Asianet News TeluguAsianet News Telugu

గ్రామీణ వ్యాపారవేత్తల కోసం జీరో పెట్టుబడి వ్యాపార అవకాశాలను పరిచయం చేసిన స్పైస్‌ మనీ

 స్పైస్‌ మనీ నేడు తమ వినూత్నమైన, జీరో పెట్టుబడి ప్రవేశ పథకం ఆవిష్కరిస్తున్నట్లు వెల్లడించింది. గ్రామీణ వ్యాపారవేత్తలు దీనిద్వారా స్పైస్‌ మనీ అధికారీ నెట్‌వర్క్‌లో పూర్తి ఉచితంగా భాగమయ్యే అవకాశం కలుగుతుంది.  

Spice Money introduces Zero Investment business opportunity for Rural Entrepreneurs
Author
Hyderabad, First Published Feb 11, 2021, 6:22 PM IST

హైదరాబాద్‌, ఫిబ్రవరి 11,2021: భారతదేశంలో సుప్రసిద్ధ గ్రామీణ ఫిన్‌టెక్‌ స్పైస్‌ మనీ నేడు తమ వినూత్నమైన, జీరో పెట్టుబడి ప్రవేశ పథకం ఆవిష్కరిస్తున్నట్లు వెల్లడించింది. గ్రామీణ వ్యాపారవేత్తలు దీనిద్వారా స్పైస్‌ మనీ అధికారీ నెట్‌వర్క్‌లో పూర్తి ఉచితంగా భాగమయ్యే అవకాశం కలుగుతుంది.  

ఈ పరిమిత కాలపు జీరో పెట్టుబడి కార్యక్రమం, దేశవ్యాప్తంగా ఒక కోటి మంది గ్రామీణ వ్యవస్ధాపకులను డిజిటల్‌గా మరియు ఆర్ధికంగా శక్తివంతం చేయాలనే స్పైస్‌మనీ లక్ష్యంకు ఓ ఆకృతి ఏర్పడటంతో పాటుగా పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాలలో కంపెనీ యొక్క డిజిటల్‌ చెల్లింపుల పర్యావరణ వ్యవస్ధను బలోపేతం చేయనుంది.

ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో, ఆర్ధికశాఖామాత్యులు తాము డిజిటల్‌ చెల్లింపులపై దృష్టి సారించినట్లుగా వెల్లడించారు. స్పైస్‌ మనీ ఈ లక్ష్యానికి అనుగుణంగా ఉండటంతో పాటుగా పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాలలో డిజిటల్‌ చెల్లింపులకు అత్యుత్తమంగా అనుమతిస్తుంది.

జీరో ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రవేశ కార్యక్రమం ఇప్పుడు వలస కార్మికులు, కిరాణా స్టోర్ల యజమానులు, ఉద్యోగార్థులు, తాజా గ్రాడ్యుయేట్లు, గృహిణిలు, మరియు ఇతరులు స్పైస్‌ మనీ అధికారి నెట్‌వర్క్‌లో భాగం కావడంతో పాటుగా స్వీయ ఉపాధికి భరోసానూ పొందగలరు.

అలాగే తమ సొంత పట్టణాలలో జీవనోపాధి అవకాశాలనూ పొందగలరు. ప్రస్తుతం,  స్పైస్‌ మనీ నెట్‌వర్క్‌పై ఉన్న ఐదు లక్షల మంది అధికారీల నెట్‌వర్క్‌లో 65%కు పైగా 30ఏళ్ల వయసు లోపు వారే ! వీరిలో చాలామంది ఔత్సాహిక వ్యాపారవేత్తలుగా వెలుగొందుతున్నారు.

స్పైస్‌ మనీ ఫౌండర్‌ దిలీప్‌ మోదీ మాట్లాడుతూ ‘‘జీరో ఇన్వెస్ట్‌మెంట్‌ ఎంట్రీ కార్యక్రమం ఇప్పుడు పట్టణ మరియు గ్రామీణ భారతదేశంలోని భారతీయ యువతను ఎలాంటి ఖర్చు లేకుండా స్పైస్‌ మనీ అధికారీలుగా మారేందుకు ప్రోత్సహిస్తుంది.

