ఉక్రెయిన్‌పై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ యుద్ధ ప్రకటన నేపథ్యంలో రష్యా రూబుల్ రికార్డ్ కనిష్టానికి పడిపోయింది. రష్యా రూబుల్‌తో పాటు ఉక్రెయిన్ కరెన్సీ కూడా క్షీణించింది.
ఉక్రెయిన్‌పై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ యుద్ధ ప్రకటన నేపథ్యంలో రష్యా రూబుల్ రికార్డ్ కనిష్టానికి పడిపోయింది. రష్యా రూబుల్‌తో పాటు ఉక్రెయిన్ కరెన్సీ కూడా క్షీణించింది. యుద్ధానికి ముందే ఈ కరెన్సీలు పడిపోయాయి. యుద్ధ ప్రకటన తర్వాత గురువారం రూబుల్ రికార్డ్ కనిష్టానికి పతనమైంది. ఉక్రెయిన్ నగరాలపై రష్యా క్షిపణి దాడుల తర్వాత యూరో స్విస్ ఫ్రాంక్‌కు అనేక సంవత్సరాల కనిష్టానికి పడిపోయింది.
రష్యా తమపై దండయాత్ర ప్రారంభించిందని ఉక్రెయిన్ చెప్పిన అనంతరం ఆస్ట్రేలియా డాలర్ వంటి కమోడిటీ లింక్డ్ కరెన్సీలు కూడా క్షీణించాయి. సేఫ్ హెవెన్‌గా భావించే యెన్, అమెరికా డాలర్లకు డిమాండ్ పెరిగింది. డాలర్ మారంకతో రూబుల్ 5.77 శాతం తగ్గింది. జనవరి 31వ తేదీ నుండి యూరో 0.84 శాతం క్షీణించింది. అయితే ఆ తర్వాత కోలుకుంది.
పుతిన్ యుద్ధ ప్రకటన నేపథ్యంలో రూబుల్, రష్యన్ స్టాక్ మార్కెట్ పరిమితుల కంటే దిగువకు పడిపోయింది. దీంతో మాస్కో ఎక్స్చేంజీలో ట్రేడింగ్ నిలిపివేశారు. ఉక్రెయిన్ పైన రష్యా యుద్ధ ప్రకటన నేపథ్యంలో మార్కెట్లు కుప్పకూలాయి. సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారం ధర అమాంతం పెరిగింది.
