బ్యాంక్ కొత్త బ్రాంచ్ ఓపెన్ అవుతుంది అంటే చాలా మందికి లావాదేవీల పరంగా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే బ్యాంక్ పనుల కోసం ఇతర ప్రదేశాలకి వెళ్లాల్సిన పని ఉండధు. అలాంటిది ఒకవేళ నకిలీ బ్రాంచ్ ఓపెన్ అయితే  ఇలాంటి సంఘటనే తమిళనాడులో చోటు చేసుకుంది.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బి‌ఐ) డూప్లికేట్ బ్రాంచ్ నడుపుతున్న ముగ్గురు వ్యక్తులను తమిళనాడు పోలీసులు ఈ రోజు అరెస్ట్ చేశారు. ముగ్గురిలో ఒకరు మాజీ బ్యాంకు ఉద్యోగి కుమారుడు. పన్రూటిలోని పోలీస్ ఇన్స్పెక్టర్ అంబేత్కర్ దీనిని ధృవీకరించారు.

మాజీ బ్యాంక్ ఉద్యోగి అయిన నిరుద్యోగ యువకుడు ప్రధాన నిందితుడు కమల్ బాబుతో సహా ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు చెప్పారు. అతని తండ్రి 10 సంవత్సరాల క్రితం మరణించగా, అతని తల్లి రెండేళ్ల క్రితం బ్యాంకు నుండి రిటైర్ అయ్యింది.

also read ముకేశ్ అంబానీ ఖాతాలో మరో రికార్డు : సంపదలో బిజినెస్ టైకూన్‌ను అధిగమించేశాడు.. ...

అరెస్టు చేసిన ఇతర ఇద్దరు వ్యక్తులలో ఒకరు ప్రింటింగ్ ప్రెస్ నడుపుతున్న వ్యక్తి, ఇతను అన్ని రశీదులు, చలాన్లు ఇతర పత్రాలు ప్రింట్ చేస్తాడు. మరొక వ్యక్తి రబ్బరు స్టాంపులను ముద్రించడం చేస్తాడు. పన్రూటిలో ఒక ఎస్‌బి‌ఐ కస్టమర్ దినిని గమనించి, ఎస్‌బి‌ఐ బ్రాంచ్ మేనేజర్ కి ఈ విషయాన్ని చేరవేశాడు.

తరువాత ఈ విషయం జోనల్ కార్యాలయానికి విస్తరించింది, అయితే పన్రూటిలో ఎస్‌బి‌ఐ రెండు శాఖలు మాత్రమే నడుస్తున్నాయని మూడవ బ్రాంచ్ లేదని  బ్రాంచ్ మేనేజర్‌కు వారు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న బ్యాంకు మానేజర్ పోలీసులకి సమాచారం ఇవ్వడంతో  ఈ నకిలీ బ్యాంక్ భాగోతం వెలుగులోకి వచ్చింది.

ఎస్‌బి‌ఐ అధికారులు  డూప్లికేట్ బ్రాంచ్ స్థలాన్ని సందర్శించారు ఇందులో ఉన్న అన్ని మౌలిక సదుపాయాలు అచ్చం ఎస్‌బి‌ఐ బ్యాంకు బ్రాంచ్ లాగా ఏర్పాటు చేసిన సేటాప్ చూసి వారు ఆశ్చర్యపోయారు. వెంటనే ఎస్‌బి‌ఐ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు  ఆ ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. మరో విషయం ఏంటంటే ఈ నకిలీ బ్యాంకులో ఎలాంటి లావాదేవీలు జరగలేదని, అందువల్ల ఎవరూ డబ్బును కోల్పోలేదని ఎస్‌బి‌ఐ వారు తెలిపారు.