Asianet News TeluguAsianet News Telugu

స్టాక్ మార్కెట్ రికార్డుల జోరు: నేడు 54 వేల మార్క్ క్రాస్‌ చేసిన సెన్సెక్స్‌.. నిఫ్టీ కూడా..

బాంబే స్టాక్‌ ఎక్సేంజీలో సెన్సెక్స్‌ నేడు సరికొత్త ఎత్తులకు చేరుకుంది. దీంతో తొలిసారిగా సెన్సెక్స్‌ 54 వేల మార్క్‌ని దాటింది. ఈ ఏడాది ఆరంభంలో ఫిబ్రవరిలో తొలిసారిగా సెన్సెక్స్‌ 50 వేల మార్క్‌ని క్రాస్‌ చేసింది. 

sensex nifty today : share market closes today at new record know latest news on 4 august 2021 closing indian benchmark
Author
Hyderabad, First Published Aug 4, 2021, 6:15 PM IST

నేడు ఉదయం రికార్డు స్థాయిలో ప్రారంభమైన స్టాక్ మార్కెట్ లైఫ్‌టైం హైలను నమోదు చేశాయి. దేశీయ స్టాక్ మార్కెట్ బుధవారం లాభాలతో  ముగిసింది. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్  ప్రైమరీ ఇండెక్స్ సెన్సెక్స్ 546.41 పాయింట్ల లాభంతో (1.02 శాతం) 54,369.77 వద్ద ముగిసింది. మరోవైపు, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 128.05 పాయింట్ల లాభంతో (0.79 శాతం) 16,258.80 వద్ద ముగిసింది. మార్కెట్ ముగింపులో  ఇదే అత్యధిక స్థాయి.  

బాంబే స్టాక్‌ ఎక్సేంజీలో సెన్సెక్స్‌ నేడు కొత్త ఎత్తులకు చేరుకుంది. తొలిసారిగా 54 వేల మార్క్‌ని క్రాస్‌ చేసింది. కరోనా  ఫస్ట్‌వేవ్‌ తర్వాత స్టాక్  మార్కెట్‌ పరిస్థితులు చక్కబడటంతో ఈ ఏడాది ఆరంభంలో ఫిబ్రవరిలో తొలిసారిగా సెన్సెక్స్‌ 50 వేల మార్క్‌ని దాటింది. అయితే ఆ తర్వాత కరోనా సెకండ్‌ వేవ్‌ రావడంతో షేర్ మార్కెట్‌ ఒడిదుడుకులకు లోనైంది.

తాజాగా కరోనా సెకండ్‌ ప్రభావం పూర్తిగా తగ్గడం, ఆర్థిక వ్యవస్త పుంజుకోవడంతో ఇన్వెస్టర్లు జోరుమీదున్నారు.దీనికి తోడు సెకండ్‌ క్వార్టర్‌ ఫలితాల్లో మెటల్‌, సాఫ్ట్‌వేర్‌, బ్యాంకింగ్‌ సెక్టార్‌లో చాలా కంపెనీలు మెరుగైన పనితీరు కనబరచడంతో మార్కెట్‌పై విశ్వాసం పెరిగింది. మరోవైపు విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాలు ప్రారంభించడం కూడా కలిసి వచ్చింది. దీంతో సెన్సెక్స్‌ 54 వేల మార్క్ ని  దాటింది. 

ఎస్‌బి‌ఐ జారీ చేసిన త్రైమాసిక ఫలితాలు
 దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బి‌ఐ) జూన్ 30తో ముగిసిన ఆర్థిక సంవత్సరం ప్రస్తుత మొదటి త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏప్రిల్ నుండి జూన్ వరకు రూ. 6,504 కోట్ల లాభాన్ని ఆర్జించింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో బ్యాంక్ రూ .4,189.34 కోట్ల లాభాన్ని ఆర్జించింది.

also read విమాన ప్రయాణికులకు ఇండిగో బంపర్‌ ఆఫర్‌..! ఇప్పుడు అతి తక్కువ ధరకే ఫ్లయిట్ టికెట్..

ఏడాది ప్రాతిపదికన బ్యాంక్ లాభంలో 55.25 శాతం జంప్ అయింది. బ్యాంక్ నిర్వహణ లాభం రూ .18,975 కోట్లు, వడ్డీపై ఆదాయాలు (ఎన్ఐఐ) 3.74 శాతం పెరిగి రూ .27,638 కోట్లకు చేరాయి. బ్యాంకు ఇతర ఆదాయం కూడా రూ .11,802.7 కోట్లకు పెరిగింది. గత సంవత్సరం ఈ సంఖ్య రూ .7,957.5 కోట్లు. ఈరోజు ఎస్‌బి‌ఐ స్టాక్ బి‌ఎస్‌ఈలో 2.37 శాతం పెరిగి 457.05 స్థాయిలో ముగిసింది.

 టాటా స్టీల్, ఎన్‌టి‌పి‌సి, బజాజ్ ఆటో, పవర్ గ్రిడ్, యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డి‌ఎఫ్‌సి బ్యాంక్,హెచ్‌డి‌ఎఫ్‌సి, డాక్టర్ రెడ్డీస్, రిలయన్స్, బజాజ్ ఫైనాన్స్, కోటక్ బ్యాంక్, హెచ్‌సి‌ఎల్ టెక్, ఐ‌సి‌ఐ‌సి‌ఐ బ్యాంక్, ఎస్‌బి‌ఐ షేర్లు లాభాలతో ముగిశాయి. మరోవైపు టెక్ మహీంద్రా, మారుతి, టైటాన్, ఎం అండ్ ఎం, టి‌సి‌ఎస్, సన్ ఫార్మా, ఐ‌టి‌సి, హిందుస్థాన్ యూనిలీవర్, ఆసియన్ పెయింట్స్, అల్ట్రాటెక్ సిమెంట్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎల్ అండ్ టి, ఇన్ఫోసిస్, బజాజ్ ఫిన్ సర్వ్, భారతీ ఎయిర్‌టెల్ షేర్లు నష్టలతో ముగిశాయి.

నేడు ఉదయం సెన్సెక్స్ 241.91 పాయింట్లు (0.45 శాతం)తో  54065.27 స్థాయిలో ప్రారంభమైంది. నిఫ్టీ 103.10 పాయింట్ల (0.64 శాతం) లాభంతో 16233.90 వద్ద ప్రారంభమైంది. స్టాక్ మార్కెట్  మంగళవారం రికార్డు స్థాయిలో ముగిసింది. సెన్సెక్స్ 872.73 పాయింట్ల (1.65 శాతం) లాభంతో 53,823.36 వద్ద ముగిసింది. మరోవైపు, నిఫ్టీ 245.60 పాయింట్ల (1.55 శాతం) లాభంతో 16,130.75 వద్ద ముగిసింది. 

నేడు ఉదయం 9.03 గంటలకు ప్రీ-ఓపెన్ సమయంలో సెన్సెక్స్ 53996.81 స్థాయిలో 173.45 పాయింట్లు (0.32 శాతం)  పెరిగింది. నిఫ్టీ 22.70 పాయింట్లు (0.14 శాతం) పెరిగి 16153.50 వద్ద ఉంది.

Follow Us:
Download App:
  • android
  • ios