Asianet News TeluguAsianet News Telugu

మైక్రోసాఫ్ట్ భాగస్వామ్యంతో బి.టెక్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న ఎస్‌ఆర్ యునివర్సిటి..

ఈ కోర్సులో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, మెషీన్ లర్నింగ్, సైబర్ సెక్యూరిటీ, డాటా సైన్స్, బిగ్ డేటా, డేటా అనలిటిక్స్, క్లౌడ్ ఇంజనీరింగ్, దేవ్ఒప్స్ ఆటోమేషన్ అంశాలలో స్పెషలైజేషన్ చేసే అవకాశం కూడా ఈ కోర్సు కల్పిస్తోంది.

SR University launches B.Tech program in partnership with Microsoft.
Author
Hyderabad, First Published Aug 25, 2020, 2:29 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

వరంగల్, ఆగస్ట్  25, 2020 : “మైక్రోసాఫ్ట్ భాగస్వామ్యంతో ఎస్‌ఆర్ విశ్వవిద్యాలయం టెక్నాలజీ ఫోకస్ తో  కంప్యూటర్ సైన్స్, అండ్ ఇంజనీరింగ్ బి.టెక్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తుది. ఈ కోర్సులో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, మెషీన్ లర్నింగ్, సైబర్ సెక్యూరిటీ, డాటా సైన్స్, బిగ్ డేటా, డేటా అనలిటిక్స్, క్లౌడ్ ఇంజనీరింగ్, దేవ్ఒప్స్ ఆటోమేషన్ అంశాలలో స్పెషలైజేషన్ చేసే అవకాశం కూడా ఈ కోర్సు కల్పిస్తోంది.


మనం సమాజం నాలుగో పారిశ్రామిక విప్లవం తెస్తున్న మార్పుల ఆధారంగా నడుస్తోంది. మనం పనిచేస్తున్న ఆఫీసుల్లో కూడా ఈ మార్పులు మనం చూస్తున్నాం. సాంకేతిక ప్రగతి, క్లౌడ్ పురోగతి వల్ల సామాజికార్థిక రంగాలో, వివిధ ప్రాంతాల్లో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ మార్పులు సమాజం ముందు కొత్త డిమాండ్లని ముందుంచుతున్నాయి. కొత్త ఆకాంక్షలకు రూపం ఇస్తున్నాయి. ఈ మార్పులు కొత్త భవిష్యత్తును రచించబోతున్నాయి. 

ఈ మార్పులకు అనుగుణంగా విశ్వవిద్యాలయాలు కూడా విద్యార్థులను కొత్త భవితకు సంసిధ్దులను చేసేదిశగా తమను తాము మార్చుకోవలసిని అవసరం వుంది. ఈ తరం విద్యార్థులకు సరైన టూల్స్ అందుబాటులో వుండటం,  నేర్చుకునేందుకు అవకాశాలు వుండటం, పని అనుభవాలు వుండటం, కొత్త సాంకేతిక భవితకు కావలసిన కొత్త నైపుణ్యాలలో తర్ఫీదు అయివుండటం చాలా అవసరం. 

విద్యార్థులను భాగస్వామ్యం (collaboration), సమాచారవ్యక్తీకరణ నైపుణ్యం (communication skills), నిశితంగా విశ్లేషించగల నేర్పు (critical thinking,  కంప్యూటర్ అవగాహన,  లాంటి 21వ శతాబ్దం నైపుణ్యాలలో తర్ఫీదు చేస్తూనే మరోవైపు వారిని డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు కావలసిన ఇతర సాంకేతిక అంశాలలో తర్ఫీదు చేయడం కూడా ప్రస్తుత దశలో చాలా అససరంగా మారింది. 


క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, మెషీన్ లర్నింగ్ లాంటి వాటికి ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా పలు సంస్థల్లో, కంపెనీలలో విపరీతమైన డిమాండ్ వుంది. అయితే ఈ డిమాండు కు తగిన నిపుణులు, తర్ఫీదయిన విద్యార్థుల కొరత ఇప్పటికే చాలా వుంది. ఇది ఇలాగే కొనసాగితే ముందు ముందు ఈ కొరత మరింత పెరిగే ప్రమాదం కూడా వుంది. 

also read అదానీ గ్రూప్ చేతికి ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం.. 74% వాటాలపై కన్ను.. ...

