Rupee vs Dollar: 48 పైసలు పడిపోయి ఆల్ టైమ్ కనిష్టనికి రూపాయి.. ఈ కారణాల వల్ల పతనం..

స్టాక్ మార్కెట్ డేటా ప్రకారం, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (ఎఫ్‌ఐఐలు) క్యాపిటల్ మార్కెట్‌లో నెట్(net) విక్రయదారులుగా ఉన్నారు. శుక్రవారం రూ.3,309.76 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు.
 

Rupee vs Dollar: Rupee closed at all-time low, fell by 48 paise, dollar strengthened due to these reasons-sak

శుక్రవారం డాలర్‌తో రూపాయి మారకం విలువ 48 పైసలు క్షీణించి ఆల్ టైమ్ కనిష్ట స్థాయి 83.61 వద్ద ముగిసింది. ప్రధాన విదేశీ కరెన్సీలతో పోలిస్తే డాలర్ బలపడటం, ఆసియా కరెన్సీల బలహీనత కారణంగా రూపాయి క్షీణించింది. దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ కూడా రూపాయి సెంటిమెంట్‌పై ప్రభావం చూపిందని మార్కెట్ వర్గాలు తెలిపాయి. అంతకుముందు డిసెంబర్ 13, 2023న రూపాయి దాని కనిష్ట స్థాయి 83.40కి చేరుకుంది.

ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్‌లో డాలర్‌తో రూపాయి మారకం విలువ 83.28 వద్ద బలహీనంగా ప్రారంభమైంది. డే  ట్రేడింగ్‌లో 83.65 కనిష్ట స్థాయికి దిగజారింది. గత ట్రేడింగ్ సెషన్‌లో దేశీయ కరెన్సీ డాలర్‌కు 83.13 వద్ద ముగిసింది.  ఆరు ప్రధాన కరెన్సీలతో US డాలర్ స్థానాన్ని అంచనా వేసే డాలర్ ఇండెక్స్ 0.31 శాతం పెరిగి 104.32 వద్దకు చేరుకుంది.

స్టాక్ మార్కెట్ డేటా ప్రకారం, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (ఎఫ్‌ఐఐలు) క్యాపిటల్ మార్కెట్‌లో నెట్  సెల్లర్స్ గా ఉన్నారు. శుక్రవారం రూ.3,309.76 కోట్ల విలువైన షేర్లను   విక్రయించారు.

ఈ కారణాల వల్ల డాలర్ బలపడింది.
బలహీనమైన యూరో, పౌండ్ కారణంగా డాలర్ బలపడిందని బీఎన్‌పీ పరిబాస్‌(BNP Paribas)కి చెందిన షేర్‌ఖాన్‌లో పరిశోధన విశ్లేషకుడు అనుజ్ చౌదరి తెలిపారు. స్విస్ నేషనల్ బ్యాంక్ వడ్డీ రేట్లను 0.25 శాతంతో  1.5 శాతానికి తగ్గించడం ద్వారా మార్కెట్లను ఆశ్చర్యపరిచినందున యూరో పడిపోయింది. ఇది జూన్ 2024లో యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశాన్ని పెంచింది. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వడ్డీ రేటును 5.25 శాతం వద్ద స్థిరంగా ఉంచిన తర్వాత పౌండ్ కూడా క్షీణించింది. బలమైన US ఆర్థిక డేటా కూడా డాలర్‌కు మద్దతు ఇచ్చింది.

ప్రపంచ మార్కెట్లలో విలువైన లోహాల ధరలు తగ్గుముఖం 
శుక్రవారం ఢిల్లీ బులియన్ మార్కెట్‌లో బంగారం ధర  రూ.67,000 దిగువకు పడిపోయి 10 గ్రాములకు రూ.66,575 వద్ద ముగిసింది. వెండి ధర కూడా రూ.760 తగ్గి కిలో ధర రూ.76,990 వద్ద ముగిసింది. ప్రాఫిట్ బుకింగ్, డాలర్ ఇండెక్స్ భారీగా పెరగడం వల్ల బంగారం ధరలు ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయి నుంచి దాదాపు 2 శాతం మేర తగ్గాయని జేఎం ఫైనాన్షియల్ అండ్ బ్లింక్ ఎక్స్ రీసెర్చ్ (కమోడిటీ-కరెన్సీ) వైస్ ప్రెసిడెంట్ ప్రణవ్ మెర్ తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్సు బంగారం ధర $2,167 డాలర్ల వద్ద బలహీనంగా ఉంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios