Asianet News TeluguAsianet News Telugu

ఫెయిర్ అండ్ లవ్లీలో ‘ఫెయిర్’ కట్.. తాజా సంచలన నిర్ణయం..

అమెరికాలో బ్లాక్ లైవ్స్ మూవ్‌మెంట్ పుణ్యమా? అని జాన్సన్ అండ్ జాన్సన్ అనే సంస్థ అంతర్జాతీయంగా ‘ఫెయిర్’ అండ్ లవ్లీ నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. కానీ ఆరోగ్యకర చర్మమే ప్రమాణంగా ‘ఫెయిర్ అండ్ లవ్లీ’లో ‘ఫెయిర్’ను తొలగిస్తున్నాం అని హిందూస్థాన్ యూనీ లీవర్ ప్రకటించింది. 

skin cream fair and lovely to remove fair from name says hindustan liver
Author
Hyderabad, First Published Jun 26, 2020, 11:53 AM IST

న్యూఢిల్లీ: జాతి వివక్ష, సౌందర్య ప్రామాణికతపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతున్న వేళ ఎఫ్ఎంసీజీ దిగ్గజం హిందుస్థాన్ యూనిలీవర్ సంచలన నిర్ణయం తీసుకుంది. సంస్థకు చెందిన ప్రధాన బ్రాండ్ ఫెయిర్ అండ్ లవ్లీ నుండి ‘ఫెయిర్’ అనే పదం తొలగించి, రీబ్రాండ్ చేయనున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది.

ఫెయిర్ అండ్ లవ్లీకి చేసిన మార్పులతో పాటు, మిగిలిన చర్మ సంరక్షణ పోర్ట్‌ఫోలియో కూడా ‘పాజిటివ్ బ్యూటీ, సమగ్ర దృష్టిని’ ప్రతిబింబిస్తుందని పేర్కొంది. రెగ్యులేటరీ ఆమోదం తరువాత రాబోయే కొద్ది నెలల్లో పేరును ప్రకటిస్తామని కంపెనీ భావిస్తోంది.

ఫెయిర్ అండ్ లవ్లీ ప్యాకేజీమీద ‘ఫెయిర్/ఫెయిర్‌నెస్’, ‘వైట్  వైట్నింగ్’ ‘లైట్ / మెరుపు’ వంటి పదాలను కూడా తొలగించినట్లు హెచ్‌యూఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సంజీవ్ మెహతా వెల్లడించారు. ఫెయిర్ అండ్ లవ్లీ ప్యాకెట్ పై ఉండే 2 ముఖాలతోపాటు ఉండే మరో (నల్ల) ముఖాన్ని తొలగించామని అన్నారు.

రెగ్యులేటరీ సంస్థల ఆమోదం అనంతరం కొత్త పేరుతో మరికొద్ది నెలల్లో వినియోగదారుల ముందుకు రానున్నామని హెచ్‌యూఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సంజీవ్ మెహతా వెల్లడించారు. గత దశాబ్దంలో మహిళల సాధికారత సందేశంతో ఫెయిర్ అండ్ లవ్లీ ప్రకటనలు తీసుకొచ్చామని పేర్కొన్నారు.

దీనికి ప్రజలనుంచి మంచి ఆదరణ లభించిందని హెచ్‌యూఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సంజీవ్ మెహతా పేర్కొన్నారు. ఇకపై దేశవ్యాప్తంగా వివిధ స్కిన్ టోన్ల మహిళలను గౌరవిస్తూ, వారి ప్రాతినిధ్యంతో విభిన్నంగా ఇవి ఉండబోతున్నాయన్నారు.

భారతదేశంలో విక్రయించే రెండు ఫెయిర్‌నెస్ ఉత్పత్తుల అమ్మకాలను నిలిపివేస్తున్నట్లు అమెరికన్ మల్టీనేషనల్ సంస్థ జాన్సన్ అండ్ జాన్సన్ ప్రకటించిన వారం తరువాత హెచ్‌యూఎల్ ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. విశ్లేషకుల అంచనాకు అనుగుణంగానే సౌందర్య ఉత్పత్తులను నిలిపివేయడం కాకుండా..కేవలం పేరు మార్చేందుకు నిర్ణయించడం గమనార్హం. 

