Asianet News TeluguAsianet News Telugu

మండే ‘భగభగలు’: 15 నిమిషాల్లో రూ.6 లక్షల కోట్లు హాంఫట్..

ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కరోనా తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందన్న ఆందోళనల మధ్య​ దేశీయ స్టాక్​ మార్కెట్లు భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 1500 పాయింట్లకుపైగా నష్టంతో 32, 590 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 500 పాయింట్లకుపైగా నష్టంతో 9,440 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతోంది. భారీ నష్టాలతో రూ.6.25 లక్షల కోట్ల మదుపర్ల సంపద ఆవిరైంది. 

Sensex, Nifty Down  NSE Nifty 50 benchmark dropped
Author
Hyderabad, First Published Mar 16, 2020, 11:45 AM IST

ప్రపంచ స్థూల దేశీయోత్పత్తి పడిపోయి మాంద్యం ముంచుకొస్తుందన్న అంచనాల నేపథ్యంలో స్టాక్ మార్కెట్ సూచీలు నేల చూపులు చూస్తున్నాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్ ఒక దశలో 2064 పాయింట్లకు పైగా క్షీణించింది. 

సెన్సెక్స్ ప్రస్తుతం 1836 పాయింట్లకు పైగా కోల్పోయి 32,266 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ 494 పాయింట్లు పైగా  క్షీణించి  9460 వద్ద ట్రేడవుతోంది.

సన్​ఫార్మా, టీసీఎస్, బజాజ్ ఆటో, పవర్ గ్రిడ్, హిందూస్థాన్ యూనీలీవర్ సహా 30 షేర్ల సూచీలోని అన్ని వ్యాపార సంస్థల షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. డాలరు మారకం ధరతో పోలిస్తే రూపాయి విలువ 42 పైసలు క్షీణించి రూ. 74.17కు చేరింది.

also read యస్ బ్యాంక్ దివాళా... అనిల్ అంబానీకి కొత్త చిక్కులు, ఈడీ సమన్లు

బొంబే స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్ 1867 పాయింట్లు కోల్పోయి 32, 236 వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ 525 పాయింట్లు క్షీణించి 9430 గా కొనసాగుతోంది.

గత వారం మార్కెట్లో రికార్డు స్థాయిలో నష్టాల వల్ల గతవారం టాప్ 10 కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ (మార్కెట్ విలువ) రూ.4.22 లక్షల కోట్లు క్షీణించింది. టీసీఎస్, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎక్కువగా నష్టపోయాయి. ప్రపంచ మార్కెట్ల పతనంతో మార్కెట్లు తీవ్ర ఒత్తిడికి లోనయ్యాయి.

గత వారంలో సెన్సెక్స్ 3,473 పాయింట్లు అంటే 9.24 శాతం పడిపోయింది. టిసిఎస్ మార్కెట్ క్యాప్ రూ.1.16 లక్షల కోట్లు నష్టపోయి రూ.6.78 లక్షల కోట్లకు చేరింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ విలువ రూ.1.03 లక్షల కోట్లు తగ్గి రూ.7.01 లక్షల కోట్లకు చేరుకుంది.

also read దొడ్డిదారి నిర్ణయం: ముడి చమురు ధర తగ్గింపు.. సుంకంతో ఖజానాకు మళ్లింపు!

ఇన్ఫోసిస్ విలువ రూ.41,315 కోట్లు తగ్గి రూ.2.73 లక్షల కోట్లకు చేరింది. హెచ్‌డిఎఫ్‌సి విలువ 34,919 కోట్ల రూపాయలు తగ్గి రూ.5.87 లక్షల కోట్లకు చేరుకుంది. అదేవిధంగా హిందూస్థాన్ యూనిలీవర్ మార్కెట్ విలువ రూ.33,208 కోట్లు తగ్గి రూ.4.40 లక్షల కోట్లకు పడిపోయింది.

కోటక్ మహీంద్రా బ్యాంక్ మార్కెట్ విలువ రూ.30,931 కోట్లు తగ్గి రూ.2,81,237 కోట్లకు చేరింది. అదేవిధంగా ఐసిఐసిఐ బ్యాంక్ మార్కెట్ క్యాప్ కూడా రూ.25,098 కోట్లు తగ్గి రూ.2.89 లక్షల కోట్లకు చేరింది. బజాజ్ ఫైనాన్స్ విలువ రూ.16,320 కోట్లు తగ్గి రూ.2.37 లక్షల కోట్లకు చేరుకుంది. భారతి ఎయిర్‌టెల్ విలువ రూ .13,611.62 కోట్లు క్షీణించి రూ.2,69,613 కోట్లకు చేరింది.
 

 

Follow Us:
Download App:
  • android
  • ios