Asianet News TeluguAsianet News Telugu

29 వేల దిగువకు సెన్సెక్స్.. రెడ్ లోనే ఆసియా ఇండెక్స్‌లు


దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. మధ్యాహ్నం 12.40 గంటలకు బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ ఇండెక్స్ సెన్సెక్స్, నేసనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 2.6 శాతం నష్టాన్ని చవిచూశాయి.

Share Market LIVE: Sensex drops over 1,000 points, Nifty at 8,700; Asian indices in red
Author
New Delhi, First Published Mar 18, 2020, 2:30 PM IST

దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. మధ్యాహ్నం 12.40 గంటలకు బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ ఇండెక్స్ సెన్సెక్స్, నేసనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 2.6 శాతం నష్టాన్ని చవిచూశాయి. అన్ని రంగాల ఇండెక్స్ ల్లో అమ్మకాల ఒత్తిడి కొనసాగుతున్నది. 

30 షేర్ల ఇండెక్స్ సెన్సెక్స్ ప్రస్తుతం 780 పాయింట్లు కోల్పోయి 29,798 పాయింట్ల వద్ద అంతర్గత ట్రేడ్ సాగుతున్నది. కరోనా వైరస్ ప్రభావాన్ని నియంత్రించేందుకు వివిధ దేశాల అధినేతలు, ప్రభుత్వాలు మదుపర్ల సెంటిమెంట్ బలోపేతం చేయడానికి ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీలు ట్రెడ్ మార్చాయి. 

మధ్యాహ్నం 12 గంటల సమయానికి బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 823 పాయింట్లకుపైగా నష్టంతో 30 వేల మార్క్​ను కోల్పోయింది. ప్రస్తుతం 29,755 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 239 పాయింట్లకు పైగా క్షీణించి.. 8,727 వద్ద కొనసాగుతోంది. ఉదయం 10:13 గంటల సమయంలో స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల దిశగా పయనిస్తున్నాయి. 

ప్రారంభంలో కాస్త సానుకూలంగా స్పందించినా.. మదుపరుల అప్రమత్తతతో వెంటనే నష్టాల్లోకి జారుకున్నాయి సూచీలు. ఉదయం ప్రారంభంలో సెన్సెక్స్ ప్రస్తుతం 300 పాయింట్లకు పైగా నష్టంతో 30,275 వద్ద ట్రేడయింది. నిఫ్టీ 85 పాయింట్ల క్షీణతతో 8,880 వద్ద ట్రేడింగ్ సాగితున్నది. 

ఇన్ఫోసిస్, సన్​ఫార్మా, హెచ్​యూఎల్, ఓఎన్​జీసీ, టాటా స్టీల్, ఐటీసీ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.టైటాన్, కోటక్ మహీంద్రా బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫినాన్స్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి. ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లు.. షాంఘై, హాంకాంగ్, సియోల్​, జపాన్ సూచీలు ప్రారంభంలో లాభాలతో సెషన్​ మొదలైంది. 

మంగళవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన సూచీలు సమయం గడుస్తున్న కొద్ది లాభాల్లోకి మళ్లాయి. ఒక దశలో మళ్లీ 32 వేల మార్క్‌ను దాటింది. చివరి అరగంటలో మదుపరులు విక్రయాలకు మొగ్గుచూపడంతో మళ్లీ నష్టాల నష్టాల్లోకి జారుకున్నాయి.  

అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల సంకేతాలకు తోడు భారత్‌లో కరోనా వైరస్‌తో మరొకరు మృతి చెందడం మదుపరుల్లో ఆందోళనను పెంచింది. ఫలితంగా చివరకు 810.98 పాయింట్లు లేదా 2.58 శాతం నష్టపోయి 30,579.09 వద్ద స్థిరపడింది. సూచీలు 1,653 పాయింట్ల శ్రేణిలో కదలాడాయి. 

జాతీయ స్టాక్‌ ఎక్సేంజ్‌ సూచీ నిఫ్టీ 230.35 పాయింట్లు లేదా 2.50 శాతం పతనం చెంది 8,967.05 వద్ద పరిమితమైంది. మార్చి 2017 తర్వాత నిఫ్టీ 9 వేల దిగువకు పడిపోవడం ఇదే తొలిసారి. అమెరికా స్టాక్‌ మార్కెట్లు కుప్పకూలడంతో పెట్టుబడిదారుల సెంటిమెంట్‌ను నీరుగార్చింది.

ఐసీఐసీఐ బ్యాంక్‌ 8.95 శాతం పడిపోయి టాప్‌ లూజర్‌గా నిలిచింది. ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ 8.89 శాతం, బజాజ్‌ ఫైనాన్స్‌ 6.26 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ 4.74 శాతం, ఇన్ఫోసిస్‌ 4.68 శాతం, కొటక్‌ బ్యాంక్‌ 4.53 శాతం పతనమయ్యాయి. 

మరోవైపు హెచ్‌యూఎల్‌, హీరో మోటోకార్ప్‌, ఏషియన్‌ పెయింట్స్‌, పవర్‌గ్రిడ్‌, మారుతిలు లాభాల్లోకి వచ్చాయి. రంగాలవారీగా చూస్తే బ్యాంకెక్స్‌, ఫైనాన్స్‌, టెలికం, టెక్‌, ఐటీ, రియల్టీ రంగ షేర్లు నాలుగు శాతానికి పైగా పతనమవగా, ఎఫ్‌ఎంసీజీ రంగ షేర్లు మాత్రం లాభాల్లోకి వచ్చాయి. 1,650 కంపెనీ షేర్లు పడిపోగా, 779 షేర్లు లాభపడ్డాయి. 

స్టాక్‌ మార్కెట్‌ వరుసగా నష్టాలతో మదుపరులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వరుగా రెండు రోజుల్లో రూ.9.74 లక్షల కోట్ల మదుపరుల సంపద ఆవిరైపోయింది. కరోనా వైరస్‌ మరింత విజృంభిస్తుండటంతో దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్రస్థాయిలో ప్రభావం పడుతున్నదన్న అంచనాలు మార్కెట్లను ముంచుతున్నది. 

గత రెండు రోజుల్లోనే మదుపరులు రూ.9,74,176.71 కోట్లు కోల్పోయి రూ. 1,19,52,066.11 కోట్లకు జారుకున్నది. వరుస రెండు రోజుల్లో సూచీ 3,500 పాయింట్లు పతనం చెందింది. ఈ వైరస్‌ను కట్టడి చేయడానికి పలు దేశాలు ఉద్దీపన ప్యాకేజీలు ప్రకటిస్తుండటంతో అంతర్జాతీయ మార్కెట్లు కుప్పకూలాయని మార్కెట్‌ వర్గాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios