సిజెడ్‌ఏ వార్షిక నివేదిక ప్రకారం రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ గుజరాత్‌లోని జామ్‌నగర్ వద్ద గ్రీన్స్ జూలాజికల్ రెస్క్యూ అండ్ రిహాబిలిటేషన్ కింగ్డమ్ అనే మెగా జూను ఏర్పాటు చేయడానికి ఆమోదం తెలిపింది. సిజెడ్‌ఏ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసిన వివరాల ప్రకారం జూ 250.1 ఎకరాలలో విస్తరించి ఉంటుంది.
న్యూ ఢీల్లీ: గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఒకే చోట జంతువులు, వివిధ జాతుల పక్షులతో ప్రపంచంలోని అతిపెద్ద జంతు ప్రదర్శన శాల నిర్మించడానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సిద్ధమైంది. జామ్ నగర్‌లో రిఫైనరీని నిర్వహిస్తున్న ఆర్‌ఐఎల్ జూను అభివృద్ధి చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ అధికారి శుక్రవారం ధృవీకరించారు.
'అసోచం ఫౌండేషన్ వీక్ 2020' కింద వర్చువల్ కాన్ఫరెన్స్‌లో గుజరాత్‌పై ప్రెజెంటేషన్ ఇస్తూ ముఖ్యమంత్రి కార్యాలయంలో అదనపు ప్రధాన కార్యదర్శి ఎంకే దాస్ ఈ ప్రకటన చేశారు. ప్రపంచంలోని ఎత్తైన విగ్రహం గుజరాత్‌లో ఉంది అలాగే ఇప్పుడు ప్రపంచంలోని అతిపెద్ద జంతు ప్రదర్శన శాల కూడా జామ్‌నగర్‌లో అతి త్వరలో రాబోతోంది," అని అన్నారు.
జూ ఏర్పాటుకు సెంట్రల్ జూ అథారిటీ కూడా ఆమోదం తెలిపింది. సిజెడ్‌ఏ వార్షిక నివేదిక ప్రకారం రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ గుజరాత్‌లోని జామ్‌నగర్ వద్ద గ్రీన్స్ జూలాజికల్ రెస్క్యూ అండ్ రిహాబిలిటేషన్ కింగ్డమ్ అనే మెగా జూను ఏర్పాటు చేయడానికి ఆమోదం తెలిపింది. సిజెడ్‌ఏ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసిన వివరాల ప్రకారం జూ 250.1 ఎకరాలలో విస్తరించి ఉంటుంది.
ముకేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ ఈ జూను కంపెనీ రిఫైనరీ ప్రాజెక్టుకు దగ్గరగా ఉన్న జామ్‌నగర్ సమీపంలోని మోతి ఖవ్డి వద్ద 280 ఎకరాలలో నిర్మించనున్నారు, ఇది ప్రపంచంలోనే అతిపెద్ద చమురు శుద్ధి సముదాయం, ఇక్కడ పెట్రోకెమికల్స్ ప్రాజెక్ట్ కూడా ఉంది.
"గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ గ్రీన్స్ జూలాజికల్ రెస్క్యూ అండ్ రిహాబిలిటేషన్ కింగ్డమ్ స్థాపన కోసం మాస్టర్ (లేఅవుట్) ప్రణాళికతో పాటు డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డిపిఆర్)ను సెంట్రల్ జూ అథారిటీ 33వ సమావేశం ఆమోదించింది.
also read రికవరీ ఇంకా స్థిరంగా లేదు, వాటిని ఉపసంహరించుకోవడం కూడా సరైనది కాదు: ఆర్‌బిఐ గవర్నర్ ...
సిజెడ్‌ఏ వార్షిక నివేదికలో జూ ప్రదర్శనశాలలలో శాకాహారి మిశ్రమ జాతులను అన్వేషించాలని పేర్కొంది. అలాగే పొరుగు ప్రాంతంలో ప్రకృతిలో సాధారణంగా కనిపించే పక్షుల జాతులు జంతు సేకరణ ప్రణాళికలో భాగం కాకూడదని, గ్రేట్ ఇండియా బస్టర్డ్ (జిఐబి) చాలా అరుదైన అంతరించిపోతున్న పక్షి, ప్రస్తుతం ఉన్న జంతుప్రదర్శనశాలలో ఎక్కడ ఈ గ్రేట్ ఇండియా బస్టర్డ్ పక్షి లేదు, అన్యదేశ జాతుల పక్షుల సంఖ్యను తగ్గించాలని జూను కోరింది.
కోవిడ్ -19 కారణంగా ఆలస్యం అయిన ఈ ప్రాజెక్ట్ రాబోయే రెండేళ్లలో జూ ప్రారంభం అవుతుందని ఆర్ఐఎల్ డైరెక్టర్ (కార్పొరేట్ వ్యవహారాలు) పరిమల్ నాథ్వానీ మీడియా నివేదికలో పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారుల నుండి అవసరమైన అన్ని అనుమతులు ఇప్పటికే పొందామని ఆయన తెలియజేశారు.
సెంట్రల్ జూ అథారిటీ వెబ్‌సైట్‌లో ఉన్న ప్లాన్ లేఅవుట్ ప్రకారం జూలో 'ఫారెస్ట్ ఆఫ్ ఇండియా', 'ఫ్రాగ్ హౌస్', 'ఇన్సెక్ట్ లైఫ్', 'డ్రాగన్స్ ల్యాండ్', 'ఎక్సోటిక్ ఐలాండ్', 'వైల్డ్ ట్రైల్ ఆఫ్ గుజరాత్ ', ' ఆక్వాటిక్ కింగ్డమ్ ' జింకలు, స్లెందర్ లోరిస్, ఎలుగుబంట్లు, ఫిషింగ్ క్యాట్స్, కొమోడో డ్రాగన్లు, భారతీయ తోడేళ్ళలతో సహా వివిధ జాతులు జంతువుల సేకరణలో భాగంగా ప్రతిపాదించబడ్డాయి.
పర్యావరణ, అటవీ, వాతావరణ మంత్రిత్వ శాఖ అదనపు డైరెక్టర్ సౌమిత్రా దాస్‌గుప్తా మాట్లాడుతూ, “వన్యప్రాణుల పట్ల ఆర్‌ఐఎల్ ఆసక్తి, అభిరుచి, పరిరక్షణ గురించి మాకు తెలుసు. ప్రాజెక్ట్ వివరాల గురించి పూర్తిగా తెలియకపోయినా, వన్యప్రాణుల సంరక్షణలో ప్రైవేటు భాగస్వామ్యానికి ఇది మంచి ఉదాహరణగా నిలుస్తుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను ”. దేశంలోని పురాతన జంతు ప్రదర్శన శాలలలో ఒకటైన కోల్‌కతాలోని జూలాజికల్ గార్డెన్ కూడా ఒక ప్రైవేట్ అని దాస్‌గుప్తా అన్నారు.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Dec 21, 2020, 2:08 PM IST