ప్రస్తుతం ఉన్న వడ్డీ రేట్లను రిజర్వ్ బ్యాంక్ యథాతథంగా కొనసాగించాలని నిర్ణయం తీసుకొంది.
న్యూఢిల్లీ: ప్రస్తుతం ఉన్న వడ్డీ రేట్లను రిజర్వ్ బ్యాంక్ యథాతథంగా కొనసాగించాలని నిర్ణయం తీసుకొంది. ఆర్బీఐ శుక్రవారం నాడు ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్షలో ఈ నిర్ణయం తీసుకొంది.
ప్రస్తుతం ఉన్న వడ్డీ రేట్లను 0.25 శాతం మేరకు వడ్డీ రేటును పెంచవచ్చని ఆర్థిక నిపుణులు అంచనా వేశారు. కానీ , అందరి అంచనాలను తలకిందులు చేస్తూ వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించాలని ఆర్బీఐ నిర్ణయం తీసుకొంది.
ఆరుగురు సభ్యులతో కూడిన ద్రవ్య పరపతి విధాన కమిటీ వడ్డీరేట్లను యధాతథంగా ఉంచేందుకే ఆర్బీఐ మొగ్గు చూపింది. ప్రస్తుతం రేపో రేటు 6.5శాతం వద్ద ఉండగా, రివర్స్ రేపో రేటు 6.25గానే ఉంది.
ఆర్‌బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల కమిటీలో ఐదుగురు యథాపూర్వస్థితిని కొనసాగించేందుకు ఓటు వేశారు. చేతన్ ఘాటీ మాత్రం వడ్డీ రేట్లను 0.25శాతం పెంచాలని ప్రతిపాదించారు. ఇటీవల పెట్రోలు, డీజిల్‌పై కేంద్రం ప్రభుత్వం తగ్గించిన ఎక్సైజ్ డ్యూటీ ద్రవ్యోల్బణం అదుపునకు సహకరిస్తుందని ఉర్జిత్ పటేల్ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు
