180 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్...చంద్రయాన్ సక్సెస్ దెబ్బతో ఈ 10 స్టాక్స్ ఒక్క రోజులోనే 12 శాతం వరకూ ర్యాలీ
సెన్సెక్స్, నిఫ్టీలో హెవీ వెయిట్ స్టాక్స్ అయిన రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ షేర్ల అమ్మకాలతో మార్కెట్లలో మూడు రోజుల పాటు సాగిన ర్యాలీకి బ్రేక్ పడింది. దీని కారణంగా సెన్సెక్స్, నిఫ్టీ గురువారం నష్టాలతో ముగిశాయి.
దేశీయ స్టాక్ మార్కెట్ లు చివర్లో క్షీణించి నష్టాల్లో ముగిశాయి. నేటి ట్రేడింగ్ లో సెన్సెక్స్, నిఫ్టీ రెండు సూచీలు బలహీనంగా ముగిశాయి. సెన్సెక్స్‌లో దాదాపు 200 పాయింట్లు నష్టపోయింది. అదే సమయంలో నిఫ్టీ కూడా 19400 దిగువకు వచ్చింది. నిఫ్టీలో ఆటో, ఫైనాన్షియల్, మెటల్, ఫార్మా సూచీలు రెడ్ మార్క్‌లో ముగిశాయి. బ్యాంక్, ఎఫ్‌ఎంసీజీ, ఐటీ, రియాల్టీ సూచీలు గ్రీన్‌మార్క్‌లో ముగిశాయి. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 181 పాయింట్ల బలహీనతతో 65,252 వద్ద ముగిసింది. నిఫ్టీ 57 పాయింట్లు నష్టపోయి 19,387 వద్ద ముగిసింది. ఈరోజు హెవీవెయిట్ స్టాక్స్‌లో అమ్మకాలు కనిపించాయి. ఈరోజు సెన్సెక్స్ లోని 19 స్టాక్స్ నష్టాల్లో ముగిశాయి. టాప్ గెయినర్స్‌లో INDUSINDBK, INFY, ULTRACEMCO, ICICIBANK, AXISBANK ఉన్నాయి. టాప్ లూజర్లలో JIOFIN, RELIANCE, POWERGRID, LT, JSWSTEEL, HCLTECH ఉన్నాయి.
చంద్రయాన్-3 విజయవంతంగా ల్యాండింగ్ అయిన తర్వాత, ఇస్రో మూన్ మిషన్‌లో పాల్గొన్న కంపెనీల షేర్లు గురువారం 12 శాతం వరకు పెరిగాయి. చంద్రయాన్ విజయవంతం అవడం ద్వారా 'మేక్ ఇన్ ఇండియా' థీమ్‌కు బలం చేకూరింది. L&T వంటి భారతీయ కంపెనీలు గ్లోబల్ రాకెట్, లాంచ్, శాటిలైట్ మార్కెట్‌లలో ప్రవేశించేందుకు మార్గం లభించింది.
>> పారాస్ డిఫెన్స్ & స్పేస్ టెక్నాలజీస్ స్టాక్ ఈ రోజు స్టాక్ 12 శాతం కంటే ఎక్కువ పెరిగింది.
>> MTAR టెక్నాలజీస్ కంపెనీ షేర్లు నిన్న 5శాతం ముగియగా, నేడు మరో 8శాతం పెరిగాయి.
>> హిందుస్థాన్ ఏరోనాటిక్స్ (HAL) స్టాక్ నేడు మరో 1శాతం లాభపడింది.
>> మిశ్ర ధాతు నిగమ్ నిన్న 3శాతం కంటే ఎక్కువ ర్యాలీ చేసిన తర్వాత, ఈ స్టాక్ ఈ రోజు దాదాపు 2శాతం పెరిగింది.
>> BEHL షేర్లు 1శాతం లాభపడ్డాయి.
>> ఎల్&టీ హెవీవెయిట్ స్టాక్ 2 రోజుల్లో దాదాపు 3శాతం లాభపడింది.
>> భారత్ ఎలక్ట్రానిక్స్ ఈరోజు షేరు 2 శాతం లాభపడింది.
>> సెంటమ్ ఎలక్ట్రానిక్స్ ఇది నిన్న 14శాతం ర్యాలీ చేసి, ఈరోజు మరో 10శాతం లాభంతో అగ్రస్థానాన్ని తాకింది.
>> గోద్రెజ్ ఇండస్ట్రీస్ గోద్రెజ్ ఇండస్ట్రీస్ స్టాక్ నిన్న 7శాతం లాభపడింది. ఈ రోజు మరో 3 శాతం లాభపడింది.