కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రభావం మార్కెట్లపై ఇంకా కొనసాగుతూనే ఉంది. నిర్మలా సీతారమన్ ఆర్థక శాఖ మంత్రి హయంలో తొలిసారి శుక్రవారం బడ్జెట్ ప్రవేశపెట్టారు. అయితే... ఈ బడ్జెట్ కారణంగా మార్కెట్లు భారీ పతనాన్ని చూశాయి. అదే పతనం ఇంకా కొనసాగుతోంది. 

బడ్జెట్ కారణంగా చాలామంది తమ షేర్లను అమ్మకాల్లో పెట్టారు. ఈ క్రమంలో ఒత్తిడి పెరిగి మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. వీటికి తోడు విదేశీ పెట్టుబడులు భారీగా తరలిపోవడం , ఆసియా మార్కెట్లు బలహీనంగా ఉండటం కూడా దీనికి ఒక కారణమైంది. సోమవారం ఉదయం నుంచే మార్కెట్లు కుప్పకూలాయి. 

ఈ ఉదయం 400 పాయింట్లకు పైగా నష్టంతో ట్రేడింగ్‌ను ఆరంభించిన బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజీ సెన్సెక్స్‌ ప్రస్తుతం 800 పాయింట్లకు పైగా దిగజారింది. ఈ రోజుని 2019లో మార్కెట్లకు అత్యంత చెత్త రోజుగా ట్రేడర్స్ చెబుతున్నారు.   2018 డిసెంబరు తర్వాత సెన్సెక్స్‌ ఇంత భారీగా నష్టోవడం మళ్లీ ఇప్పడే  జరిగిందని వారు చెప్పారు.అటు నిఫ్టీ కూడా 250 పాయింట్లకు పైగా నష్టపోయింది.