Asianet News TeluguAsianet News Telugu

సానియా మీర్జా, షోయబ్ మాలిక్ విడాకులు..? ఈ ఇద్దరి ఆస్తుల విలువ ఎన్ని కోట్లు అంటే..?

సానియా, షోయబ్ విడాకులు తీసుకున్నారని కొన్ని మీడియా కథనాలు కూడా చెబుతున్నాయి. అయితే దీనికి సంబంధించి సానియా మీర్జా, షోయబ్ మాలిక్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. 

Sania Mirza Shoaib Malik Net Worth: Who is richer between Sania Mirza and Shoaib Malik
Author
First Published Nov 15, 2022, 11:53 AM IST

 భారత మహిళా టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా ఆమె భర్త పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్  గత కొద్ది రోజులుగా వార్తల్లో నిలుస్తున్నారు. వీరి పెళ్లి వివాదం తాజాగా తెరపైకి వచ్చింది. మీడియా కథనాల ప్రకారం, సానియా మీర్జా షోయబ్ మాలిక్ నుండి విడిగా నివసిస్తుంది. సానియా, షోయబ్ విడాకులు తీసుకున్నారని కొన్ని మీడియా కథనాలు కూడా చెబుతున్నాయి. అయితే దీనికి సంబంధించి సానియా మీర్జా, షోయబ్ మాలిక్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

అయితే సానియా, షోయబ్ విడిపోవడం ఎంతవరకు నిజమో అధికారిక ప్రకటన వెలువడితేనే తెలియనుంది. కానీ ఈ ఇద్దరు ప్లేయర్స్ దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందారు. ఇంకా ఇద్దరూ వారి సొంత దేశాలకు చెందిన గొప్ప ఆటగాళ్లు కూడా. షోయబ్ మాలిక్ కోట్ల ఆస్తికి యజమాని అయితే సానియా మీర్జా కూడా సంపాదనలో వెనుకంజ వేయలేదు. షోయబ్ మాలిక్ అండ్ సానియా మీర్జా నికర విలువ, ఇల్లు, కారు ఇంకా సంపాదన గురించి...

సానియా మీర్జా సంపాదన
భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా కేవలం టెన్నిస్ ఆడటం ద్వారా పెద్ద మొత్తంలో డబ్బు సంపాదిస్తుంది. సానియా మీర్జా ఏటా కోట్లలో సంపాదిస్తోంది. సానియా మీర్జా వార్షిక ఆదాయం దాదాపు రూ.3 కోట్లు. క్రీడలే కాకుండా, సానియా చాలా బ్రాండ్ ఎండార్స్‌మెంట్ల ద్వారా కూడా సంపాదిస్తుంది. బ్రాండ్ ఎండార్స్‌మెంట్ల కోసం ఆమె రూ. 25 కోట్లు వసూలు చేస్తుంది. అంతేకాదు చాలా మంది టాప్ సెలెబ్రిటిలు కూడా  అగ్ర బ్రాండ్‌లకు అంబాసిడర్ గా ఉన్నారు. ఇంకా సానియాకు సొంతంగా టెన్నిస్ అకాడమీ కూడా ఉంది.

సానియా మీర్జా విలాసవంతమైన ఇల్లు
టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా హైదరాబాద్ నివాసి. ఆమెకి హైదరాబాద్‌లో విలాసవంతమైన ఇల్లు ఉంది. దీంతో పాటు దుబాయ్‌లో ఓ ఇల్లు కూడా ఉంది. హైదరాబాద్‌లోని సానియా ఇంటి విలువ దాదాపు రూ.13 కోట్లు. ప్రస్తుతం సానియా దుబాయ్‌లోని తన ఇంట్లో ఉంటోంది.

సానియా మీర్జా కార్ కలెక్షన్
స్పొర్ట్స్ ప్లేయర్లకు లగ్జరీ వాహనాలంటే చాలా ఇష్టం. సానియాకు కూడా కోట్ల విలువైన కార్లు ఉన్నాయి. సానియా కార్ల కలెక్షన్ రేంజ్ రోవర్, మెర్సిడెస్ బెంజ్, ఆడి, బిఎమ్‌డబ్ల్యూ సిరీస్ వాహనాలు ఉన్నాయి.

సానియా మీర్జా మొత్తం సంపద 
భారతదేశంలోని అత్యుత్తమ టెన్నిస్ క్రీడాకారిణులలో ఒకరైన సానియా మీర్జా  మొత్తం ఆస్తుల గురించి మాట్లాడితే ఆమెకి సుమారు $ 25 మిలియన్లు అంటే దాదాపు 200 కోట్ల ఆస్తులకు యజమాని.

షోయబ్ మాలిక్ మొత్తం ఆస్తులు
సానియా మీర్జా లాగానే ఆమె భర్త షోయబ్ మాలిక్ కూడా పాకిస్తాన్ అగ్ర ఆటగాళ్లలో ఒకరు. షోయబ్ మాలిక్ సంపద కూడా దాదాపు సానియా మీర్జాతో సమానంగా ఉంటుంది. మీడియా నివేదిక ప్రకారం, షోయబ్ నికర విలువ 28 మిలియన్ డాలర్లు అంటే దాదాపు రూ. 228 కోట్లు. అతని సంపాదనలో ఎక్కువ భాగం స్పొర్ట్స్ నుండి వస్తుంది. దీనితో పాటు, షోయబ్ బ్రాండ్ ఎండార్స్‌మెంట్ ద్వారా కూడా సంపాదిస్తున్నాడు.

Follow Us:
Download App:
  • android
  • ios