Asianet News TeluguAsianet News Telugu

ఉద్యోగులకు ఊరట...ఆదాయం స్వల్పంగా రూ. 7 లక్షలు దాటినా జీరో టాక్స్...ఎలాగో లెక్కలతో సహా తెలుసుకోండి..

కొత్త పన్ను విధానంలో రూ. 7 లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉన్న వ్యక్తులు కూడా జీరో ఆదాయపు పన్ను ప్రయోజనాన్ని పొందగలుగుతారు. దీని కింద రూ.7.27 లక్షల వరకు సంపాదిస్తున్న వారు జీరో ట్యాక్స్ ప్రయోజనం పొందవచ్చు.

Relief to those with more than 7 lakh income Finance Minister made this change in New Tax Regime MKA
Author
First Published Mar 25, 2023, 3:23 AM IST

2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఫైనాన్స్ బిల్లు లోక్‌సభలో ఆమోదించారు. ఈ సమయంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బిల్లుపై మాట్లాడే ముందు ఆమె అత్యల్ప పన్ను చెల్లింపుదారులకు ఉపశమనం కలిగించారు. వార్షిక ఆదాయం రూ. 7 లక్షల కంటే కొంచెం ఎక్కువ ఉన్న వారికి పన్ను మినహాయింపు ప్రకటించారు. 

మంత్రి నిర్మలా సీతారామన్ అతి పెద్ద ప్రకటన చేస్తూ, కొత్త పన్ను విధానం ఎంచుకొని రూ. 7 లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉన్న వ్యక్తులు కూడా జీరో పన్ను ప్రయోజనాన్ని పొందగలరని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. రూ. 7 లక్షల కంటే కొంచెం ఎక్కువ ఆదాయం ఉన్నవారికి ఈ ప్రయోజనం అందుబాటులో ఉంటుంది. అంటే రూ. 7 లక్షల కంటే కొంచెం ఎక్కువ అంటే రూ. 100, 1000, 2500 వరకు ఎక్కువ ఆదాయం ఉన్నవారు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ఇందుకు సంబంధించి అవసరమైన సవరణలతో ఆర్థిక బిల్లు శుక్రవారం లోక్‌సభలో ఆమోదం పొందింది.

లెక్క ఇలా ఉంటుంది

కొత్త పన్ను విధానంలో, పన్ను చెల్లింపుదారుడు వార్షిక ఆదాయం రూ. 7 లక్షలు కలిగి ఉంటే, అతను ఎటువంటి ఆదాయపు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. పాత విధానంలో ఒక వ్యక్తి ఆదాయం రూ. 7,00,100 అయితే, అతనిపై పన్ను బాధ్యత రూ. 25,010 అవుతుంది. అంటే కేవలం రూ.100 అదనపు ఆదాయం వల్ల పన్ను చెల్లింపుదారులు రూ.25,010 పన్ను చెల్లించాల్సి వచ్చేది. అయితే ఇప్పుడు సవరణ ద్వారా  ఉపశమనం లభించింది. తద్వారా తక్కువ మార్జిన్‌ ఉన్న వారు సున్నా పన్ను ప్రయోజనం పొందలేని పన్ను చెల్లింపుదారులు కూడా దాని ప్రయోజనాన్ని పొందవచ్చు.

కొత్త పన్ను విధానంలో అనేక మార్పులు చేశారు

2023-24 బడ్జెట్‌లో, కొత్త పన్ను విధానంలో, రూ. 7 లక్షల వరకు వార్షిక ఆదాయం ఉన్న వ్యక్తులకు పన్ను మినహాయింపు ప్రకటించబడింది, దీని కింద పన్ను విధించబడదు. ఉద్యోగులను కొత్త పన్ను విధానంలోకి మార్చడానికి ఈ చర్య ఒక పుష్ అని నిపుణులు భావిస్తున్నారు,  పెట్టుబడులపై మినహాయింపు ఇవ్వలేదు. కొత్త పన్ను విధానంలో, రూ. 3 లక్షల వరకు ఆదాయంపై ఎలాంటి పన్ను విధించడం లేదు. రూ.3-6 లక్షల మధ్య ఆదాయంపై 5 శాతం పన్ను ఉంటుంది. ఇది కాకుండా రూ.6-9 లక్షలపై 10 శాతం, రూ.9-12 లక్షలపై 15 శాతం, రూ.12-15 లక్షలపై 20 శాతం, రూ.15 లక్షలు ఆపైన ఆదాయంపై 30 శాతం పన్ను విధించనున్నారు. అదనంగా, కొత్త విధానంలో రూ. 50,000 స్టాండర్డ్ డిడక్షన్ అనుమతి ఇచ్చారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios