Asianet News TeluguAsianet News Telugu

High Return Stocks: మార్కెట్ 6 నెలల్లో 5000 పాయింట్లు పడ్డా..100 శాతం లాభాలు ఇచ్చిన స్టాక్స్ ఇవే..

2022 సంవత్సరం ప్రథమార్థం ముగియడానికి కేవలం ఒక్క రోజు మాత్రమే మిగిలి ఉంది. జనవరి 1 నుంచి జూన్ 29 వరకు మార్కెట్‌లో భారీగా ఒడిదుడుకులు కనిపించాయి. ఈ సమయంలో సెన్సెక్స్, నిఫ్టీల్లో దాదాపు 9 శాతం బలహీనత కనిపించింది. మార్కెట్‌లో 80 శాతం షేర్లు ఇన్వెస్టర్లను నష్టపోయేలా చేశాయి.

Sensex breaks 5000 points in first 6 months but these stocks gave 100 pc to 200 pc returns
Author
Hyderabad, First Published Jun 29, 2022, 3:29 PM IST

భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, పెరుగుతున్న వస్తువులు, ఇంధన ధరలు, సరఫరా సంబంధిత సమస్యలు, కరోనావైరస్ మహమ్మారి, విదేశీ పెట్టుబడిదారుల విక్రయాల కారణంగా సంవత్సరం ప్రారంభం నుండి మార్కెట్ అమ్మకాల ఒత్తిడిలో ఉంది. అయితే ఈ మధ్య కాలంలో కొన్ని స్టాక్స్ కూడా ఇన్వెస్టర్ల జేబులు నింపే పనిలో పడ్డాయి. ఈ ఏడాది 100 శాతం నుంచి 200 శాతం రాబడులు ఇచ్చిన కొన్ని స్టాక్‌లు ఉన్నాయి.

సెన్సెక్స్ 5000 పాయింట్లు బలహీనపడింది
జనవరి 1 నుండి జూన్ 29 వరకు, ఈ కాలంలో సెన్సెక్స్ 9 శాతం లేదా దాదాపు 5050 పాయింట్ల బలహీనతను చూసింది. సెన్సెక్స్ 30కి చెందిన 21 స్టాక్స్ ప్రతికూల రాబడులను ఇచ్చాయి. అదే సమయంలో, ఈ కాలంలో నిఫ్టీ కూడా దాదాపు 9 శాతం లేదా 1500 పాయింట్ల బలహీనతను చూసింది. నిఫ్టీ 50కి చెందిన 37 స్టాక్‌లు రెడ్ మార్క్‌లో కనిపించాయి. విస్తృత మార్కెట్ గురించి మాట్లాడుకుంటే, BSE 500 సుమారు 10 శాతం లేదా 2380 పాయింట్లు పడిపోయింది. ఇండెక్స్‌లో చేర్చబడిన 500 స్టాక్‌లలో 387 స్టాక్‌లు రెడ్ మార్క్‌లో ఉన్నాయి.

మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ కూడా
ఇప్పటివరకు 2022 సంవత్సరం గురించి మాట్లాడితే, BSE మిడ్‌క్యాప్ ఇండెక్స్ 3100 పాయింట్లు లేదా 12.50 శాతం బలహీనతను చూసింది. మరోవైపు, స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 4480 పాయింట్లు లేదా 15 శాతం నష్టపోయింది. మిడ్‌క్యాప్ ఇండెక్స్‌లోని 77 శాతం స్టాక్స్ ప్రతికూల రాబడులను పొందాయి. మరోవైపు, స్మాల్‌క్యాప్ ఇండెక్స్‌లో  దాదాపు 70 శాతం స్టాక్‌లు ప్రతికూల రాబడిని ఇచ్చాయి. బీఎస్ఈ ఐటీ ఇండెక్స్ 24 శాతం నష్టపోగా, మెటల్ ఇండెక్స్ 18 శాతం నష్టపోయింది. రియల్టీ ఇండెక్స్‌లో 19 శాతం బలహీనత, బీఎస్‌ఈ ఐపీఓ ఇండెక్స్‌లో 28 శాతం బలహీనత ఉంది. బీఎస్ఈ టెలికాం ఇండెక్స్ 13 శాతం నష్టపోయింది.

ఈ స్టాక్‌లలో 100% కంటే ఎక్కువ రాబడి
CPCL: 218%
అదానీ పవర్: 173%
వాడిలాల్ ఇండ్స్: 133%
MRPL: 117%
BLS ఇంటర్నేట్: 104%

ఈ స్టాక్‌లలో కూడా 67-94% రాబడి
ఓరియంట్ బెల్: 94%
GMDC: 90%
మీర్జా ఇంటర్నేషనల్: 86%
మారథాన్ నెక్స్ట్‌జెన్: 86%
భారత్ డైనమిక్స్: 79%
జె కుమార్ ఇన్‌ఫ్రా: 77%
శారదా క్రాప్‌కెమ్: 76%
విష్ణు కెమికల్స్: 73%
మహీంద్రా లైఫ్: 71%

Follow Us:
Download App:
  • android
  • ios