Samhi Hotels IPO: రేపటి నుంచి సంహీ హోటల్స్ ఐపీవో ప్రారంభం..మినిమం ఎంత పెట్టుబడి పెట్టాలంటే..?
ఐపీఓ మార్కెట్ లో మంచి డబ్బు సంపాదించాలని ప్లాన్ చేస్తున్నారా. అయితే ఇక ఏమాత్రం ఆలోచించకండి సంహీ ఐపిఓ రేపటి నుంచి ప్రారంభం కానుంది ఈ నేపథ్యంలో మినిమం ఎంత పెట్టుబడి పెట్టాలి వంటి విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.
మీరు ప్రైమరీ మార్కెట్లో డబ్బు సంపాదించాలని ప్లాన్ చేస్తున్నారా అయితే సంహి హోటల్స్ ఐపీఓ రేపటి నుంచి తెరుచుకోబోతోంది. ఈ మధ్యకాలంలో లిస్ట్ అయినటువంటి ఐపివోలు మంచి రిటర్న్ అందించాయి ముఖ్యంగా ఏరోప్లేక్స్ ఇండస్ట్రీస్ ఐపిఓ ఏకంగా 85% రిటర్న్ అందించింది. విష్ణు ప్రకాష్ ఐ పి ఓ 64% రిటర్న్ అందించగా, రత్నవిర్ ఐపిఓ 30% రిటర్న్ అందించింది. ఈ నేపథ్యంలో రాబోయే ఐపిఓలపై కూడా ఇన్వెస్టర్లు ఓ కన్ను వేసి ఉంచారు. ముఖ్యంగా స్టాక్ మార్కెట్ చాలా మంచి రేంజ్ లో వెళుతున్న నేపథ్యంలో ప్రైమరీ మార్కెట్ ద్వారా లాభాలు పొందవచ్చని ఇన్వెస్టర్లు ఆశిస్తున్నారు.
సంహి హోటల్స్ IPO రేపు తెరుచుకోనుంది. ఇది సెప్టెంబర్ 18 వరకు బిడ్‌లు లేదా దరఖాస్తుల కోసం తెరిచి ఉంటుంది. కంపెనీ ఐపీఓ ద్వారా రూ.1,370.10 కోట్లు సమీకరించాలని యోచిస్తోంది. మార్చి 31, 2023 నాటికి భారతదేశంలోని 14 ప్రధాన నగరాల్లో 31 ఆపరేటింగ్ హోటళ్లతో సంహి హోటల్స్ 4,801 గదుల పోర్ట్‌ఫోలియోను కలిగి ఉంది. ఫిబ్రవరి 2023 నాటికి భారతదేశంలోని మారియట్ , హాలిడే ఇన్ ఎక్స్‌ప్రెస్ బ్రాండ్‌ల ద్వారా కంపెనీ విస్తరించాలని చేస్తుంది. ఈ కంపెనీ మారియట్, హయాత్ , IHG వంటి గ్లోబల్ హోటల్ ఆపరేటర్‌లతో దీర్ఘకాలిక ఒప్పందాల క్రింద పని చేస్తుంది.
సంహీ హోటల్స్ IPO ఎప్పుడు తెరుచుకోనుంది: Samhi హోటల్స్ IPO సెప్టెంబర్ 14న సబ్‌స్క్రిప్షన్ కోసం తెరవబడుతుంది , సోమవారం అంటే సెప్టెంబర్ 18న ముగుస్తుంది. సెప్టెంబర్ 13 నుండి యాంకర్ ఇన్వెస్టర్ల బిడ్‌లు తెరుచుకోనుంది.
సంహి హోటల్స్ IPO ప్రైస్ బ్యాండ్?
ఈ ఇష్యూకి ఒక్కో షేరు ధరను రూ.119 నుంచి రూ.126గా కంపెనీ నిర్ణయించింది. ప్రతి షేరు ముఖ విలువ రూ 1గా నిర్ణయించారు. సంహీ హోటల్స్ తన IPOలో భాగంగా రూ. 1,200 కోట్ల విలువైన కొత్త ఈక్విటీ షేర్లను జారీ చేస్తుంది. అలాగే, కంపెనీ IPOలో ప్రస్తుత వాటాదారుల ద్వారా 1.35 కోట్ల ఈక్విటీ షేర్ల ఆఫర్ ఫర్ సేల్ (OFS) ఉంటుంది. ప్రైస్ బ్యాండ్ ఎగువన, సంహీ హోటల్స్ ఇష్యూ ద్వారా రూ. 1,370 కోట్ల వరకు సమీకరించాలని యోచిస్తోంది.
సంహి హోటల్స్ IPO లాట్ సైజు
సంహి హోటల్స్ IPO , లాట్ పరిమాణం 119 షేర్లు. ఏ రిటైల్ ఇన్వెస్టర్‌కైనా కనీస పెట్టుబడి మొత్తం రూ.14,994 గా నిర్ణయించారు. నేటి తాజా గ్రే మార్కెట్ ధర , ఇష్యూ ధరను పరిశీలిస్తే, సంహి హోటల్స్ షేర్లు రూ. 161 లేదా 27.78 శాతం ప్రీమియంతో లిస్ట్ అవుతుందని భావిస్తున్నారు.