ఇంటర్నెట్ వినియోగం ఇండియాలో గణనీయంగా పెరుగుతోంది అనడానికి ఇదే నిదర్శనం. ఇండియాలో ప్రతి సెకనుకు 600కి పైగా యాప్స్ డౌన్‌లోడ్లు, సగటు భారతీయుడు నెలకు 10.4జి‌బి కంటే ఎక్కువ డేటాను వినియోగిస్తున్నాడు.


కోవిడ్ -19, లాక్ డౌన్ సమయంలో 25% పెరిగిన డేటా వినియోగం
నాలుగు సంవత్సరాల క్రితం 2016 సెప్టెంబరులో జరిగిన రిలయన్స్ ఏ‌జి‌ఎంలో 230 దేశాలలో మొబైల్ ఇంటర్నెట్ వాడకంలో ప్రపంచంలో 155వ స్థానంలో ఉన్న భారతదేశం, టాప్ టెన్ లీగ్‌కు ఎదగాలని ఆర్‌ఐ‌ఎల్ సి‌ఎం‌డి ముఖేష్ అంబానీ అన్నారు.

5 సెప్టెంబర్ 2016న భారతదేశంలో మొదటి 4జి ఎల్‌టిఇ సేవలను ప్రారంభించిన రిలయన్స్ జియో కేవలం 4 సంవత్సరాలలో దేశంలోని మొత్తం డేటా వినియోగం నెలకు 300 మిలియన్ జిబి నుండి 6 బిలియన్ జిబిలకు పెరిగింది అన్నారు. ఈ మొత్తం డేటా వినియోగంలో 60% జియో కస్టమర్లు ఉండటం ఆసక్తికరం.

పెరిగిన డేటా వినియోగం: మొబైల్ డేటా ట్రాఫిక్‌లో నెలకు 1900% పెరుగుదల ఏర్పడింది. 2015లో నెలకు 30 కోట్ల జీబీ నుండి 2020లో 600 కోట్ల జీబీ వరకు చేరింది.

మొబైల్ డేటా వాడకంలో 4200% పెరుగుదల: 
ట్రాయ్ నివేదిక ప్రకారం 2016లో నెలకు 0.24జి‌బి నుండి 2020లో 10.4 జి‌బి వరకు వినియోగం పెరిగింది. ఒక స్టాండర్డ్ మూవీ డౌన్‌లోడ్ చేయలంటే 1.5 GB అవసరం కాబట్టి నెలకు 1 నుండి 6 సినిమా డౌన్ లోడ్ చేసుకునే వారు కానీ ప్రస్తుతం నెలకు 7 సినిమాలు  డౌన్ లోడ్ చేసుకుంటున్నారు.

2016లో ఒక మూవీ డౌన్‌లోడ్‌కు రూ.266  చెల్లించాల్సి ఉండేది కానీ ఇప్పుడు 2020లో ఒక మూవీ డౌన్‌లోడ్‌కు రూ.18 మాత్రమే సరిపోతుంది.

also read ఎంటీఆర్‌ ఫుడ్స్‌ చేతికి ఈస్టర్న్‌ మసాలా బ్రాండ్‌.. త్వరలో రెండు కంపెనీల విలీనం.. ...

డేటా ధరలు:
ఇప్పుడు సగటున నలుగురు కస్టమర్లు నెలకు 50జి‌బిని వినియోగిస్తున్నారు, దీని ధర రూ.400 నుండి రూ.500 వరకు ఉంటుంది. నాలుగు సంవత్సరాల క్రితం, జియో వాణిజ్యపరంగా ప్రారంభించడానికి ముందు సగటు డేటా ధర 1జి‌బికి రూ. 185 నుండి రూ.200 వరకు ఉంది, అంటే 50జి‌బి వినియోగానికి సుమారు రూ.10,000 ఖర్చు అవుతుంది. 

డేటా ధరలో 1400% తగ్గుదల- ఒక జిబి ధర రూ.185 నుండి ప్రస్తుతం రూ.12కి చేరింది.

 నెలకు 100% పెరిగిన వాయిస్ కాల్స్ వినియోగం
గతంలో కాల్స్ వినియోగం నెలకు 366 నిమిషాలు నుండి నేటికీ  712 నిమిషాలకు పెరిగింది. భారతదేశంలో యాప్ డౌన్‌లోడ్ కూడా 190% పెరిగింది. 2019లో 19 బిలియన్ యాప్స్ డౌన్‌లోడ్ జరిగాయి, 2016లో 6.55 బిలియన్ల నుండి ఈ పెరుగుదల నమోదు చేసింది. అంటే సెకనుకు 602 యాప్స్ భారతదేశంలో డౌన్‌లోడ్ చేస్తున్నారు.

న్యారో డిజిటల్ డివైడ్
గ్రామీణ భారతదేశం కూడా డిజిటల్ డివైడ్ ద్వారా చాలా ప్రయోజనం పొందింది, గత 4 సంవత్సరాలలో గ్రామీణ భారతదేశంలో 160 మిలియన్లకు పైగా బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారులు పెరిగారు, వీటిలో ఎక్కువ భాగం జియో వినియోగదారులే .

గ్రామీణ ఇంటర్నెట్ సబ్ స్క్రైబర్స్ లో 125% పెరుగుదల
గ్రామీణ ప్రాంతంలో ఇంటర్నెట్ సబ్ స్క్రైబర్స్ 2016లో 11.97 కోట్ల నుండి 2020లో 26.84 కోట్లకు పెరిగారు, అంటే  70% కంటే ఎక్కువ పెరుగుదల నమోదైంది.