చికెన్ ప్రియులకు ఇది నిజంగా షాకింగ్ న్యూస్. చికెన్ ధరలు భారీగా పెరిగిపోయాయి. కేవలం నెల రోజుల్లో చికెన్ ధర రూ.60 పెరిగిపోయింది. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో చికెన్ ధరలు భారీగా పడిపోయి.. ఆ తర్వాత పెరుతుంటాయి. అయితే.. ఈ సంవత్సరం మాత్రం కార్తీక మాసంలో చికెన్ ధర తగ్గకపోగా... ఆ తర్వాత భారీగా పెరిగిపోయింది. దీంతో.. చికెన్ కొనడానికి ప్రజలు కొద్దిగా వెనకడుగు వేస్తున్నారు. దీంతో.. చికెన్ దుకాణదారులతోపాటు.. హోల్ సేల్ వ్యాపారులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

గత నెల వరకు కేజీ చికెన్ ధర రూ.160 ఉండగా... ప్రస్తుతం అదే చికెన్ ధర రూ.226కి చేరింది. క్రిస్మస్, న్యూ ఇయర్ సమయంలో చికెన్ ధరలు భారీగా పెరగడంతో.. వినియోగదారులు కొనడానికి ఆసక్తి చూపడం లేదని.. దీంతో.. తమ వ్యాపారాలు డీలా పడిపోయాయని వ్యాపారులు ఆందోళన పడుతున్నారు.

నవంబర్ నెలలో బాయిలర్ కోడి ధర రూ.79 నుంచి రూ.96 మధ్యలో ఉండగా.. చికెన్ (స్కిన్) రూ.150, స్కిన్ లెస్ చికెన్ రూ.160 వరకు ఉన్నాయి. అయితే.. డిసెంబర్ 25వ తేదీ నాటికి  బాయిలర్ కోడి ధర రూ.117నుంచి రూ.136పలుకుతోంది. ఇక చికెన్(స్కిన్) రూ.216, స్కిన్ లెస్ రూ.226కి చేరిపోయింది.