కాగా కంపెనీ ప్రధాన ఉత్పత్తి  ఫెయిర్ అండ్ లవ్లీ. వార్షిక అమ్మకాల విలువ 560 మిలియన్ల డాలర్లు. భారతీయ స్కిన్  వైట్నింగ్ మార్కెట్‌లో 50-70% ఫెయిర్ అండ్ లవ్లీ సొంతం. ఇంతకుముందు అమెరికా హెల్త్‌కేర్, ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం జాన్సన్ అండ్ జాన్సన్ (జే అండ్ జే) మరోసారి కీలక నిర్ణయం తీసుకున్నది. 

also read స్విస్ బ్యాంకుల్లో భారతీయుల ఆస్తులపై షాకింగ్ న్యూస్...కానీ ! ...

ఆఫ్రికన్-అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్ హత్య తరువాత ఊపందుకున్న ‘బ్లాక్ లైవ్స్ మేటర్’ ఉద్యమానికి మద్దతుగా స్కిన్ వైట్నింగ్ (చర్మం తెల్లబడే) క్రీమ్‌ల అమ్మకాలను నిలిపి వేస్తున్నట్టు ప్రకటించింది. వీటితోపాటు న్యూట్రోజెనా ఫెయిర్‌నెస్ క్రీమ్‌ల అమ్మకాన్నీ ఆపివేసినట్టు వెల్లడించింది.

భారతదేశం సహా ఇతర  ప్రాంతాల్లో క్లీన్ అండ్ క్లియర్ ఫెయిర్‌నెస్ ఉత్పత్తుల అమ్మకాలను నిలిపివేస్తామని జేజే తెలిపింది. ఆసియా, మధ్యప్రాచ్యంలో విక్రయించే న్యూట్రోజెనా ఫైన్ ఫెయిర్‌నెస్ క్రీమ్స్ అమ్మకాలు ఉండవని పేర్కొంది. అయితే స్టాక్ ఉన్నంత వరకు క్లీన్ అండ్ క్లియర్ ఫెయిర్‌నెస్ ఉత్పత్తులను విక్రయిస్తామని చెప్పింది. 

బ్రిటిష్-డచ్ బహుళజాతి సంస్థ అనుబంధ కంపెనీ హిందూస్తాన్ యూనిలీవర్, మరో విదేశీ సంస్థ ప్రొక్టర్ అండ్ గాంబుల్, గార్నియర్ (లోరియల్) ఈ విభాగంలో మార్కెట్ ను ఏలుతున్న సంగతి తెలిసిందే. బయోటిక్, లోటస్ హెర్బల్, హిమాలయ వంటి పలు భారతీయ కంపెనీల ఫెయిర్‌నెస్ ఉత్పత్తులు కూడా భారీ విక్రయాలనే నమోదు చేస్తున్నాయి.

మనదేశంలో అత్యధికంగా అమ్ముడుబోయే ఫెయిర్‌నెస్ క్రీమ్ ఫెయిర్ అండ్ లవ్లీ. హిందూస్తాన్ యునిలివర్ కు అత్యంత విజయవంతమైన ఈ క్రీమ్ 2012 నాటికి, కంపెనీ మార్కెట్లో 80 శాతం ఆక్రమించిందంటే దీని డిమాండ్ అర్థం చేసుకోవచ్చు. దీనికితోడు గత దశాబ్ద కాలంగా పురుషుల ప్రత్యేక ఫెయిర్‌నెస్ ఉత్పత్తులు మార్కెట్లో హల్ చల్ చేస్తున్నాయి. బాలీవుడ్ తారలు షారూఖ్ ఖాన్, జాన్ అబ్రహం వీటికి ప్రచారకర్తలుగా ఉన్నారు.

అయితే  ఫెయిర్‌నెస్ ఉత్పత్తుల వ్యాపారం చాలా సంవత్సరాలుగా విమర్శలను ఎదుర్కొంటోంది. సౌందర్య సాధన పేరుతో జరుగుతున్న ఇలాంటి అమ్మకాలను నిషేధించాలంటూ ఇటీవల ఆన్‌లైన్ పిటిషన్ కూడా సర్క్యులేట్ అయింది. 

Follow Us:
Download App:
  • android
  • ios