ఎస్​బీఐ కస్టమర్లకు గుడ్ న్యూస్...న్యూ ఇయర్ కానుకగా...

భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) తన ఖాతాదారులకు నూతన సంవత్సర కానుక అందించింది. వడ్డీరేటు (ఈబీఆర్​)ను 25 బేసిస్​ పాయింట్లు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఫలితంగా నూతన గృహ కొనుగోలుదారులకు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు తక్కువ వడ్డీకే రుణాలు లభించనున్నాయి.

SBI cuts external benchmark-based rate by 25 bps

న్యూఢిల్లీ: భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) తన ఖాతాదారులకు నూతన వసంతంలోకి అడుగు పెడుతున్న వేళ తీపి కబురు అందించింది. ఎస్బీఐ తన 'ఎక్స్​టర్నల్​ బెంచ్​మార్క్​ ఆధారిత వడ్డీ రేటు' (ఈబీఆర్​)ను 25 బేసిస్​ పాయింట్లు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఫలితంగా ఇప్పుడు ఉన్న ఈ కీలక వడ్డీ రేటు 8.05 నుంచి 7.80 శాతానికి దిగి రానున్నది. 

also read ఎస్​బీఐ కస్టమర్లకు గుడ్ న్యూస్...నూతన ఇయర్ కానుకగా...

ఈ కొత్త రేటు 2020 జనవరి ఒకటో తేదీ నుంచి అమల్లోకి వస్తుందని ఎస్​బీఐ స్పష్టం చేసింది. ఈబీఆర్​ తగ్గింపుతో  గృహ, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్​ఎం​ఈ) రుణగ్రహీతలకు లాభం చేకూరనుంది.ఎస్​బీఐ 2019 జులై 1 నుంచి ఈ ఫ్లోటింగ్ రేటు గృహరుణాలు మంజూరు చేస్తోంది. ఈబీఆర్​ తగ్గింపుతో ఇప్పుడున్న 8.15 శాతం వడ్డీరేటు నూతన సంవత్సరంలో 7.90 శాతానికి దిగిరానుంది.

SBI cuts external benchmark-based rate by 25 bps

రిజర్వ్ బ్యాంకు ఆఫ్​ ఇండియా  (ఆర్బీఐ) అన్ని బ్యాంకులను ఒక నిర్దిష్ట వర్గాల రుణాలను ఈబీఆర్​కు అనుసంధానించాలని ఆదేశించింది. 'రెపోరేటు' తగ్గింపుపై బ్యాంకులు తాత్సారం చేయడమే ఇందుకు కారణం.ఆర్​బీఐ ఆదేశాల తరువాత ఎస్​బీఐ తన ఈబీఆర్​గా 'రెపోరేటు'ను స్వీకరించింది. 2019 అక్టోబర్ ఒకటో తేదీ నుంచి దీనిని ఆధారంగా చేసుకునే గృహ, ఎంఎస్​ఎంఈ, రిటైల్ రుణాలు అందిస్తోంది.​ 

also read బ్యాంకులకు వెళుతున్నారా అయితే ఈ వివరాలు తెలుసుకోండి...

ఆర్బీఐ ఫిబ్రవరి నుంచి అక్టోబర్​ మధ్య రెపోరేటును 135 బేసిస్ పాయింట్లు వరకు తగ్గించింది. అయితే బ్యాంకులకు తమ ఈబీఆర్​ను మూడు నెలలకోసారి మార్చుకునేందుకు అవకాశమూ ఉంది. అయినా బ్యాంకులు ఇప్పటి వరకు మంజూరు చేసిన రుణాలపై వెయిటెడ్​ యావరేజ్​ లెండింగ్ రేటు (డబ్ల్యూఏఎల్​ఆర్​) 44 బేసిస్​ పాయింట్లు మాత్రమే తగ్గడం గమనార్హం.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios