నిన్నటి దాకా కేవలం బంగారం ధర మాత్రమే ఆకాశాన్నంటింది. ఇప్పుడు వెండి కూడా బంగారం బాట పట్టింది. దేశీయ మార్కెట్లో పసిడి, వెండి ధరలు చుక్కలను తాకుతున్నాయి. కొనుగోళ్లు ఊపందుకోవడం, అంతర్జాతీయంగా సానుకూలంగా ఉండటంతో.. మంగళవారం నాటి బులియన్ మార్కెట్లో వెండి ధర అమాంతం పెరిగింది.

మంగళవారం ఒక్కరోజే రూ.2వేలు పెరిగి వెండి ధర గరిష్టస్థాయికి చేరుకుంది. నేటి మార్కెట్లో వెండి ధర రూ.45వేలకు చేరింది. ఈ విషయాన్ని ఆల్ ఇండియా సఫారా అసోసియేషన్ వెల్లడించింది. కాగా... బంగారం ధర మాత్రం నేడు స్వల్పంగా తగ్గింది. రూ.100 తగ్గడంతో పది గ్రాముల బంగారం ధర రూ.38,370కి చేరుకుంది.

అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లలో ఒత్తిడి పెరగడంతో బంగారం, వెండి లో పెట్టుబడులు పెట్టడం శ్రేయస్కరమని మదుపర్లు భావిస్తున్నారు. అందుకే వీటి ధరలు అమాంతం పెరిగిపోతున్నాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.  అంతర్జాతీయ మార్కెట్లోనూ వీటి ధరలు పెరగడం గమనార్హంం. న్యూయార్క్ మార్కెట్లో ఔన్సు బంగారం 1,520.37 డాలర్లు పలుకుతుండగా... ఔన్సు వెండి  17.32 డాలర్లు పలుకుతోంది.