ఆగస్టు 31 తర్వాత మారటోరియం పొడిగింపు అవసరం లేదని భారతదేశపు అతిపెద్ద రుణదాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ రజనీష్ కుమార్ అన్నారు. ఈ‌ఎం‌ఐ వాయిదాపై తాత్కాలిక నిషేధం ఆగస్టు 31 వరకు అంటే మూడు నెలల పొడిగింపుగా సెంట్రల్ బ్యాంక్ మేలో ప్రకటించింది.

కోవిడ్ -19 మహమ్మారి కారణంగా మార్చి 25 నుండి లాక్ డౌన్ విధించడంతో ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోయాయి, ప్రజలు ఉద్యోగాలు కోల్పోయి, వేతనాలు లేక/ కోత కరాణంగా ఈ‌ఎం‌ఐ చెల్లింపులపై ప్రభావం పడింది.

ఎస్‌బిఐ బ్యాంకింగ్ అండ్ ఎకనామిక్స్ కాన్క్లేవ్‌లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రజనీష్ కుమార్ మాట్లాడుతూ, మరోసారి మారటోరియం పొడిగింపు ఉండదని, ఆర్‌బీఐ వద్ద మొత్తం ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన పూర్తి గణాంకాలు ఉన్నాయి. ఈ లెక్కలు ఆధారంగానే ఆర్‌బీఐ మారిటోరియం కొనసాగింపుపై నిర్ణయం తీసుకోవచ్చు.

also read ఇళ్లు కొనేవారు కరువు ? 9 నగరాల్లో 67 శాతం తగ్గుదల.. ...

అత్యవరసమని భావించిన కొన్ని రంగాలకు తప్ప మారిటోరియం అనవసరమని తాను భావిస్తున్నట్లు తెలిపారు. కరోనా కట్టడికి దేశవ్యాప్త లాక్‌డౌన్‌ నేపథ్యంలో విధించిన మారిటోరియం పొడిగింపూ డిసెంబర్‌ వరకు కొనసాగించే అంశాన్ని ఆర్‌బీఐ పరిశీలిస్తున్నదని కొన్ని మీడియా వర్గాలు ప్రస్తావించిన నేపథ్యంలో రజినీష్‌ వ్యాఖ్యలు ఆసక్తిని సంతరించుకున్నాయి.

బ్యాంకు వార్షిక నివేదిక ప్రకారం, ఈ‌ఎం‌ఐ తాత్కాలిక నిషేధంలో 5.63 ట్రిలియన్ రుణాలు ఉన్నాయి. 9.4 మిలియన్ టర్మ్ లోన్ అకౌంట్లలో 900,000 మంది ఏమి చెల్లించలేదని, 700,000 మంది ఒక విడత చెల్లించారని, మిగిలిన వారు రెండు విడతలు చెల్లించారని రజనీష్ కుమార్ జూన్ 5న చెప్పారు.

రుణగ్రహీతలు రెండు లేదా అంతకంటే ఎక్కువ వాయిదాలను చెల్లించినట్లయితే, అది వాయిదాగా పరిగణించబడదు అని రజినీష్‌ కుమార్ శుక్రవారం చెప్పారు. మహారాష్ట్ర, తమిళనాడు వంటి కొన్ని రాష్ట్రాలకు లేదా పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన రాష్ట్రాలకు కోవిడ్ -19 ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. కరోనావైరస్ మహమ్మారి సృష్టించిన ఆర్థిక సంక్షోభం 2008 ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించింది.