మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ) కస్టమర్ అయితే, ఈ వార్త మీకు చాలా ముఖ్యం. ఎస్‌బి‌ఐ తన 400 మిలియన్ల కస్టమర్లకు హెచ్చరికలు జారీ చేస్తూ అప్రమత్తం చేసింది.

భారతదేశంలో డిజిటల్ పేమెంట్, ఆన్‌లైన్ బ్యాంకింగ్ పెరుగుదలతో పాటు మోసాలు పెరుగుతున్నందున ఇలాంటి బ్యాంకింగ్ మోసాలకి సంబంధించి ఎస్‌బిఐ ఒక హెచ్చరిక జారీ చేసింది. 

సోషల్ మీడియా ట్వీట్టర్ ద్వారా ట్వీట్ చేస్తూ  వినియోగదారులు జాగ్రత్తగా ఉండాలని ఎస్‌బిఐ విజ్ఞప్తి చేసింది. ఎస్‌బి‌ఐ పేరిట సోషల్ మీడియాలో పలు నకిలీ, తప్పుదోవ పట్టించే పోస్టులు షేర్ అవుతున్నాయని కస్టమర్లు ఇలాంటి వాటికి దూరంగా ఉండాలని, బ్లఫ్‌లో చిక్కుకోవద్దని అభ్యర్థించింది.

ఏదైనా మెసేజ్ లేదా ఇమెయిల్ (పిషింగ్ మెయిల్) ద్వారా ఖాతాదారుల బ్యాంక్ అక్కౌంట్ వివరాలు, సమాచారం బ్యాంక్ అడగదని తెలిపింది.

ఎస్‌బిఐ ప్రకారం వినియోగదారులు బ్యాంక్ పేరుతో వచ్చే నకిలీ ఇమెయిల్‌లు, మెసేజులు నుండి అప్రమత్తంగా ఉండాలని అలాంటి ఈ-మెయిల్‌లలో ఉండే లింకులపై క్లిక్ చేయకుండా ఉండటం మంచిదని, వినియోగదారులు వ్యక్తిగత సమాచారాన్ని, బ్యాంక్ అక్కౌంట్ వివరాలను ఆన్‌లైన్‌లో పంచుకోవద్దని తెలిపింది.

also read ప్రతి ఒక్కరికి ఉచితంగా కరోనా వ్యాక్సిన్ వేయాలి.. పర్మనెంట్ వర్క్ ఫ్రోం హోంకి నేను సపోర్ట్ చేయను: నార...

ఆన్‌లైన్ బ్యాంకింగ్ కోసం వినియోగదారులు బ్యాంకు అధికారిక వెబ్‌సైట్‌ను మాత్రమే ఉపయోగించాలని పేర్కొంది. ఆన్ లైన్ బ్యాంకింగ్ మోసాల గురించి ఎస్‌బిఐ వినియోగదారులను తరచుగా అప్రమత్తం చేస్తోందని వివరించింది.  

ఫిషింగ్ ఎటాక్,  సైబర్ ఎటాక్ హ్యాకర్లు ఎక్కువగా ఉపయోగించే సులభమైన పద్ధతి. ఫిషింగ్ దాడుల్లో ఇ-మెయిల్ ఐడిలు కూడా హ్యాక్ అవుతాయి. దీని కోసం హ్యాకర్లు నకిలీ లింక్‌లు కలిగి ఉన్న ఇ-మెయిల్‌లను మీ స్నేహితుల పేరిట పంపుతారు.

ఇలాంటి మోసాలని  నివారించడానికి మీరు అప్పుడు కూడా ఫిషింగ్ ఇమెయిల్‌పై క్లిక్ చేయకూడదు. ఆన్‌లైన్ చెల్లింపులో వన్ టైమ్ పాస్‌వర్డ్ (OTP) ఆప్షన్ ఎల్లప్పుడూ ఎంచుకోవాలి. ఇది ఆన్ లైన్ మోసాలు తగ్గిస్తుంది.