ఈ కార్యక్రమం స్పైస్‌ మనీ నెట్‌వర్క్‌ను విస్తరించడంతో పాటుగా అవసరమైన డిజిటల్‌ ఆర్థిక, ఈ–రిటైల్‌ సేవలను బ్యాంకు సేవలు అందుబాటులో లేని కమ్యూనిటీలకు మరీ ముఖ్యంగా దేశంలోని మారుమూల ప్రాంతాలకు సైతం అందిస్తుంది.

తమ సొంత డిజిటల్‌ దుకాన్‌ ద్వారా తమ సొంత రాబడిని పెంపొందించుకోవడానికి మద్దతునందించడం ద్వారా భారతదేశపు డిజిటల్‌ మరియు ఆర్థిక భవిష్యత్‌కు భరోసా అందించాలనే మా ప్రయత్నాలలో మరో ముందడుగు ఇది’’ అని అన్నారు.

స్పైస్‌ మనీతో ఇటీవలే భాగస్వామ్యం చేసుకున్న నటుడు, దాత సోనూ సూద్‌ మాట్లాడుతూ ‘‘స్పైస్‌ మనీ యొక్క సాంకేతిక నైపుణ్యం మరియు డిజిటల్‌ మౌలిక వసతులు, భారతీయులందరికీ సామాజిక–ఆర్థిక స్వాతంత్య్రం అందించాలనే నా కలను సాకారం చేయడంలో తోడ్పడుతున్నాయి.

మరీముఖ్యంగా అంతగా అభివృద్ధికి నోచుకోని ప్రాంతాలలో !లాక్‌డౌన్‌ సమయంలో వేలాది మంది వలసకార్మికులు ఇబ్బందులు పడటం నేను చూశాను. నిరుపేదలకు తమ జీవనోపాధిని పెంపొందించుకునేలా సహాయపడటానికి ముందుకు రావాల్సిన సమయమిది. గ్రామాలలో లేదా పట్టణాలలో వారు ఎక్కడ ఆవాసమున్నప్పటికీ – హమే హర్‌ గావోం కో డిజిటల్లీ సాక్షమ్‌ బనానా హై అని అనాలి.

స్పైస్‌ మనీ యొక్క సృజనాత్మక నో–కాస్ట్‌ వ్యాపార ప్రతిపాదన ద్వారా, పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాలలో ఉన్న అధికశాతం మంది ప్రజలకు విజయవంతంగా చేరువ కాగలమనే విశ్వాసంతో ఉన్నాము మరియు స్వీయ సమృద్ధిని సాధించడంతో పాటుగా తమ రాతను తామే మార్చుకోవాలనే వారికి సహాయపడగలం’’ అని అన్నారు. 

మహమ్మారి కారణంగా వచ్చిన లాక్‌డౌన్‌ సమయంలో వేలాది మంది వలస కార్మికులు మరియు గ్రామీణ ప్రాంత ప్రజలు నిస్సహాలుగా నిలువడంతో పాటుగా ఉపాధినీ కోల్పోయి , ఆర్ధికంగా నష్టపోయారు. స్పైస్‌ మనీ మరియు నటుడు సోనూసూద్‌లు ఏకతాటిపైకి రావడంతో పాటుగా వ్యవస్థాపక అవకాశాలు కల్పించడం ద్వారా వారి కష్టాలను తీర్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

‘స్పైస్‌మనీ తో లైఫ్‌ బనీ’ అనే ట్యాగ్‌లైన్‌ ద్వారా వీరు  వారికి వ్యవస్థాపక వేదికను సృష్టించడంతో పాటుగా డిజిటల్‌, ఆర్ధిక సేవలను అందిస్తున్నారు. ఈ జీరో–ఇన్వెస్ట్‌మెంట్‌ ఎంట్రీ కార్యక్రమం అనేది ఈ లక్ష్యం చేరుకునే దిశగా తోడ్పడుతుంది.

