Sangeetha: భారతదేశంలో ప్రముఖ మొబైల్ రిటైల్ బ్రాండ్ అయిన Sangeetha తన కస్టమర్లకు ఓ శుభవార్త తీసుకవచ్చింది. తాజాగా ‘ప్రైస్ చాలెంజ్’క్యాంపైన్ తో ముందుకు వచ్చింది.
Sangeetha: భారతదేశంలో ప్రముఖ మొబైల్ రిటైల్ బ్రాండ్ అయిన Sangeetha తన కస్టమర్లకు ఓ శుభవార్త తీసుకవచ్చింది. తాజాగా ‘ప్రైస్ చాలెంజ్’క్యాంపైన్ తో ముందుకు వచ్చింది. ఈ క్యాంపైన్ ద్వారా తన కస్టమర్లకు ఎన్నడూ ఊహించని ఆఫర్లను అందిస్తోంది. Sangeetha కస్టమర్లు ఆన్‌లైన్ అయినా లేదా ఏ Sangeetha స్టోర్‌లో అయినా బెస్ట్ ఆఫర్లతో మొబైల్స్ పొందవచ్చు. అలాగే.. భవిష్యత్తులో ఫోన్ల ధరలు పడిపోవడం లేదా డ్యామేజ్ ప్రోటెక్షన్ హామీలను కూడా Sangeetha అందిస్తోంది.
Sangeetha ప్రైస్ చాలెంజ్ ప్రత్యకత ఏంటి?
రూ.. 10,000 వరకు క్యాష్‌బ్యాక్:
Sangeetha తన కస్టమర్ల కోసం వినూత్నమైన ‘ప్రైస్ చాలెంజ్ స్కీమ్’ను ప్రకటించింది. మొబైల్ ఫోన్ కొనుగోలు సమయంలో ఎప్పుడూ బెస్ట్ ప్రైస్ లభించాలనే నమ్మకంతో ఈ ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. ఈ ప్రైస్ చాలెంజ్‌లో భాగంగా, Sangeetha లో ఫోన్ కొనుగోలు చేసిన తర్వాత 30 రోజుల్లో ఆ ఫోన్ ధర తగ్గితే కస్టమర్లకు గరిష్టంగా రూ. 10,000 వరకు క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.
డ్యామేజ్ ప్రొటెక్షన్:
రిటైల్ మార్కెట్ లో ఎక్కడ లేని విధంగా Sangeetha తొలిసారి డ్యామేజ్ ప్రొటెక్షన్ ను ఆఫర్ చేస్తుంది. అది కూడా ఎటువంటి అదనపు ఖర్చు లేకుండానే. ఎలాగంటే.. Sangeetha అందిస్తున్న ప్రత్యేక ఆఫర్‌లో కొనుగోలు చేసిన ఫోన్ డ్యామేజ్ అయితే, కస్టమర్లు ఏ సంగీతా స్టోర్‌కైనా వెళ్లి కొత్త ఫోన్ కొనుగోలు పై 70% డిస్కౌంట్ పొందవచ్చు. ఈ ఆఫర్‌తో కస్టమర్లకు నిజమైన సంతోషాన్ని, భరోసా ను కల్పిస్తోంది Sangeetha .
అత్యుత్తమ సేవలే మా లక్ష్యం - మేనేజింగ్ డైరెక్టర్
Sangeetha ప్రైస్ చాలెంజ్ క్యాంపైన్ సందర్భంగా మేనేజింగ్ డైరెక్టర్ సుభాష్ చంద్ర మాట్లాడుతూ.. Sangeetha లో మొబైల్ కొనుగోలు చేసే కస్టమర్లకు నాణ్యమైన సేవలు అందించడమే తమ ధ్యేయమన్నారు. ధర తగ్గితే తేడా మొత్తాన్ని తిరిగి ఇస్తామని, ఎందుకంటే కస్టమర్ల ఆనందమే మన బాధ్యత అని ప్రకటించారు. అలాగే, ఫోన్ డ్యామేజ్ అయితే తక్కువ ఖర్చుతో కొత్త ఫోన్ పొందే అవకాశం కల్పిస్తున్నామన్నారు. తన కస్టమర్ల పెట్టుబడిని, కనెక్టివిటీని రక్షించడం తమ లక్ష్యమని మేనేజింగ్ డైరెక్టర్ సుభాష్ చంద్ర పేర్కొన్నారు.

Sangeetha ప్రస్థానం
1974లో స్థాపించబడిన Sangeetha, భారతదేశంలో అగ్రగామి మల్టీ-బ్రాండ్ మొబైల్ ఫోన్ రిటైలర్‌గా గుర్తింపు పొందింది. బెంగళూరులో ప్రధాన కార్యాలయం కలిగిన ఈ సంస్థ, ప్రస్తుతం దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లో 800కిపైగా స్టోర్లను విజయవంతంగా నిర్వహిస్తోంది. ఇప్పటివరకు 2 కోట్లకు పైగా కస్టమర్లకు సేవలు అందిస్తూ, 5,000కుపైగా ఉద్యోగ అవకాశాలను సృష్టించింది. ఎల్లప్పుడూ అవిష్కరణ, నమ్మకం, కస్టమర్-ఫస్ట్ పాలసీలతో ముందుకు సాగుతూ, భారతీయ మొబైల్ రిటైల్ రంగంలో ప్రత్యేక స్థానంలో నిలిచింది.
