Asianet News TeluguAsianet News Telugu

వరుసగా 4వ రోజు కూడా పడిపోయిన బంగారం, వెండి ధరలు.. నేడు 10గ్రా ఎంతంటే ?

ఎంసిఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ వరుసగా నాలుగవ రోజు గ్రాముకు 0.3% పడిపోయి 10 గ్రాముల బంగారం ధర రూ.50,180 కు చేరుకోగా, సిల్వర్ ఫ్యూచర్స్ 0.8% క్షీణించి కిలో వెండి ధర రూ.62,043 చేరుకుంది. 

silver gold price today:  19 november 2020 latest price gold mcx prices today fall for fourth day in row silver rates slump
Author
Hyderabad, First Published Nov 19, 2020, 11:18 AM IST

నేడు భారత మార్కెట్లలో బంగారం మరియు వెండి ధర తగ్గుతూ వచ్చింది. ఎంసిఎక్స్‌లో బంగారు ఫ్యూచర్స్ వరుసగా నాలుగవ రోజు కూడా బంగారం, వెండి ధరలు నేడు భారత మార్కెట్లలో మళ్ళీ పడిపోయాయి.

ఎంసిఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ వరుసగా నాలుగవ రోజు గ్రాముకు 0.3% పడిపోయి 10 గ్రాముల బంగారం ధర రూ.50,180 కు చేరుకోగా, సిల్వర్ ఫ్యూచర్స్ 0.8% క్షీణించి కిలో వెండి ధర రూ.62,043 చేరుకుంది.

అంతకుముందు సెషన్ లో బంగారం 10 గ్రాములకు రూ.450 పడిపోగా, వెండి కిలోకు రూ.718 తగ్గింది. స్పాట్ బంగారం ఔన్సుకు 0.1% పడిపోయి 1,869.86 డాలర్లకు చేరుకుంది. ఇతర విలువైన లోహాలలో వెండి 0.3% పడిపోయి ఔన్సుకు 24.24 డాలర్లకు చేరుకుంది. ప్లాటినం 0.5% తగ్గి 937.30కు, పల్లాడియం 0.7% తగ్గి 2,311.91 వద్ద ఉంది.

also read వరుసగా 3వ రోజు పడిపోయిన బంగారం వెండి ధరలు.. నేడు 10గ్రా,. పసిడి ధర ఎంతంటే ? ...

మిశ్రమ కారకాలు బంగారాన్ని పరిమితం చేశాయని విశ్లేషకులు తెలిపారు. అలాగే, కరోనా వైరస్ మహమ్మారి టీకా వార్తల ద్వారా బంగారం ధర ప్రభావితమైంది.

అమెరికన్ ఔషధ సంస్థ మోడెర్నా ఇంక్., కోవిడ్ -19ను నివారించడంలో ప్రయోగాత్మక వ్యాక్సిన్ 94.5 శాతం ప్రభావవంతంగా ఉందని కనుగొన్నారు. అదనంగా, అమెరికా ఆర్థిక ఉద్దీపన కూడా దీనిని ప్రభావితం చేసింది.

డాలర్ ఇండెక్స్ 0.16 శాతం పెరిగింది. డాలర్ ఇండెక్స్ 0.16 శాతం పెరిగి  ఇతర కరెన్సీల హోల్డర్లకు బంగారం ఖరీదైనది. బంగారు ఇటిఎఫ్ ప్రవాహాలు బలహీనమైన పెట్టుబడిదారుల ఆసక్తిని ప్రతిబింబిస్తాయి.

ప్రపంచంలోనే అతిపెద్ద గోల్డ్ సపోర్ట్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్ (ఇటిఎఫ్) ఎస్‌పిడిఆర్ గోల్డ్ ట్రస్ట్ హోల్డింగ్స్ బుధవారం 0.60 శాతం తగ్గి 1,219.00 టన్నులకు చేరుకున్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios