Asianet News TeluguAsianet News Telugu

హెచ్ సి ఎల్ అధినేత్రి రోష్ని నాడార్ గురించి ఆసక్తికర అంశాలు...

2013లో హెచ్ సి ఎల్ కంపెనీలోకి అడుగిడిన రోష్ని నాడార్ సంవత్సర కాలంలోనే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సీఈఓ స్థాయికి చేరుకుంది. ఆమె బోర్డు వైస్ చైర్మన్ గా కొనసాగుతున్నారు కూడా. 

Roshni Nadar Malhotra, India's Wealthiest Woman, New Chief Of HCL,
Author
Bengaluru, First Published Jul 18, 2020, 7:29 AM IST

హెచ్ సి ఎల్ కార్పొరేషన్ చైర్మన్ గా రోష్ని నాడార్ మల్హోత్రా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. హెచ్ సి ఎల్ టెక్నాలజీస్ చైర్మన్ గా శివ నాడార్ తప్పుకొని తన కూతురు రోష్ని నాడార్ కు పట్టం కట్టడంతో.... ఇప్పుడు దేశంలోనే తొలి లిస్టెడ్ ఇట్ కంపెనీ చైర్మన్ పదవిని చేపట్టిన మహిళగా రికార్డు సృష్టించారు. 

శివ నాడార్ చైర్మ పదవితోపాటుగా బోర్డు నుండి సైతం తప్పుకున్నారు. ఆయన బోర్డునుండి తప్పుకున్నప్పటికీ.... కంపెనీ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా కొనసాగుతారని, చీఫ్‌ స్ట్రాటజీ ఆఫీసర్‌ హోదాలో ఆయన ఈ పదవిలో ఉంటారని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. 

2013లో హెచ్ సి ఎల్ కంపెనీలోకి అడుగిడిన రోష్ని నాడార్ సంవత్సర కాలంలోనే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సీఈఓ స్థాయికి చేరుకుంది. ఆమె బోర్డు వైస్ చైర్మన్ గా కొనసాగుతున్నారు కూడా. 

హెచ్ సి ఎల్ కార్పొరేషన్ కింద...   హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, హెచ్‌సీఎల్‌ ఇన్ఫోసిస్టమ్స్‌, హెస్‌సీఎల్‌ హెల్త్‌కేర్‌ సంస్థలు ఉన్నాయి. ఆమె ఈ సంస్థలన్నిటికి కూడా ఇప్పుడు చైర్మన్ గా వ్యవహరించనున్నారు. 

రోష్ని నాడార్ గురించి మరికొన్ని విషయాలు... 

నార్త్ వెస్ట్రన్ యూనివర్సిటీ నుండి కమ్యూనికేషన్స్ లో రేడియో/టీవీ/ఫిలిమ్స్ స్పెషలైజేషన్ తో డిగ్రీ పూర్తి చేసిన రోష్ని అనేక సంస్థల్లో ప్రొడ్యూసర్ గా పని చేసింది. స్కై న్యూస్, సిఎన్ఎన్ వంటి ఛానళ్లలో న్యూస్ ప్రొడ్యూసర్ గా ఆమె పనిచేసారు. 

ఆ తరువాత కెల్లొగ్ మానేజ్మెంట్ స్కూల్ నుండి ఎంబీఏ పూర్తిచేసి హెచ్ సి ఎల్ లో అడుగుపెట్టారు. ఒక్క సంవత్సరంలోనే ఆమె కంపెనీ సీఈఓ స్థాయికి ఎదిగారు. అప్పుడు ఆమె వయసు 27 సంవత్సరాలు మాత్రమే. 

రోష్ని భర్త శివ్ మల్హోత్రా హెచ్ సి ఎల్ కార్పొరేషన్‌ ఎగ్జిక్యూటివ్‌  డైరెక్టర్‌ గా, హెచ్‌సీఎల్‌ హెల్త్‌కేర్‌ వైస్‌ చైర్మన్ గా‌, శివ్‌ నాడార్‌ ఫౌండేషన్‌ ట్రస్టీగా కొనసాగుతున్నారు. 2010లో వీరి వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు. 

ప్రస్తుతానికి ఆమె దేశంలోనే అత్యంత ధనవంతురాలు. ఆమె వ్యక్తిగత ఆస్తి దాదాపుగా 36 వేల కోట్ల పైమాటే.  2019లో ఫోర్బ్స్‌ విడుదల చేసిన ‘ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన 100 మహిళల’ జాబితాలో రోష్ని నాడార్‌కు 54వ స్థానం లభించింది.

పర్యావరణ, జంతు ప్రేమికురాలిగా రోష్ని అనేక అవార్డులను సైతం అందుకున్నారు. ఆమె గొప్ప ధన గుణం కలిగింది కూడా. ఇప్పటివరకు మూడు సార్లు ఆమె వివిధ ప్రఖ్యాత సంస్థల ఫిలాన్తరోపిస్ట్ అవార్డును అందుకున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios