మార్కెట్లపై అవిశ్వాసం ఎఫెక్ట్.. నష్టాల్లో సూచీలు

Sensex drops over 220 points from intraday high as Speaker admits no-confidence motion
Highlights

ఈ అవిశ్వాస తీర్మాన ఎఫెక్ట్.. దేశీయ మార్కెట్లపై పడింది. దీంతో.. రికార్డు స్థాయిలో ఉన్న సూచీలు ఒక్కసారిగా నష్టాల్లోకి జారుకున్నాయి.
 

నేటి నుంచి పార్లమెంట్ వర్షకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. సమావేశాలు అలా ప్రారంభం అయ్యాయోలేదో..టీడీపీ కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం తీసుకువచ్చింది. టీడీపీ ఒత్తిడికి తలొగ్గి.. స్పీకర్ తీర్మానాన్ని ఆమోదించారు. ఈ అవిశ్వాస తీర్మాన ఎఫెక్ట్.. దేశీయ మార్కెట్లపై పడింది. దీంతో.. రికార్డు స్థాయిలో ఉన్న సూచీలు ఒక్కసారిగా నష్టాల్లోకి జారుకున్నాయి.

బ్యాంకింగ్‌, ఆటోమొబైల్‌, ఔషధ రంగాల షేర్లలో కొనుగోళ్ల అండతో ఈ ఉదయం సూచీలు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. దాదాపు 200 పాయింట్ల లాభంతో ట్రేడింగ్‌ను ఆరంభించిన బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజి సెన్సెక్స్‌ 36,747(ఇంట్రాడే) వద్ద సరికొత్త జీవనకాల గరిష్ఠాన్ని తాకింది. అయితే ఈ జోరు ఎంతో సేపు నిలవలేదు. కేంద్రంపై అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో సూచీలు నష్టాల్లోకి జారుకున్నాయి. ఒక దశలో సెన్సెక్స్‌ 200 పాయింట్ల వరకు నష్టపోయింది. ఆ తర్వాత కూడా మార్కెట్లు లాభనష్టాల్లో ఊగిసలాడుతూనే ఉన్నాయి.

మధ్యాహ్నం 1.15 గంటల ప్రాంతంలో సెన్సెక్స్‌ 22 పాయింట్ల నష్టంతో 36,498 వద్ద, నిఫ్టీ స్వల్పంగా 1 పాయింటు నష్టంతో 11,007 వద్ద కొనసాగుతున్నాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ. 68.53గా కొనసాగుతోంది.

loader