కరోనా వైరస్ సెకండ్ వేవ్ కారణంగా నేడు స్టాక్ మార్కెట్ నష్టాలతో ప్రారంభమైంది. టాటా స్టీల్, బిపిసిఎల్, విప్రో, ఎస్‌బిఐ షేర్లు లాభాలతో ప్రారంభం కాగా మిగతావి నష్టాలతో ట్రేడవుతున్నాయి.
ఇండియాలో కరోనా వైరస్ రోజువారీ కేసుల పెరుగుదల ఇప్పుడు స్టాక్ మార్కెట్ పై కూడా ప్రభావం చూపడం ప్రారంభించింది. స్టాక్ మార్కెట్ గురువారం రోజున అంటే నేడు నష్టాలతో ప్రారంభమై ఇప్పటికీ రెడ్ మార్క్ వద్ద ట్రేడవుతోంది.
బిఎస్‌ఇ ఇండెక్స్ సెన్సెక్స్ 304 పాయింట్లు పడిపోయి 47,401 వద్ద ప్రారంభం కాగా అలాగే నిఫ్టీ 63 పాయింట్లు పడిపోయి 14,296 వద్ద ప్రారంభమైంది.
also read భారతీయ బ్యాంకింగ్ సంస్కరణల పితామహుడు, ఆర్‌బీఐ మాజీ గవర్నర్ ఇక లేరు ...
ప్రపంచ సూచనల తరువాత కూడా స్టాక్ మార్కెట్ నేడు పడిపోయింది. శ్రీ రామ్ నవమి సందర్భంగా బుధవారం స్టాక్ మార్కెట్ మూసివేసిన సంగతి మీకు తెలిసిందే, అయితే అంతకుముందు రోజు మంగళవారం కూడా స్టాక్ మార్కెట్ నష్టాలతోనే ముగిసింది.
గురువారం స్టాక్ మార్కెట్ ప్రారంభమైన వెంటనే టాటా స్టీల్ స్టాక్ రెండు శాతం పెరిగింది. దీనితో పాటు బిపిసిఎల్, విప్రో, డాక్టర్ రెడ్డి, ఎస్‌బిఐఐ షేర్లు కూడా లాభాలతో కొనసాగుతుంది.
మంగళవారం బిఎస్‌ఇ సెన్సెక్స్ 243.62 పాయింట్లు పడిపోయి 47,705.80 వద్ద, ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ 63.05 పాయింట్లు తగ్గి 14,296.40 పాయింట్లకు చేరుకున్నాయి.
