ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రకటించడంతో డాలర్‌తో మన రూపాయి విలువ పతనమైంది. దీంతో డాలర్‌తో రూపాయి మారకం రేటు మరింతగా క్షీణించింది.
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రకటించడంతో డాలర్‌తో మన రూపాయి విలువ పతనమైంది. దీంతో డాలర్‌తో రూపాయి మారకం రేటు మరింతగా క్షీణించింది. గురువారం ఆరంభంలో డాలర్‌తో రూ.75.02 వద్ద ప్రారంభమైన రూపాయి ఇంట్రాడేలో ఒక దశలో రూ.75.75కు పడిపోయింది. చివరికి 99 పైసల నష్టంతో రూ.75.66 వద్ద ముగిసింది. చమురు మంట, స్టాక్ మార్కెట్లో కొనసాగిన అమ్మకాలు ఇందుకు మరింత తోడయ్యాయి. గురువారం ట్రేడింగ్‌లో రూ. 75.66 వద్ద ముగిసింది. విదేశీ ఫండ్స్ బయటకు వెళ్తుండటంతోపాటు, దేశీయ స్టాక్ మార్కెట్లో అమ్మకాలు, క్రూడ్ రేట్ల పెరుగుదల వంటి అంశాలన్నీ ఫారెక్స్ మార్కెట్లో ఇన్వెస్టర్ సెంటిమెంట్‌ను దెబ్బ తీసినట్లు మార్కెట్ నిపుణులు తెలిపారు.
రూ. 75.02 వద్ద మొదలయిన రూపాయి, ఒక దశలో రూ. 75.75 కి పడిపోయింది. చివరలో కొద్దిగా కోలుకుని రూ. 75.66 వద్ద ముగిసింది. ఆసియా కరెన్సీలలో ఎక్కువగా పతనమైంది మన రూపాయేనని విశ్లేషకులు పేర్కొన్నారు. ఆసియా స్టాక్ మార్కెట్లు మొత్తం 2 నుంచి 3శాతం వరకు నష్టపోయాయి.దాదాపు ఏడేళ్ల తర్వాత బ్యారెల్ చమురు ధర 100 డాలర్లను దాటింది. ఉక్రెయిన్ సరిహద్దుల వద్ద రష్యా దళాల మోహరింపులు మొదలైన నాటి నుంచి చమురు ధరలు వేగంగా పెరుగుతూ వచ్చాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఆయిల్ ఎగుమతి దేశాల్లో ఒకటైన రష్యాపై ఇతర దేశాలు మరిన్ని ఆంక్షలు విధిస్తే ఆయిల్ ధరలు మరింత పెరుగుతాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
గ్లోబల్ మార్కెట్ల తరహాలోనే మన మార్కెట్లు నష్టపోయాయి. యుద్ధ భయంతోపాటు, క్రూడ్ రేటు కూడా ఈ మహాపతనానికి కారణమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీలు 5 శాతం పడిపోయాయి. రష్యా మార్కెట్లైతే ఏకంగా 30 శాతం పతనమయ్యాయి. యుద్ధ భయం గత వారం రోజులుగా ఉన్నప్పటికీ, అది గురువారం మొదలవడం మార్కెట్లను బలమైన దెబ్బతీసింది.
వచ్చే మూడు నుండి నాలుగు సెషన్ల వరకు ఉద్రిక్తతలు ఎక్కువగా ఉంటాయి. ఆ తర్వాత మార్కెట్లు స్థిరంగా ఉంటాయి. వాస్తవానికి రష్యా ఉక్రెయిన్‌పై దాడి చేయడం యూఎస్ మరియు దాని మిత్రదేశాలు రష్యాపై తీవ్రమైన ఆంక్షలు విధించడం వల్ల కలిగే పరిణామాల గురించి ప్రతికూల అంశాలను మార్కెట్లు ఇప్పటికే తగ్గించడం ప్రారంభించాయి. రష్యాపై అమెరికా మరియు దాని మిత్రదేశాలు విధించబోయే తాజా ఆంక్షలు ఎలా ఉంటాయోనని మార్కెట్ నిపుణులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
క్రూడాయిల్ ధరల పెరుగుదల ఈ సంక్షోభానికి ప్రధాన పతనంగా కనిపిస్తోందని మెక్లాయ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వైస్ ప్రెసిడెంట్ రితేష్ భన్సాలీ వివరించారు. రాబోయే రెండు వారాల పాటు రూపాయి ఒత్తిడిలో ఉండి.. ఆపై స్థిరంగా ఉండే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. మార్చి ఎల్లప్పుడూ రూపాయికి మంచి నెలగా ఉంటుంది. మార్చిలో LIC IPO, మరికొన్ని IPOల నేపథ్యంలో రూపాయి విలువ తిరిగి పుంజుకునే అవకాశం ఉంది.
ప్రపంచ మార్కెట్లకు ముడి చమురు, సహజ వాయువు ప్రధానంగా సరఫరా చేసేది రష్యా. ముడి చమురు ఉత్పత్తిలో రెండవ స్థానంలో ఉన్న రష్యా, యూరోపియన్ దేశాలకు గణనీయమైన భాగాన్ని విక్రయిస్తుంది. రష్యన్ సహజ వాయువులో దాదాపు మూడింట ఒక వంతు యూరోపియన్ మార్కెట్లకు సరఫరా చేస్తుంది.
US డాలర్ ఇండెక్స్ 0.5 శాతానికి పైగా లాభపడి 96.90 స్థాయికి సమీపంలో ట్రేడ్ కాగా.. జనవరి చివరి నుండి ఇదే అత్యధికం. US 10 సంవత్సరాల ఒప్పంద సంస్థ ఈల్డ్ బుధవారం గరిష్ట స్థాయి 2 శాతం నుండి 1.88 శాతానికి చేరుకుంది. ఉక్రెయిన్‌లో కొనసాగుతున్న శత్రుత్వాల నేపథ్యంలో మార్చిలో జరిగే సమావేశంలో ఫెడ్ ఫండ్స్ రేటును 50 బేసిస్ పాయింట్లు పెంచుతుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు US డాలర్‌తో పోలిస్తే రష్యన్ రూబుల్ రికార్డు స్థాయికి పడిపోయింది.
