Asianet News TeluguAsianet News Telugu

ఇండియాలో ఉండి టెస్లా, యాపిల్, గూగుల్ షేర్లను కొనాలని ఉందా...అయితే పెట్టుబడి పెట్టాల్సిన పద్ధతులు ఇవే..

దేశీయ స్టాక్ మార్కెట్లో డబ్బులు సంపాదిస్తున్నారా.. అయితే మరింత ఆదాయం కోసం విదేశీ స్టాక్స్ ను కూడా మీ పోర్ట్ ఫోలియోలో యాడ్ చేసుకోవాలని అనుకుంటున్నారా. అందుకు చక్కటి అవకాశం మీ ముందు ఉంది.

Should you stay in India and buy shares of Tesla Apple Google But these are the methods to invest
Author
First Published Sep 20, 2022, 5:42 PM IST

అమెరికన్ స్టాక్ మార్కెట్లో పలు కంపెనీలు గత కొన్ని సంవత్సరాలుగా చక్కటి లాభాలను అర్జిస్తున్నాయి. ఉదాహరణకు టెస్లా కంపెనీ విషయానికి వచ్చినట్లయితే ఐదేళ్ల క్రితం టెస్లా కంపెనీలో ఒక్కో షేర్ విలువ 23 డాలర్లు ఉంటే ప్రస్తుతం అంటే సెప్టెంబర్ 20, 2022 నాటికి ఒక్కో షేరు విలువ 309 డాలర్లుగా ఉంది అంటే గడచిన ఐదు సంవత్సరాలలో దాదాపు ఒక్కో షేర్ విలువ 1200% మేర పెరిగింది. 

ఇక అలాగే అమెజాన్ విషయానికి వచ్చినట్లయితే అమెజాన్ షేర్లు కూడా సరిగ్గా ఐదేళ్ల క్రితం 47 డాలర్లు ఉంటే ప్రస్తుతం 164 డాలర్ల స్థాయిలో ఉన్నాయి. అలాగే ఆపిల్ షేర్  విలువకు వచ్చినట్లయితే ఆపిల్ షేర్స్ కూడా సరిగా 5 సంవత్సరాల క్రితం కేవలం 37 డాలర్లు మాత్రమే ఉండగా ప్రస్తుతం ఆపిల్ షేర్స్ విలువ దాదాపు 154 డాలర్లకు చేరింది. అంటే దాదాపు 300% మేర పెరిగింది ఈ లెక్కన చూసినట్లయితే అమెరికన్ స్టాక్ మార్కెట్స్ లో కూడా టెక్నాలజీ స్టాక్స్ చక్కటి రిటర్న్స్ ను అందిస్తున్నాయి. మీరు కూడా విదేశీ స్టాక్ మార్కెట్లలో డబ్బు పెట్టి మీ పోర్టు పోలియోను బలం చేసుకోవాలనుకుంటే ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం

విదేశీ మార్కెట్లలో లిస్ట్ షేర్లను కొనుగోలు చేసే ధోరణి భారతీయ పెట్టుబడిదారులలో వేగంగా పెరుగుతోంది. 2022 ఆర్థిక సంవత్సరంలో భారతీయులు విదేశాల్లో 747 మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టారు. విదేశీ స్టాక్స్ వైపు భారతీయ ఇన్వెస్టర్ల మొగ్గు పెరుగుతోంది. విదేశీ షేర్లను అనేక విధాలుగా కొనుగోలు చేయవచ్చు. మీరు మ్యూచువల్ ఫండ్‌లు, ఫిన్‌టెక్ యాప్‌ల ద్వారా మాత్రమే కాదు, భారతీయులు కూడా నేరుగా విదేశీ స్టాక్ ఎక్స్ఛేంజీలలో పెట్టుబడి పెట్టవచ్చు.

భారతీయ పెట్టుబడిదారులు కూడా విదేశీ స్టాక్‌లను సొంతంగా కొనుగోలు చేయవచ్చు. విన్‌వెస్టా, స్టాక్‌కాల్, వెస్టెడ్ ఫైనాన్స్ వంటి అనేక ఫిన్‌టెక్ కంపెనీల ద్వారా ఈ పని చేయవచ్చు. భారతీయ ఖాతాదారులకు విదేశాలలో పెట్టుబడులు పెట్టేందుకు కొన్ని భారతీయ బ్రోకరేజీలు కూడా ఈ ఫిన్‌టెక్ కంపెనీలతో జతకట్టాయి. ఒక భారతీయ పెట్టుబడిదారు USలోని షేర్లలో కొంత భాగాన్ని కొనుగోలు చేయవచ్చు. దీంతో ఖరీదైన స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయడం సులభం అవుతుంది. లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ (LRS) కింద, ప్రతి ఆర్థిక సంవత్సరంలో 2,50,000 డాలర్ల వరకు విదేశీ ఈక్విటీలలో పెట్టుబడి పెట్టవచ్చు.

బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ మద్దతు ఉన్న ఇండియా ఇంటర్నేషనల్ ఎక్స్ఛేంజ్ (ఇండియా INX). ఇండియా ఐఎన్‌ఎక్స్ ఇంటరాక్టివ్ బ్రోకర్లతో ఒప్పందం చేసుకుంది. ఇండియా ఐఎన్‌ఎక్స్‌లో ట్రేడింగ్ అనేది ఫిన్‌టెక్ యాప్‌లో ట్రేడింగ్ మాదిరిగానే ఉంటుంది. అదేవిధంగా USలో లిస్ట్ అయిన 50 ఎంపిక చేసిన స్టాక్‌లకు  జారీ చేయబడిన అన్‌సెక్యూర్డ్ డిపాజిటరీ  రిసీప్ట్స్ లో (UDR) ట్రేడింగ్ చేయడానికి NSE IFSE భారతీయ పెట్టుబడిదారులను అనుమతిస్తుంది. 

విదేశీ స్టాక్స్‌లో ఎంత పెట్టుబడి పెట్టాలి ?
పెద్ద అంతర్జాతీయ కంపెనీలలో పెట్టుబడి పెట్టడం ద్వారా, పెట్టుబడిదారు ప్రపంచ కంపెనీల లాభాలలో భాగం అవుతాడు. విదేశీ స్టాక్స్‌లో పెట్టుబడిదారుడు ఎంత పెట్టుబడి పెట్టాలి అనే ప్రశ్న ఇప్పుడు తలెత్తుతుంది. డైవర్సిఫికేషన్ దృక్కోణంలో, మీ పోర్ట్‌ఫోలియోలో 10 నుండి 30 శాతం గ్లోబల్ స్టాక్‌లలో పెట్టుబడి పెట్టాలని మార్కెట్ నిపుణులు అంటున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios