Asianet News TeluguAsianet News Telugu

భార్య నగలు అమ్ముకుని నెట్టుకొస్తున్నా: అనిల్ అంబానీ సంచలన ప్రకటన

రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ సోదరుడు అనిల్ ధీరూభాయ్ అంబానీ గ్రూప్ (అడాగ్) అధినేత అనిల్ అంబానీ సంచలన విషయం ప్రకటించారు. అప్పులతో తాను పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోయానని ఇప్పుడు తన దగ్గర ఏమీ లేదని మరోసారి చేతులేత్తేశారు.

sold wife jewellery to pay legal fees': Anil Ambani to UK court in Chinese loans case
Author
New Delhi, First Published Sep 26, 2020, 3:02 PM IST

రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ సోదరుడు అనిల్ ధీరూభాయ్ అంబానీ గ్రూప్ (అడాగ్) అధినేత అనిల్ అంబానీ సంచలన విషయం ప్రకటించారు. అప్పులతో తాను పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోయానని ఇప్పుడు తన దగ్గర ఏమీ లేదని మరోసారి చేతులేత్తేశారు.

కేవలం ఒక కారుతో చాలా సాధారణ జీవితాన్ని గడుపుతున్నానని వాపోయారు. ఇప్పుడున్న పరిస్ధితుల్లో తన ఖర్చులను సైతం తన భార్య, ఇతర కుటుంబసభ్యులు భరిస్తున్నారని, తన వద్ద చిల్లి గవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

అంతేకాకుండా 2020 జనవరి-జూన్ మధ్య కాలంలో చట్టపరమైన ఖర్చుల కోసం 9.9 కోట్ల రూపాయలను వెచ్చించినట్లు తెలిపారు. మూడు  చైనా బ్యాంకుల రుణాల ఎగవేత కేసులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా యూకే కోర్టు విచారణకు హాజరైన అనిల్ అంబానీ ఈ విషయం ప్రకటించారు.

విచారణలో భాగంగా యుకె కోర్టు లగ్జరీకార్ల సముదాయం గురించి అంబానీని ప్రశ్నించినప్పుడు ప్రస్తుతం ఒకకారును మాత్రమే ఉపయోగిస్తున్నానని,రోల్స్ రాయిస్ కారు లేదని తేల్చిచెప్పారు.

తన భార్య నగలు అమ్మి కోర్టు ఖర్చులు భరిస్తున్నట్టు అనిల్ అంబానీ తెలిపారు. తన తల్లికి 500 కోట్ల రూపాయలు, కుమారుడు అన్మోల్‌కు 310 కోట్ల రూపాయలు బాకీ ఉన్నానన్నారు. టీనా అనిల్ అంబానీ కలెక్షన్ గురించి  కూడా బ్యాంకుల తరపున వాదిస్తున్న కౌన్సిల్ ప్రశ్నించింది.

అయితే అదంతా టీనాకు చెందిందే అని, కేవలం టీనా భర్తగా తన పేరు  ఉందని చెప్పుకొచ్చారు. 110,000 డాలర్ల విలువైన ఆర్ట్ పీస్ మాత్రమే తనదని వెల్లడించారు. ఆర్ధిక సంక్షోభం కారణంగా రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్  ద్వారా 2019 , 2020 లో తనకు ఎలాంటి ఫీజులు రాలేదని అనిల్ కోర్టుకు తెలిపారు.

దక్షిణ ముంబైలోని తన ఇంటికి కరెంటు ఖర్చు గత  ఎనిమిది నెలల్లో  60.6 లక్షలని ప్రకటించారు. ప్రైవేట్ హెలికాప్టర్, భార్యకు బహుమతిగా ఇచ్చిన ప్రైవేట్ లగ్జరీ యాచ్ట్ వినియోగం ఆరోపణలను కూడా ఆయన ఖండించారు.

దక్షిణ ముంబైలోని తన ఇంటిలో ఎనిమిది నెలల్లో 60.6 లక్షల రూపాయల విద్యుత్ ఖర్చులను అనిల్ అంబానీ ప్రకటించారు. మరోవైపు అనిల్ అంబానీ వాస్తవాలను దాచిపెడుతున్నారని  బ్యాంకుల తరఫున హాజరైన బంకిమ్ థంకీ క్యూసీ ఆరోపించారు.  

తమకు రావాల్సిన  రుణ బకాయిలను  చట్టపరమైన మార్గాల ద్వారా పొంది తీరుతామని వ్యాఖ్యానించారు. కాగా ఫోర్బ్స్ ప్రకారం, 2008 లో 42 బిలియన్ డాలర్ల సంపదతో ప్రపంచంలోనే ఆరవ సంపన్నుడిగా ఓ వెలుగు వెలిగిన అనిల్ అంబానీ అప్పుల్లోకి కూరుకుపోయారు.

2012లో ఆయన తన టెలికామ్ వ్యాపారం విస్తరణ కోసం మూడు చైనా బ్యాంకుల నుంచి 700 మిలియన్ డాలర్ల రుణానికి హామీ ఇచ్చారు. ప్రస్తుతం రిలయన్స్ టెలికామ్ దివాలా తీయడంతో రుణం మంజూరు చేసిన బ్యాంకులు అంతర్జాతీయ కోర్టులను ఆశ్రయించాయి.

మూడు చైనా బ్యాంకులు ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ చైనా లిమిటెడ్ ముంబై బ్రాంచ్, చైనా డెవలప్‌మెంట్ బ్యాంక్, ఎక్సిమ్ బ్యాంక్ ఆఫ్ చైనా అనిల్ అంబానీపై 700 మిలియన్ డాలర్ల రుణం కోసం దావా వేసిన సంగతి తెలిసిందే.

జూన్12 లోపు మూడు బ్యాంకులకు రూ .5,281 కోట్ల రుణాన్ని, రూ.7 కోట్లు చట్టపరమైన ఖర్చులను చెల్లించాలని మే 22న ఆదేశించింది. లేని పక్షంలో తన ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆస్తులను అఫిడవిట్ ద్వారా ప్రకటించాలని కోర్టు ఆదేశించింది. ఈ చెల్లింపుల్లో అంబానీ విఫలం కావడంతో చైనా బ్యాంకులు మరోసారి బ్రిటన్ హైకోర్టును ఆశ్రయించాయి.

Follow Us:
Download App:
  • android
  • ios