సరిగ్గా ఈ ఖాళీని భర్తీ చేసేందుకే ఎస్‌ఆర్  విశ్వవిద్యాలయం, ప్రఖ్యాత మైక్రోసాఫ్ట్ కంపెనీ భాగస్వామ్యంతో ఈ కొత్త బి.టెక్ కోర్సును ప్రారంభిస్తోంది, “  అని విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డా. జి‌ఆర్‌సి  రెడ్డి తెలిపారు. అకడమిక్ రంగంలో  45 ఏళ్ళ అనుభవం గడించిన ఎస్‌ఆర్ విశ్వవిద్యాలయం (గతంలో ఎస్‌ఆర్ ఇంజనీరింగ్ కాలేజి) ఇటీవలే ఏ‌ఆర్‌ఐ‌ఐ‌ఏ-ఎం‌హెచ్‌ఆర్‌డి ద్వారా దేశంలోనే ప్రైవేట్ / స్వంత ఆర్థిక వనరుల కలిగిన విద్యాసంస్థల్లో నెంబర్ 1గా నిలిచింది. 


అన్ని బి.టెక్ కోర్సులలో టైర్ -1 ఎన్‌బి‌ఏ అక్రిడియేషన్ కలిగిన ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయం ఎస్‌ఆర్‌యూ. ఇంజనీరింగ్ లో ఎన్‌ఐ‌ఆర్‌ఎఫ్ లో 160వ ర్యాంక్ సాధించింది. ఒవరాల్ కేటగిరి లో 151-200 ర్యాంక్ బ్యాండ్ లో వుంది.  ఎన్‌ఎస్‌టి‌ఈ‌డి‌బి, డిపార్ట్ మెంట్ ఆఫ్ సైన్స్ ఇండ్ టెక్నాలజీ ఆర్థిక సహకారంతో నడుస్తున్న భారతదేశంలోనే టైర్ – II సిటీలలో వున్న అతి పెద్ద  ఇంక్యుబేషన్ సెంటర్  ఎస్‌ఆర్‌యూ టెక్నాలజి బిజినెస్ ఇంక్యుబేటర్ SRiX (ఎస్‌ఆర్‌ఐ ఇన్నోవేషన్ ఎంక్సేంజ్). ఇప్పటి దాకా 41 పేటెంట్లు ఎస్‌ఆర్‌యూ సాధించింది.


2000కు పైగా వివిధ ప్రముఖ సాంకేతిక పత్రికల్లో మా సిబ్బంది, విద్యార్థులు రాసిన పరిశోధనాత్మక వ్యాసాలు ప్రచరితమయ్యాయి.  డి‌ఎస్‌టి, ఏ‌ఐ‌సి‌టి‌ఈ‌టి, యూ‌జి‌సి  లాంటి ప్రతిష్టాత్మక సంస్థలతో 52 స్పాన్సర్డ్ రిసర్చ్ ప్రాజెక్ట్స్, కార్యక్రమాలు నిర్వహించింది.


ఎస్‌ఆర్‌యూతో భాగస్వామ్యంలో వున్న విదేశీ విశ్వవిద్యాలయాలు
 ప్రూడ్ విశ్వవిద్యాలయం, యూ మాస్ లోవెల్ విశ్వవిద్యాలయం, సెయింట్ లూయిస్ విశ్వవిద్యాలయం, యూ‌ఎస్‌ఏలో వున్న మిస్సోరీ విశ్వవిద్యాలయం, యూ‌కేలో వున్న క్రాన్ ఫీల్డ్ విశ్వవిద్యాలయం, ఆస్ట్రేలియా లోవున్న డీకీన్ విశ్వవిద్యాలయం

Follow Us:
Download App:
  • android
  • ios