2022లో తమ సంపాదన, సేవింగ్స్ తగ్గిపోతాయని లోకల్ సర్కిల్స్ నిర్వహించిన తాజా సర్వేలో ప్రతి రెండు కుటుంబాల్లో ఒక కుటుంబం అభిప్రాయపడింది. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు 2021లో రికార్డ్ గరిష్టానికి చేరుకున్నాయి.
2022లో తమ సంపాదన, సేవింగ్స్ తగ్గిపోతాయని లోకల్ సర్కిల్స్ నిర్వహించిన తాజా సర్వేలో ప్రతి రెండు కుటుంబాల్లో ఒక కుటుంబం అభిప్రాయపడింది. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు 2021లో రికార్డ్ గరిష్టానికి చేరుకున్నాయి. అన్ని నగరాల్లో లీటర్ పెట్రోల్ ధర రూ.100 దాటింది. కొన్ని ప్రాంతాల్లో అయితే రూ.120 కూడా దాటింది. అయితే కేంద్ర ప్రభుత్వ సెస్ తగ్గించడంతో దీపావళికి ముందు పెట్రోల్, డీజిల్ ధరలు కాస్త శాంతించాయి. ఇప్పుడు ఈ ధరలు రూ.90 నుండి రూ.110 మధ్య ఉన్నాయి. అలాగే, కొన్ని రాష్ట్రాలు కూడా కేంద్రం దారిలో నడిచి, వ్యాట్‌ను తగ్గించాయి. కానీ ఉక్రెయిన్ పైన రష్యా దండయాత్ర తర్వాత ధరలు పెరుగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగాయి. ఈ ప్రభావంతో దేశీయంగా ఈ ధరలు పెరిగే అవకాశముంది. అప్పుడు నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతాయి.
ఆదాయం తగ్గుతుందని..!
ధరలు పెరిగే అవకాశాలున్నాయని, ఈ నేపథ్యంలో ఎలా ఖర్చు చేస్తారనే అంశంపై సర్వేలో పాల్గొన్నవారు స్పందించారు. దేశంలోని 361 జిల్లాలకు పైగా ఉన్న వారి ద్వారా సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో 66 శాతం మంది పురుషులు, 34 శాతం మంది మహిళలు పాల్గొన్నారు. మొత్తం 27,000 మంది సర్వేలో పాల్గొన్నారు. ప్రతి ఇద్దరిలో ఒకరు కూడా 2022లో తమ ఆదాయం తగ్గుతోందని చెప్పారు. 35 శాతం మంది శాతం మంది ఆదాయం స్థిరంగా ఉంటుందని, నాలుగు శాతం మంది పెరుగుతోందన్నారు.
సేవింగ్స్ గురించి అడగగా, ప్రతి ఇద్దరిలో ఒకరు 2022లో సేవింగ్స్ తగ్గుతాయని చెప్పారు. కేవలం 11 శాతం మంది మాత్రమే పెరుగుతాయని చెప్పారు. ఆరు శాతం మంది మాత్రం ఆదాయం 25 శాతం అంతకంటే పెరుగుతుందన్నారు. 42 శాతం మంది ఇండియన్ హౌస్ హోల్డ్స్ రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగే అవకాశముందని, దీనిని భరించలేమని చెప్పారు. 22 శాతం మంది మాత్రమే స్వల్పకాలిక పెరుగుదలను తట్టుకోవచ్చునని చెప్పాయి. తొమ్మిది శాతం మంది 20 శాతం వరకు, ఏడు శాతం మంది 10 శాతం వరకు, 16 శాతం మంది 5 శాతం వరకు పెరగవచ్చున్నారు. రెండేళ్ల కరోనా ప్రభావం తర్వాత ఇప్పుడు ఉక్రెయిన్-రష్యా దేశాల మధ్య యుద్ధం నేపథ్యంలో ఈ ఏడాది భారతీయుల ఆదాయాలు, పొదుపులు తగ్గుతాయని లోకల్ సర్కిల్స్ సర్వే ఫలితాలు వెల్లడించాయి.
