Asianet News TeluguAsianet News Telugu

స్టాక్ మార్కెట్ పై కరోనా ప్రభావం: సెన్సెక్స్-నిఫ్టీ క్రాష్.. ఫార్మా షేర్లు జోరు..

ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాలలో లాక్ డౌన్, పెరుగుతున్న కరోనా కేసులు కూడా స్టాక్ మార్కెట్ను ప్రభావితం చేశాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సెన్సెక్స్ 3.00 శాతం నష్టపోయి 1406.73 పాయింట్లు తగ్గి 4553.96 వద్ద ముగిసింది. 

share market:  sensex nifty today closed at red mark due to increasing coronavirus cases
Author
Hyderabad, First Published Dec 21, 2020, 4:29 PM IST

 నేడు వారం మొదటి ట్రేడింగ్ అంటే సోమవారం రోజున స్టాక్ మార్కెట్ కుప్పకూలింది. ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాలలో లాక్ డౌన్, పెరుగుతున్న కరోనా కేసులు కూడా స్టాక్ మార్కెట్ను ప్రభావితం చేశాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సెన్సెక్స్ 3.00 శాతం నష్టపోయి 1406.73 పాయింట్లు తగ్గి 4553.96 వద్ద ముగిసింది.

అలాగే  నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 3.14 శాతం (432.15 పాయింట్లు) కోల్పోయి 13328.40 స్థాయిలో ముగిసింది.  అంతకుముందు వారంలో బిఎస్‌ఇ స్టాండర్డ్ ఇండెక్స్ 861.68 పాయింట్లతో 1.86 శాతం పెరిగింది. అయితే విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, మార్కెట్ అస్థిరత మరింత కొనసాగవచ్చు. అందువల్ల పెట్టుబడిదారులు జాగ్రత్తగా ఉండాలి అని సూచించారు.

ఈ వారంలో దేశీయ స్టాక్ మార్కెట్ ప్రపంచ పరిణామాలు ముఖ్యంగా యుఎస్ లో ఆర్థిక ఉద్దీపన, కోవిడ్ -19 వ్యాక్సిన్‌ సంబంధించిన వార్తలు స్టాక్ మార్కెట్‌కు దిశానిర్దేశం చేయనున్నాయి. క్రిస్మస్ సందర్భంగా స్టాక్ మార్కెట్, ఆర్థిక మార్కెట్లు శుక్రవారం మూసివేయబడతాయి. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌పిఐ) పెట్టుబడి నమూనాను కూడా ఇన్వెస్టర్లు చూస్తారు. మార్కెట్ వృద్ధికి ఎఫ్‌పిఐ పెట్టుబడి ప్రధాన కారణం. 

నేడు అన్ని కంపెనీల స్టాక్స్ రెడ్ మార్క్ మీద మూగీసాయి. టాటా స్టీల్, ఒఎన్‌జిసి, గెయిల్, హిండాల్కో, హిందూస్తాన్ యూనిలీవర్ అగ్రస్థానంలో ఉన్నాయి.  ఫార్మా, ఐటి, ఎఫ్‌ఎంసిజి, ఫైనాన్స్ సర్వీసెస్, రియాల్టీ, ప్రైవేట్ బ్యాంకులు, బ్యాంకులు, పిఎస్‌యు బ్యాంకులు, మీడియా, ఆటో, మెటల్ ఉన్నాయి రెడ్ మార్క్ మీద ముగిశాయి.

also read అనంత్ అంబానీ డ్రీమ్ ప్రాజెక్ట్: ప్రపంచంలోనే అతిపెద్ద జూను నిర్మించనున్న రిలయన్స్ ఇండస్ట్రీస్.. ...

ఎనిమిది కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ పెరిగింది

టాప్ 10 సెన్సెక్స్ కంపెనీలలో ఎనిమిది కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ (మార్కెట్ క్యాప్) పెరిగింది.  హెచ్‌డిఎఫ్‌సి, టిసిఎస్, బజాజ్ ఫైనాన్స్‌లు గత వారంలో అత్యధిక లాభాలను ఆర్జించాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, హిందుస్తాన్ యూనిలీవర్ లిమిటెడ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ మాత్రమే క్షీణించాయి.

కాగా హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఇన్ఫోసిస్, ఇతర కంపెనీలు మార్కెట్ వాటాను పెంచాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ స్థానం పరంగా అగ్రస్థానంలో నిలిచింది. తరువాత టిసిఎస్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, హిందుస్తాన్ యూనిలీవర్ లిమిటెడ్, ఇన్ఫోసిస్, హెచ్‌డిఎఫ్‌సి, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, భారతి ఎయిర్‌టెల్ వరుసగా ఉన్నాయి.

నేడు స్టాక్ మార్కెట్ రెడ్ మార్క్ మీద ప్రారంభమైంది. సెన్సెక్స్ 174.31 పాయింట్లు (0.37 శాతం) క్షీణించి 46786.38 స్థాయిలో, అలాగే నిఫ్టీ 0.70 శాతం (56.20 పాయింట్లు)క్షీణించి 13704.30 స్థాయిలో ప్రారంభమైంది. 

Follow Us:
Download App:
  • android
  • ios