రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ దేశం మరింతగా విస్తారించేందుకు సిద్దమవుతుంది. రిటైల్‌, టెలికం రంగంలో గత కొన్ని వారాలుగా భారీ పెట్టుబడులు పొందిన సంగతి తెలిసిందే.

తాజాగా దక్షిణాదికి చెందిన బజాజ్‌ ఎలక్ట్రానిక్స్‌ను కొనుగోలు చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఒప్పందం విలువ సుమారు 3 వేల కోట్లు ఉంటుందని అంచనా.

also read చైనాలో 1 రోజులో అత్యంత సంపన్నుడిగా మారిన వాటర్- బాటిల్ వ్యాపారవేత్త.. ...

బజాజ్ ఎలక్ట్రానిక్స్ దక్షిణ భారతదేశంలో 60 స్టోర్లను  1,200 మంది ఉద్యోగులతో నిర్వహిస్తోంది. ఈ విషయం పై ముందస్తు చర్చలు జరుగుతున్నాయి,  అడిగే ధర రూ .3,000 కోట్లు.

వ్యాపారవేత్త పవన్ కుమార్ బజాజ్ 1980 లో బజాజ్ ఎలక్ట్రానిక్స్  ప్రారంభించారు, తరువాత దాని పేరును ఈ‌ఎం‌ఐ లిమిటెడ్ గా మార్చారు. ఒకవేళ ఈ డీల్ విజయవంతమైతే రిలయన్స్ రిటైల్ కు మరింత  ప్రోత్సాహాన్ని ఇస్తుంది.

లాక్ డౌన్ సమయంలో దేశంలో అన్నీ సంస్థలు నష్టాలను చూస్తే రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, జియో ఫ్లాట్ ఫార్మ్ లో భారీగా పెట్టుబడులను పొందింది. ఇందులో భాగంగా సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ కూడా భారీగా పెట్టుబడులను పెట్టింది.