులను వీలైనంత త్వరగా సంప్రదించాలని, కొత్త కాంట్రాక్టులను వీలైనంత త్వరగా పునరుద్ధరించుకోవాలని రిజర్వ్ బ్యాంక్ ఆదేశించింది. బ్యాంకుల ఈ కొత్త ఒప్పందంలో లాకర్‌లో వస్తువులను ఉంచడానికి సంబంధించిన నిబంధనలను ప్రస్తావించారు. లాకర్‌లో కస్టమర్‌లు ఏయే వస్తువులను ఉంచవచ్చో, ఉంచకూడదో ఇది తెలియజేస్తుంది. 

బ్యాంకు కొత్త నిబంధనల్లో, లాకర్‌లో ఉంచిన వస్తువుల గురించి రిజర్వ్ బ్యాంక్‌కు పేర్కొంది. దీని ఆధారంగా, ఇప్పుడు మీరు బ్యాంకులో నగలు లేదా ఆస్తి పత్రాలు వంటి అవసరమైన పత్రాలను మాత్రమే ఉంచుకోవచ్చు. దీనితో పాటు, లాకర్ ఇప్పుడు వినియోగదారులకు వారి వ్యక్తిగత ఉపయోగం కోసం మాత్రమే ఇవ్వనున్నారు అని కొత్త నిబంధనలో పేర్కొన్నారు. ఇందుకోసం ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ మోడల్ ఒప్పందాన్ని చేసుకుంటుందని, ఇందులో బ్యాంకులు చిన్న చిన్న మార్పులు చేస్తూ కస్టమర్లతో ఒప్పందం చేసుకుంటాయి. 

రిజర్వ్ బ్యాంక్ కొత్త నిబంధనల ప్రకారం, బ్యాంకు లాకర్‌లో కొన్ని రకాల వస్తువులు ఉంచడం చట్టవిరుద్ధం. పేలుడు పదార్థాలు లేదా మాదక ద్రవ్యాలు ఉంచడానికి ఇప్పటికే అనుమతి లేదు. కానీ కొత్త నిబంధన ప్రకారం, ఇప్పుడు కరెన్సీ నోట్లు కూడా ఉంచకూడదు. అలాగే ఇతర దేశాలకు చెందిన డాలర్ లేదా కరెన్సీని కలిగి ఉన్న నగదును ఉంచడం పూర్తిగా నిషేధించబడింది. ఇది కాకుండా, ఆయుధాలు, మందులు విషపూరిత వస్తువులను ఉంచడంపై కూడా నిషేధం ఉంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios