భారత సైన్యంపై రిచా చద్దా చేసిన ట్వీట్‌ దేశ వ్యాప్తంగా కలకలం రేపుతోంది.  నార్తర్న్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది మాటలపై రిచా వెటకారంగా సైనికుల త్యాగాలను ఎగతాళి చేయడంతో అసలు రచ్చ మొదలైంది. పెరుగుతున్న రచ్చ చూసి ఇప్పుడు రిచా ఓ లాంగ్ పోస్ట్ రాసి క్షమాపణలు చెప్పింది. కానీ ఆమె బ్రాండ్ ఎంబాసిడర్ గా ఉన్న కంపెనీలకు మాత్రం నెటిజన్లు చుక్కలు చూపిస్తున్నారు.

గాల్వాన్ వ్యాలీలో 2020లో భారత సైనికులు చేసిన త్యాగాన్ని ఎగతాళి చేస్తూ ఫ్రముఖ బాలివుడ్ నటి రిచా చద్దా చేసిన ట్వీట్ దేశ వ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది. గాల్వాన్ లోయలో సైనికుల త్యాగాన్ని తక్కువ చేసేలా ట్వీట్ చేసిన వివాదాస్పద నటి రిచా చద్దాపై పలువురు నెటిజన్లు మండి పడుతున్నారు. అంతేకాదు ఆమె నటించిన సినిమాలను బ్యాన్ చేయాలని, అలాగే ఆమె బ్రాండింగ్ చేసిన మామాస్ ఎర్త్ ప్రాడక్టులను కొనుగోలు చేయవద్దని నెటిజన్లు ట్విట్టర్ సాక్షిగా మండి పడుతున్నారు. ఇదిలా ఉంటే రిచా చద్దా గురువారం క్షమాపణలు చెప్పడం గమనార్హం.

రిచా చేసిన ట్వీట్ ప్రస్తుతం ఆమె బ్రాండ్ ఎంబాసిడర్ గా పనిచేసిన మామా ఎర్త్ కంపెనీకి చిక్కులు తెచ్చిపెట్టింది. మామా ఎర్త్ గురుగ్రామ్‌లో ఉన్న స్టార్టప్ కంపెనీ. ఇది పిల్లలు, పెద్దలకు టాక్సిన్ లేని, సహజమైన చర్మ, ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తులను అందిస్తుంది. అయితే రిచా చేసిన ట్వీట్ పై మామాస్ ఎర్త్ కూడా స్పందించింది. తమ కంపెనీ ఇలాంటి వ్యాఖ్యలకు ఎలాంటి మద్దతు ఇవ్వదని, చద్దా చేసిన ట్వీట్ ను ఖండిస్తున్నట్లు మామాస్ ఎర్త్ ట్విట్టర్ లో ఒక వివరణ సైతం విడుదల చేసింది.

మరోవైపు పూర్తి వివరాల్లోకి వెళితే ఆర్మీ నార్తర్న్ కమాండ్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది చేసిన ప్రకటనపై రిచా చేసిన స్పందన ఈ వివాదానికి కేంద్రంగా మారింది. దీంతో ఆమె తన ట్వీట్‌ను తొలగించింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ (PoK)పై తిరిగి నియంత్రణ సాధించేందుకు భారత సైన్యం ప్రభుత్వం నుండి ఆదేశాల కోసం ఎదురుచూస్తోందని సైనిక అధికారి తన ప్రకటనలో తెలిపారు. దీనిపై రిచా స్పందిస్తూ, "గాల్వన్ హాయ్ (హలో) చెబుతున్నాడు" అని ట్వీట్ చేసింది. రిచా చేసిన ట్వీట్ వైరల్ అయ్యింది. దీంతో చాలా మంది ఆమెను ట్విట్టర్‌ వేదికగా నిందించారు భారత సైనికుల బలిదానాన్ని ఎగతాళి చేశారని ఆరోపించారు.

వివిధ విషయాలపై ముక్కుసూటిగా వ్యాఖ్యలు చేస్తున్న రిచా చద్దా.. భారత సైన్యం మనోభావాలను దెబ్బతీయకూడదని పలువురు సూచించారు. దీనిపై ఆమె స్పందిస్తూ “ఇది నా ఉద్దేశ్యం కాదు, అయినప్పటికీ వివాదం లేవనెత్తిన మూడు పదాలు, ఎవరినైనా బాధించి ఉంటే, నేను క్షమాపణలు కోరుతున్నాను, నా మాటలలో అలాంటి భావన ఏదైనా ఉంటే క్షమించండి. సైన్యంలో నా సోదరులు. మా అమ్మానాన్న కూడా సైన్యంలో ఉండేవారు. అని గుర్తు చేసుకున్నారు. సాయుధ దళాలకు తన కుటుంబం సహకారాన్ని హైలైట్ చేస్తూ, తన తండ్రి ఇండియన్ ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్ అని, 1965 చైనా-ఇండియన్ యుద్ధంలో కాలుకు బుల్లెట్ గాయం అయ్యిందని గుర్తు చేశారు. 

Scroll to load tweet…
Scroll to load tweet…


దేశ భక్తి తన రక్తంలో ఉందని. దేశానికి సేవ చేస్తున్నప్పుడు సైనికులు గాయపడితే, మొత్తం కుటుంబం ప్రభావితమవుతుంది. ఇది నాకు భావోద్వేగ సమస్య." అని వివరించారు.