బడ్జెట్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో వాహనాల అమ్మకాలపై జీఎస్టీని తగ్గించాలని  సొసైటీ ఆఫ్‌‌ ఇండియన్‌‌ ఆటోమొబైల్‌‌ మాన్యుఫ్యాక్చరర్స్‌‌ (సియామ్) కేంద్రాన్ని కోరుతున్నాయి. 2018తో పోలిస్తే 2019లో టూవీలర్లు, కమర్షియల్‌‌ వెహికిల్స్‌‌ , ప్యాసింజర్‌‌ వెహికిల్స్‌‌  అమ్మకాలు పూర్తిగా తగ్గిపోయాయని వాపోయింది.

2019 జూలైలో అమ్మకాలు 18.71 శాతం, ఆగస్ట్ లో 23.55 శాతానికి అమ్మకాలు పడిపోయానని...ఇది 19 ఏళ్ల కనిష్టమని సియామ్‌‌ తెలిపింది. మన దేశానికి చెందిన ప్యాసింజర్ వెహికిల్స్ అమ్మకాలు దారుణంగా పడిపోయానని ఆవేదన వ్యక్తం చేసింది. దేశీయ ప్యాసింజర్‌‌ వెహికిల్స్‌‌ సేల్స్‌‌ ఏకంగా 31.5 శాతం తగ్గుముఖం పట్టగా మార్కెట్ లీడర్‌‌ మారుతీ సుజుకీ ఆగస్టులో కేవలం 93 వేల పీవీలను అమ్మింది.

also read లాభాలతో దూసుకెళుతున్న స్టాక్ మార్కెట్లు... రికార్డ్ స్థాయిలో ఇన్ఫోసిస్

హ్యుండై అమ్మకాలు 17 శాతం, మహీంద్రా అమ్మకాలు 32 %  తగ్గిందని సొసైటీ ఆఫ్‌‌ ఇండియన్‌‌ ఆటోమొబైల్‌‌ మాన్యుఫ్యాక్చరర్స్‌ బృందం కేంద్రానికి తెలిపింది.అమ్మకాలు తగ్గడంతో స్టాక్‌మార్కెట్‌ లో ఆటో స్టాక్స్  భారీ నష్టాల్ని చవిచూసిన విషయాన్ని ప్రస్తావించింది. గత 16 నెలల్లో దేశీయ ఆటోమొబైల్‌‌‌‌ కంపెనీల మార్కెట్‌ వ్యాల్యూ రూ.2,91,238 కోట్లు వరకు తుడిచి పెట్టుకుపోయిందని తెలిపింది.

అయితే త్వరలో ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశ పెట్టే బడ్జెట్ లో ఆటోమొబైల్ ఇండస్ట్రీని ఆదుకోవాలని సొసైటీ ఆఫ్‌‌ ఇండియన్‌‌ ఆటోమొబైల్‌‌ మాన్యుఫ్యాక్చరర్స్‌‌ కేంద్రాన్ని కోరింది. వాహన అమ్మకాలపై జీఎస్టీని 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించాలని కోరుతున్నాయి.  

also read కొత్త బడ్జెట్ లో భారీ నిధుల కేటాయింపులపైనే వారి ఆశలు...కానీ...?

జీఎస్టీని తగ్గించడంతోపాటు ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించడానికి లిథియం ఆయాన్ బ్యాటరీల సెల్స్‌‌దిగుమతిపై  సుంకాలను రద్దు చేయాలని సూచించింది. ఎక్కువ దిగుమతి సుంకాలు ఉండటం వల్ల అల్యూమినియం ప్రొడక్టుల ధరలు అధికంగా ఉంటున్నాయని, ఇంటర్నేషనల్‌‌మార్కెట్లతో పోటీ పడలేకపోతున్నామని అల్యూమినియం అసోసియేషన్‌‌ఆఫ్‌‌ఇండియా తెలిపింది.

బడ్జెట్ లో అల్యూమినియం ఫ్లోరైడ్‌‌, కాస్టిక్‌‌సోడా లై, గ్రీన్‌‌ అనోడ్‌‌వంటి ముడిపదార్థాలపై కస్టమ్స్‌‌ డ్యూటీని తగ్గించేలా ప్రకటన చేయాలని ఆర్థికమంత్రిత్వ శాఖను కోరింది.  కస్టమ్స్‌‌డ్యూటీని 7.5 శాతం నుంచి 2.5 శాతానికి తగ్గించాలని కోరింది.  అల్యూమినియం స్క్రాప్‌‌పై దిగుమతి సుంకాన్ని 2.5 శాతం నుంచి పది శాతానికి పెంచాలని సొసైటీ ఆఫ్‌‌ ఇండియన్‌‌ ఆటోమొబైల్‌‌ మాన్యుఫ్యాక్చరర్స్‌‌  కేంద్రాన్ని  కోరింది.