జీరో ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రోగ్రామ్‌తో పాటుగా స్పైస్‌ మనీ ఇప్పుడు ప్రస్తుత మరియు నూతన అధికారీలకు అద్దె ఫీజులను మాఫీ చేయడంతో పాటుగా వారి వ్యవస్థాపక, స్వీయ సమృద్ధి ప్రయాణంలో ప్రోత్సాహమందిస్తుంది. ఆర్ధిక సమ్మిళితను మరింత వేగవంతం చేస్తూ,. ఈ కంపెనీ ఇప్పుడు ఓ కార్యక్రమం ప్రారంభించింది.

దీనిలో భాగంగా  అధికారీలు (వ్యాపారవేత్తలు) కంపెనీ యొక్క మైక్రో ఏటీఎం లేదా మినీ మ్యాజిక్‌ ఉపకరణాలను  జీరో ఖర్చుతో పొందగలరు. దీనిద్వారా దేశంలో ఏటీఎం మౌలిక వసతులు, మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో మరింత బలోపేతం అవుతాయి. 

స్పైస్‌ మనీ ఇప్పుడు యుద్ధ ప్రాతిపదికన పనిచేయడంతో పాటుగా దేశవ్యాప్తంగా తమ ఆర్థిక కూర్పును విస్తరిస్తూ 18వేలకు పైగా పిన్‌కోడ్స్‌ను 700కు పైగా జిల్లాలు మరియు 5000కు పైగా బ్లాక్స్‌ను చేరుకోవడానికి కృషి చేస్తుంది. 


స్పైస్‌ మనీ గురించి
స్పైస్ మనీ భారతదేశంలోని ప్రముఖ గ్రామీణ ఫిన్‌టెక్ సంస్థ, ఈ సంస్థతో 5 లక్షల అధికారి (వ్యవస్థాపకులు) క్యాష్  ఆఫరింగ్ డిపాజిట్, క్యాష్ విత్ డ్రా కోసం ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్, మినీ ఎటిఎం, ఇన్సూరెన్స్, లోన్స్, బిల్ పేమెంట్లు, కస్టమర్ / ఏజెంట్లు / ఎన్‌బిఎఫ్‌సి / బ్యాంకుల కోసం  క్యాష్ కలెక్షన్ కేంద్రం, ఎయిర్‌టైమ్ రీఛార్జ్, టూర్స్ & ట్రావెల్, ఆన్‌లైన్ షాపింగ్, పాన్ కార్డ్ , ఎం‌పి‌ఓ‌ఎస్ సేవలు ఉన్నాయి. వారి నెట్‌వర్క్‌లో 90% కంటే ఎక్కువ సెమీ అర్బన్, గ్రామీణ భారతదేశంలో ఉన్నాయి.

స్పైస్ మనీ యాప్ (అధికారి యాప్), వెబ్ పోర్టల్ ద్వారా స్పైస్ మనీ సేవలు అందుబాటులో ఉన్నాయి. యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్‌ఫేస్ , సుపీరియర్ టెక్నాలజీ ప్లాట్‌ఫాం యాప్ స్పైస్‌ మనీ గూగుల్ ప్లే స్టోర్‌లో 4.4 స్టార్ రేటింగ్‌ను సంపాదించింది , పరిశ్రమలో ఉత్తమంగా నిలిచింది. స్పైస్ మనీ తన అత్యాధునిక టెక్నాలజి, స్తృత నెట్‌వర్క్ ద్వారా భారతదేశం అంతటా ప్రజలకు వివిధ ఆర్థిక సేవల అంతరాలను తగ్గిస్తుంది. ”

మరింత సమాచారం కోసం   https://spicemoney.com చూడండి

మరిన్ని  సందేహాల కోసం దయచేసి సంప్రదించండి
స్పైస్ మనీ
శ్రీలంజన ముఖర్జీ 
shrilanjana.mukherjee@spicemoney.com

+ 91 91631 70601
 

Follow Us:
Download App:
  • android
  • ios