దేశీయంగా బంగారం ధరలకు శనివారం రెక్కలు వచ్చాయి. ఫెస్టివల్ సీజన్ కలిసి రావడంతో పాటు, అంతర్జాతీయంగా బంగారం ధరలు పుంజుకోవడంతో దేశీయంగా పసిడి ప్రేమికుల ఆశలపై నీళ్లు చల్లుతోంది. 

Gold Rates Today: దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. పది గ్రాముల బంగారం ధర రూ.51,300 వద్ద ట్రేడవుతోంది. హెచ్‌డిఎఫ్‌సి సెక్యూరిటీస్ ప్రకారం, రూపాయి రికార్డు స్థాయిలో పతనమైందన్న వార్తలతో బంగారం ధర స్వల్పంగా పెరిగింది. క్రితం ట్రేడింగ్ సెషన్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.51,263గా ఉంది.

వెండి ధరలు బలపడ్డాయి. శుక్రవారం కిలో వెండి ధర రూ.311 పెరిగి రూ.62,022 వద్ద ట్రేడవుతోంది. గత సెషన్‌లో రూ.61,711 వద్ద ట్రేడవుతోంది.

శుక్రవారం మార్కెట్‌లో రూపాయి బలహీనపడి 82.33 కనిష్ట స్థాయికి చేరుకుంది. 16 పైసలు క్షీణించింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ఔన్స్‌కు 1711.16 డాలర్ల వద్ద బలహీనంగా ట్రేడవుతుండగా, వెండి ఔన్స్‌కు స్వల్పంగా పెరిగి 20.73 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

బంగారానికి డిమాండ్ పెరగడం, రూపాయి విలువ క్షీణించడం వంటి కారణాలతో మార్కెట్‌లో లోహం పుంజుకుంటోందని హెచ్‌డిఎఫ్‌సి సెక్యూరిటీస్ రీసెర్చ్ అనలిస్ట్ దిలీప్ పర్మార్ అభిప్రాయపడ్డారు.

అలాగే ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర సైతం పెరిగింది. ప్రస్తుతం దీని ధర రూ.47,350గా పలుకుతోంది. ఇక హైదరాబాద్ లో సైతం పసిడి ధర పెరిగింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో రూ.51,660గా పలుకుతోంది. 

ఇదిలా ఉంటే పండగ నేపథ్యంలో పసిడి ధరలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రపంచ మార్కెట్లో కూడా బంగారం ధర పెరుగుతోంది. డాలర్ బలపడటంతో పసిడి ధరకు రెక్కలు వచ్చాయి. మరో వైపు స్టాక్ మార్కెట్ కూడా అస్థిరంగా ఉంది. దీంతో ఇన్వెస్టర్లు పసిడిపై పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. 

అటు అంతర్జాతీయంగా పసిడి ధరలు వరుసగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఔన్సు పసిడ ధర అమెరికాలో 1700 డాలర్లు పైగా పలుకుతోంది. దీంతో దేశీయంగా కూడా పసిడి ధరలు పెరుగుతున్నాయి. ఇక దీపావళి సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో పసిడి ఆభరణాలు కొనేందుకు ప్రజలు ఆసక్తి చూపిస్తుంటారు. దీంతో బంగారం ధరలకు రెక్కలు వచ్చాయి.